వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ అనే నేను..: 30న జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం :సాయంత్రం చంద్ర‌బాబు రాజీనామా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election Results 2019 : ఈ రోజు సాయంత్రం చంద్ర‌బాబు రాజీనామా..! || Oneindia Telugu

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈ సాయంత్రం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. ఇప్ప‌టికే వైసీపీ గెలుపు ఖాయం అవ్వ‌టంతో రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎన్నికైన ఎమ్మెల్యేల‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇడుపుల పాయ‌లో శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసారు.25న జ‌రిగే స‌మావేశంలో జ‌గ‌న్‌ను త‌మ నేత‌గా ఎన్నుకుంటారు. ఈనెల 30వ తేదీన ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

 30న జ‌గ‌న్ అనే నేను..

30న జ‌గ‌న్ అనే నేను..

త‌న తండ్రి మ‌ర‌ణంతో రాజ‌కీయంగా విప‌త్ర ప‌రిస్థితులు ఎదుర్కొన్న జ‌గ‌న్ త‌న చిర‌కాల వాంఛ అయిన ఏపీ ముఖ్య‌మంత్రిగా ఈనెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. తొలుత ఈనెల 26నే ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖ‌రారు చేసారు. అయితే విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానంద స్వామీజీ సూచ‌న‌ల మేర‌కు జ‌గ‌న్ ఈనెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని సూచించారు. దీనికి అనుగుణంగా జ‌గ‌న్ విజ‌య‌వాడ‌- గుంటూరు జాతీయ ర‌హ‌దారి పైన ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ ఎదురుగా ఉన్న ఓపెన్ స్థ‌లంలో ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని నిర్ణ‌యించారు. జ‌గ‌న్‌తో పాటుగా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

25న ఇడుపుల పాయ‌లో వైసీపీఎల్పీ స‌మావేశం...

25న ఇడుపుల పాయ‌లో వైసీపీఎల్పీ స‌మావేశం...

వైసీపీ నుండి ఎన్న‌కైన ఎమ్మెల్యేల‌తో వైసీపీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం ఈనెల 25న ఇడుపుల పాయ‌లో జ‌ర‌గ‌నుంది. వైయ‌స్ ఘాట్ వ‌ద్ద ఈ స‌మావేశం ఏర్పాటు చేసారు. వైయ‌స్సార్ కు నివాళి అర్పించిన త‌రువాత జ‌రిగే స‌మావేశంలో జ‌గ‌న్‌ను త‌మ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఎన్నుకుంటారు. ఆ త‌రువాత శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశ తీర్మానాన్ని స్వ‌యంగా గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌చేయ‌నున్నారు.

రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్ రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్

సాయంత్రం చంద్ర‌బాబు రాజీనామా...

సాయంత్రం చంద్ర‌బాబు రాజీనామా...

ప‌రాజయం ఖాయం అవ్వ‌టంతో ఈ సాయంత్రం ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు త‌న ప‌దవికి రాజీనామా చేసి ఆ వెంట‌నే హైద‌రాబాద్ వెళ్లి గ‌వ‌ర్న‌ర్‌కు త‌న రాజీనామా అందించ‌నున్నారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యే వ‌ర‌కూ చంద్ర‌బాబును ఆప‌ధ్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగాల‌ని గ‌వ‌ర్న‌ర్ కోర‌నున్నారు. వైసీపీ గెలుపుతో ఆ పార్టీ నేత‌ల్లో..శ్రేణుల్లో ఆకాశ‌మే హ‌ద్దుగా సంబ‌రాల్లో మునిగి పోయారు.

English summary
YS Jagan decided to sworn as CM of AP on 30th May. In AP Election counting YCP may cross 150 seats . To day evening CM Chandra babu decided to resign and submit to Governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X