వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్య సభ సభ్యురాలిగా కిల్లి కృపారాణికి ఛాన్స్ !!... స్థానిక వైసీపీ నేతల విముఖత .. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

గతంలో యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లీకృపారాణికి జగన్ సముచిత స్థానం ఇవ్వబోతున్నారా ? గత ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన కిల్లి కృపారాణికి రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారా? ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్న రాజకీయ పరిస్థితులు కిల్లీకృపారాణికి సానుకూలంగా మారుతున్నాయా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

కానీ కిల్లి కృపా రాణికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనకు స్థానిక వైసీపీ నాయకత్వం మాత్రం విముఖత వ్యక్తం చేస్తుంది. అందుకు కారణం లేకపోలేదు.

కిల్లి కృపారాణి విషయంలో శ్రీకాకుళం స్థానిక వైసీపీ నేతల ఆగ్రహం .. పార్టీ కోసం ఆమె పని చెయ్యలేదని ఆరోపణలు

కిల్లి కృపారాణి విషయంలో శ్రీకాకుళం స్థానిక వైసీపీ నేతల ఆగ్రహం .. పార్టీ కోసం ఆమె పని చెయ్యలేదని ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన, యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి, గత ఎన్నికలకు ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం నుండి ఎంపీగా కానీ, టెక్కలి ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని జగన్ ను కోరిన ఆమె ఆలస్యంగా పార్టీలో చేరటంతో అప్పటికే ఆయా స్థానాలలో పార్టీ ఇంచార్జ్ గా పనిచేస్తున్న వారికి టికెట్లు ఇస్తానని జగన్ చెప్పిన నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇవ్వలేదు జగన్. అయినప్పటికీ కిల్లి కృపారాణి జగన్ పైనే భరోసా వైసీపీలో కొనసాగుతున్నారు. కానీ స్థానిక నాయకులు మాత్రం గత ఎన్నికల సమయంలో ఆమెకు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో ఆమె పార్టీ కోసం ఏ మాత్రం పని చెయ్యలేదని ఆరోపిస్తున్నారు .

<strong>జనసేన ఎమ్మెల్యే రాపాక షాకింగ్ కామెంట్స్..! ఆ ఎస్సై ఓ సైకో..!! </strong>జనసేన ఎమ్మెల్యే రాపాక షాకింగ్ కామెంట్స్..! ఆ ఎస్సై ఓ సైకో..!!

ఉత్తరాంధ్రలో పట్టు కోసం జగన్ వ్యూహం

ఉత్తరాంధ్రలో పట్టు కోసం జగన్ వ్యూహం


2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో కిల్లి కృపారాణి శ్రీకాకుళం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆమె కేంద్ర మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు పై అనూహ్య విజయం సాధించడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర విభజన అనంతరం కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో కొనసాగినా, అంతగా ప్రభావాన్ని చూపలేకపోయారు అని టాక్ ఉంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె గత ఎన్నికల ముందు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. టికెట్ ఆశించినా సాధ్యం కాకపోవటంతో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు జగన్ ఆమెకు చాన్స్ ఇచ్చ్చే ఆలోచనలో ఉన్నారు.

 కిల్లి కృపారాణికి చాన్స్ ఇవ్వొద్దని వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకత్వం

కిల్లి కృపారాణికి చాన్స్ ఇవ్వొద్దని వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకత్వం

కిల్లి కృపారాణి కోరిన రెండు స్థానాలలో వైసీపీ అభ్యర్ధులు పరాజయం పాలుకావడం, శ్రీకాకుళం నుండి ఎంపీగా రామ్మోహన్నాయుడు, టెక్కలి ఎమ్మెల్యే గా అచ్చెన్నాయుడు విజయం సాధించడం ఉత్తరాంధ్రలో వైసిపిని బలహీనం చేశాయి. దీంతో ఉత్తరాంధ్రలో పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి . ఈ క్రమంలోనే కిల్లీకృపారాణికి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశమిస్తే ఉత్తరాంధ్ర మీద పట్టు సాధించినట్లుగా అవుతుందని కిల్లి కృపారాణి కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ ఆ దిశగా నిర్ణయం తీసుకోవటం మంచిది కాదని ముందు నుండీ పని చేస్తున్న వైసీపీ నేతలు చెప్తున్నారు. వైసీపీ నేతలైన పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ ల గెలుపు కోసం ఆమె ఎంత మాత్రమూ పని చెయ్యలేదని , తనకు టికెట్ దక్కలేదనే అక్కసుతోనే ఆమె పార్టీ అభ్యర్థుల కోసం కృషి చెయ్యలేదని శ్రీకాకుళం జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు.

కిల్లి కృపారాణి విషయంలో వ్యతిరేకతకు కారణాలివే

కిల్లి కృపారాణి విషయంలో వ్యతిరేకతకు కారణాలివే

అయితే ఎన్నికల ముందు వైకాపాలో చేరిన కిల్లి కృపారాణి పట్ల సొంత పార్టీ నేతల్లో చాలా అసహనం ఉంది. గత ఎన్నికల సమయంలో ఆమె పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎలాంటి కృషి చేయలేదనే కారణం అటుంచితే , పార్టీ కోసం మొదట నుండీ పని చేస్తున్న నాయకులకు కాకుండా గత ఎన్నికల ముందు వైసీపీ లో చేరిన ఆమెకు ఎలా అవకాశం ఇస్తారనే వాదన కూడా వుంది. ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా చేస్తే పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని జిల్లాలోని వైసీపీ నేతలు వాదిస్తున్నారు . స్థానిక పార్టీ నేతల్లో ఒక వేళ కిల్లి కృపారాణికి అవకాశం ఇస్తే స్థానికంగా తమ ప్రాధాన్యత తగ్గుతుందన్న భావన కూడా ఉన్న నేపధ్యంలో ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి కిల్లి కృపారాణి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
అది ఉత్తరాంధ్ర పార్టీని బలోపేతం చేస్తుందా లేకా అంతర్గత విబేధాలకు కారణం అవుతుందా అనేది కూడా ఆసక్తికర అంశం .

English summary
Former Union Minister Killi Kruparani has joined YSRCP ahead of the election. In the recent election, she could not get the chance to contest the election as her desire to contest from Tekkali on MLA ticket and Srikakulam MP ticket could not be fulfilled as party chief has already offered the same tickets to others. Killi Kruparani was only confined to party campaigning in the election. Now, it is learned from party sources that CM Jagan Mohan Reddy may send the senior leader Killi Kruparani to Rajya Sabha. It is said that by sending her to Rajya Sabha, she may play a key role in checking Tekkali TDP MLA Atchannaidu Kinjarapu and Srikakulam MP Ram Mohan Naidu Kinjarapu as she hails from Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X