వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌కు స్వామీజీ ఆత్మీయ ముద్దులు: రాజ‌శ్యామ‌ల యాగం: ఏకాంత భేటీ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విశాఖ‌లోని శార‌దా పీఠాన్ని ద‌ర్శించుకున్నారు. చాలా కాలంగా జ‌గ‌న్ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి సూచ‌న‌ల మేర‌కు న‌డుచుకుంటున్నారు. పాద‌యాత్ర మొద‌లు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కూ ప్ర‌తీ ముహూర్తం ఆయ‌న నిర్ణ‌యించిన‌దే. రాజ‌శ్యామ‌ల అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న జ‌గ‌న్ అక్క‌డి పూజ‌ల్లో పాల్గొన్నారు. జ‌గ‌న్‌కు స్వామీజీ ఆత్మీయంగా ముద్దులు ఇచ్చారు.

శార‌దాపీఠంలో సీఎం జ‌గ‌న్..
విశాఖ‌లోని శారదాపీఠంను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంద‌ర్శించారు. ఆయ‌న‌కు శార‌దా పీఠం వ‌ద్ద వేద పండితులు ఆయ‌న‌కు పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. జగన్ సంప్రదాయ దుస్తులలో వెళ్లి స్వామీజీని కలిశారు.ఈ సందర్భం గా స్వామీజీ కూడా జగన్ దగ్గరకు తీసుకున్నారు. ఆ తర్వాత జగన్ కింద ఆశీనులు కాగా, స్వామీజి ఆయనకు బెట్టు పెట్టి ఆశీర్వచనం అందచేశారు.

Jagan visited Sarada Peetham swamiji Swaroopanandendra in Vizag. Jagan taken blessings from him

సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్‌ జగన్‌ స్వరూపానందేంద్ర స్వామికి కానుకలు సమర్పించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుని.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తనను కలిసేందుకు వచ్చిన జగన్‌ను స్వరూపానంద స్వామి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దాడారు. సీఎం జగన్‌తో స్వరూపానంద ఏకాంతంగా చర్చలు జరిపారు.

స్వామీజీ సూచ‌న‌ల మేర‌కే...
ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యం నుండి జ‌గ‌న్ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి స్వామీజీతో సంబంధాలు ఏర్ప‌డ్డాయి. గ‌తంలో అనేక సార్లు జ‌గ‌న్ కోసం స్వామిజీ ప్ర‌త్యేక పూజ‌లు చేసారు. జ‌గ‌న్ ప్రారంభించే ముహూర్తాల‌ను ఆయ‌న ఖ‌రారు చేసేవారు. పాద‌యాత్ర మొద‌లు ఎంపీ అభ్య‌ర్దుల‌ను రాత్రి స‌మ‌యంలో ప్ర‌క‌టించిన ముహూర్తం.. మొత్తం పార్టీ అభ్య‌ర్దుల జాబితా ప్ర‌క‌ట‌న‌..ఎన్నిక‌ల ప్ర‌చార ప్రారంభం.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మ‌ణ స్వీకారం వంటి ప్ర‌తీ ముహూర్తం ఆయ‌న ఖ‌రారు చేసిందే.

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌టం కోసం స్వామీజీ రాజ శ్యామ‌ల యాగం నిర్వ‌హించా రు. గ‌తంలో తెలంగాణ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత కేసీఆర్ సైతం ఇదే పీఠానికి వ‌చ్చి స్వామీజీ ఆశీర్వాదం తీసుకు న్నారు. ఇక‌, ఈనెల తాను 8వ తేదీన సచివాలయంలోకి ప్ర‌వేశం..కేబినెట్ విస్త‌ర‌ణ వంటి అంశాల పైన స్వ‌రూపానంద తో జ‌గ‌న్ చర్చించిన‌ట్లుగా స‌మాచారం.

English summary
AP CM Jagan visited Sarada Peetham swamiji Swaroopanandendra in Vizag. Jagan taken blessings from him. Jagan performed Raja syamala yagam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X