వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ స్ట్రాటజీ ... చంద్రబాబు టీమ్ కు చెక్ .. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో బాబుకు బాసటగా ఎవరు ?

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ లో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నా చంద్రబాబుకు బాసటగా కేవలం ఆ ముగ్గురు మాత్రమే కనిపిస్తారు. వారి గొంతు మాత్రమే వినిపిస్తోంది. చంద్రబాబు కు బాసటగా ఒక ముగ్గురు మాత్రమే నోరు ఎత్తుతున్నారు. టీడీపీని శాసనసభలో వారే కాపాడుతున్నారు. ఇక ఇప్పుడు ఆ ముగ్గురిపైనే అసెంబ్లీలో సస్పెన్షన్ వేటు పడింది. ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా ఈ సమావేశాలు ముగిసే దాకా సస్పెండ్ చేస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు చంద్రబాబుకు బాసటగా నిలిచేది ఎవరు ? ఆయనతో పాటు వైసీపీ చేసే మాటల దాడిని ఎదుర్కొనేది ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది .

అమిత్ షా తో భేటీ అయిన వివేక్ ... లైన్ క్లియర్ ... కానీ అదే అడ్డు అమిత్ షా తో భేటీ అయిన వివేక్ ... లైన్ క్లియర్ ... కానీ అదే అడ్డు

ఏపీ అసెంబ్లీలో బాబుకు బాసటగా నిలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో బాబుకు బాసటగా నిలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

టిడిపి ఎమ్మెల్యేలు 23 మంది. చంద్రబాబు కాకుండా 22 మంది ఉన్నా అసెంబ్లీలో నోరెత్తి మాట్లాడేది. .. వైసీపీ మాటల దాడికి కౌంటర్ ఇచ్చేది .. వైసీపీ ని ఇరకాటంలో పెట్టేలా ప్రశ్నలు సంధించేది మాత్రం ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలే .. వారే అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామా నాయుడు . టీడీపీకి ఉన్న బలం కేవలం 23 మంది మాత్రమే అయిన కానీ, 150 మంది ఉన్న వైసీపీ సభ్యులతో పోరాడుతున్నారంటే దానికి కారణం టీడీపీలోని ఈ ముగ్గురు కీలకమైన నేతలే అని చెప్పాలి. చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ గా నిలబడుతూ, అసెంబ్లీలో పార్టీని కాపాడుకుంటూ , సమర్ధంగా అధికార పార్టీని ఎదుర్కొంటున్న ముగ్గురు కూడా ఈ రోజు అసెంబ్లీ నుండి సస్పెండ్ అయ్యారు.

ఆ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తో సభలో చంద్రబాబు ఒంటరి పోరాటం చేస్తారా ?

ఆ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తో సభలో చంద్రబాబు ఒంటరి పోరాటం చేస్తారా ?

ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మహిళలకు ఇస్తామన్న పెన్షన్ గురించి జరిగిన చర్చల్లో వైసీపీ సమాధానం ఇచ్చినా టీడీపీ నాయకులు ఇంకా చర్చ పెట్టాలని పట్టు పట్టి ఆందోళ‌కు దిగారు. ముఖ్య‌మంత్రి జగన్ , అలాగే ఆర్దిక మంత్రి బుగ్గన సూచించినా వారు విన‌క‌పోవ‌టంతో అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖా మంత్రి ముగ్గురు టీడీపీ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌కు తీర్మానం ప్ర‌తిపాదించారు. దీంతో అచ్చెన్నాయుడు.. బుచ్చ‌య్య చౌద‌రి , రామా నాయుడు పైన స‌స్పెన్ష‌న్ వేటు వేసారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయటం టీడీపీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇది చంద్రబాబు కానీ , టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఊహించని పరిణామం. ఎందుకంటే టీడీపీ నుండి అసెంబ్లీలో గట్టిగా గళం వినిపిస్తుంది వీళ్ళ ముగ్గురే, టీడీపీ తరుపున 80 % సమయాన్ని ఉపయోగించుకొని మాట్లాడిన నేతలు ఈ ముగ్గురూ . అలాంటి వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో లేకపోవటం, సస్పెండ్ కావటం టీడీపీకి బలం తగ్గినట్లు అవుతుంది . ఇక చంద్రబాబు ఒక్కడే వైసీపీ పార్టీ ఎదురుదాడికి నిలబడి తట్టుకోవటం కష్టమే అని చెప్పాలి.

జగన్ స్ట్రాటజీతో చంద్రబాబు విలవిల .. బాబుకు బాసటగా ఉండేది ఎవరు ?

జగన్ స్ట్రాటజీతో చంద్రబాబు విలవిల .. బాబుకు బాసటగా ఉండేది ఎవరు ?

ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుండీ వైసీపీ పార్టీ ఆ ముగ్గురి నుండి అసెంబ్లీలో ఇబ్బంది పడుతూనే ఉంది. ప్రతిదానికి సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు మొండిగా నిలబడి టీడీపీని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు . ఇది మొదటి నుండి జగన్ కి అసలు మింగుడు పడని విషయం. సభలో తక్కువ మంది సభ్యులున్నా ధీటుగా పోరాటం చేస్తున్న తీరుతో జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీని ఎదుర్కోవాలని భావించారు. అయితే సభలో చాలా మంది ఉండటం లేదని గమనించిన జగన్ ప్రతి రోజు అటెండెన్స్ తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డికి సూచించారు. ఇక తాజాగా సభలో గందరగోళం చేశారని టీడీపీ నుండి మాటల దాడి చేస్తున్న ముగ్గురినీ బయటకు పంపారు. అయితే కావాలనే తమను సస్పెండ్ చేశారని , తమపై సస్పెన్షన్ ఎత్తివేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు . ఏది ఏమైనా జగన్ స్ట్రాటజీ ఇప్పుడు చంద్రబాబును అసెంబ్లీలో ఒంటరిని చేసిందా .. లేకా మిగతా నేతలు ఎవరైనా ఈ ముగ్గురిలా టీడీపీ గళాన్ని వినిపించే బాధ్యత తీసుకుంటారా అన్నది చూడాల్సి వుంది.

English summary
Only the three TDP MLAs have been supporting and attcking at the YCP attack in assembly . Only three MLAs - AchteNaidu, Nimmala Ramanaidu and Gorantla Buchayya Chaudhary - are fighting with the ruling party. but today they were suspended .However, they have suspended themselves and demanded that the suspension be lifted. However, Jagan's strategy has now made Chandrababu alone in the assembly.It remains to be seen whether any of the other leaders will take the responsibility of making the TDP sound like these three.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X