విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరం ప్రాజెక్ట్ చూడకుండా...గోదావరి జిల్లా దాటిన వ్యక్తి జగన్:మంత్రి ఉమా

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ మరోసారి ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు చూడ‌కుండానే గోదావ‌రి జిల్లా దాటిన వ్యక్తి జ‌గ‌న్ అని ఆయన విమర్శించారు. శుక్రవారంనాడు జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో మంత్రి ఉమా మీడియాతో మాట్లాడారు.

Recommended Video

సిఎం చంద్రబాబు పోలవరం నిధుల గురించి గడ్కరీకి లెటర్

పట్టిసీమపై కాంగ్రెస్, వైసీపీ నేత‌లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టికి ఇప్పటి వ‌ర‌కూ నీరు రాలేదని, అయినా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తుంటే కుళ్లుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈనెల 11న కేంద్ర మంత్రి గడ్కరీ రాష్ట్రానికి రానున్నట్లు మంత్రి దేవినేని ఉమా తెలిపారు.

నీటి తరలింపు...రికార్డు

నీటి తరలింపు...రికార్డు

గోదావరి డెల్టా మూడో పంటకు కూడా నీరు ఇస్తామని, ఇప్పటివరకు ప్రాజెక్టులకు 54 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి దేవినేని ఉమ చెప్పారు. నీటిని ఒక బేసిన్ నుండి మరో బేసిన్‌కు 105 టీఎంసీలు తరలించడం ఒక రికార్డు అని మంత్రి దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వటమే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

వాళ్లే వీళ్లు...జగన్ కు బుద్ది

వాళ్లే వీళ్లు...జగన్ కు బుద్ది

పట్టిసీమను అందరూ అభినందిస్తుంటే జ‌గ‌న్‌కు కనిపించడం లేదా?...అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలే వైసీపీ బీజేపీ నేతల గా రూపాంతరం చెందుతున్నారన్నారు. బిజెపి వైసీపీ జనసేన మూడు పార్టీలు తోడుదొంగలని, బొత్స, కన్నా, ధర్మాన పదేళ్లుగా మంత్రులుగా ఉండి ఏపీకి ఏం చేశారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ కి బుద్ధి చెబుతారని అన్నారు.

ఈ నెలలోనే...టెండర్లు

ఈ నెలలోనే...టెండర్లు


వైసీపీ ఎమ్మెల్యే లు అసెంబ్లీకి రారని, పార్లమెంట్ కు ఎంపీలు వెళ్ళరని, వీరికి రాష్ట్ర ప్రయోజనాల అవసరం లేదని మంత్రి ఉమా దుయ్యబట్టారు. వైకుంఠపురం బ్యారేజ్‌కు ఈ నెల‌లో టెండ‌ర్లను పిలుస్తున్నామని మంత్రి తెలిపారు. 10 టీఎంసీల సామర్థ్యంతో వైకుంఠపురం బ్యారేజ్‌ నిర్మాణం ఉంటుందన్నారు.
గోదావ‌రి-పెన్నా అనుసంధానంతో సోమ‌శిల‌, పెన్నా, కండ‌లేరు ఆయ‌క‌ట్టు స్థిరీకరణ చేస్తామని తెలిపారు.

గడ్కరీ రాక

గడ్కరీ రాక

ఎంపి విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నలు వేస్తూ పక్కరాష్ట్రాలకు సమాచారం ఇస్తున్నారని మంత్రి ఉమ ఆరోపించారు. ఈనెల 11న కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి దేవినేని ఉమా తెలిపారు.

English summary
Vijayawada: Water Resources Minister Devineni Uma once again criticized Opposition Leader Jagan. He is the person who crossed the Godavari district without watching the Polavaram project. On Friday, he spoke to the media at the Water Resources Department office in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X