వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా, లక్ష్మీపార్వతి పైర్: బాబును తిడ్తుంటే జగన్ ముసిముసిగా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

తణుకు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోయిన రైతులు, డ్వాక్రా సంఘాలకు అండగా ఉండేందుకే దీక్ష చేపట్టానని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రెండు రోజుల దీక్ష చేస్తున్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

రుణమాఫీ విషయంలో మోసపోయిన వారు ఎవరైనా తమ బాధలను ఈ దీక్షా వేదిక నుండి చెప్పుకోవచ్చునని తెలిపారు. జగన్ శనివారం తణుకులో రైతు దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన రెండు నిమిషాలు ప్రసంగించి, దీక్షకు ఉపక్రమించారు. చంద్రబాబు మోసాల పైన తాను సవివరంగా మాట్లాడుతానని చెప్పారు. జగన్ దీక్షా వేదికలో ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

నిర్దేశిత సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా తణుకుకు చేరుకున్న వైయస్ జగన్‌ నేరుగా దీక్షాప్రాంగణానికి చేరుకున్నారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

కొద్దిసేపు మాట్లాడిన తర్వాత దీక్షలో కూర్చుండిపోయారు. అనంతరం డ్వాక్రా మహిళలను మాట్లాడాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

వీరు చంద్రబాబు తమను మోసం చేశారని దుమ్మెత్తి పోశారు. ఇప్పుడిప్పుడే తాము మోసపోయిన విషయం అర్థమవుతుందన్నారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

కొందరు మహిళలు చంద్రబాబుపై మాటలదాడి చేస్తున్న సమయంలో దీక్షలో ఉన్న జగన్‌ ముసిముసి నవ్వులతో కనిపించారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

కాసేపు మహిళలు మాట్లాడిన తర్వాత పార్టీ నేతలు మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు లేనిపోని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని పట్టించుకోకుండా ఇప్పుడు ముక్కుమూసుకుని జపం చేస్తున్నారని ఆరోపించారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

జనం తిట్టుకున్నా తనకు వినపడదన్నట్టుగా యోగ నిద్రలోకి వెళ్తున్నారని వైసీపీ మహిళా అధ్యక్షురాలు రోజా ఎద్దేవా చేశారు. కాబట్టే తాము రెండు రోజుల దీక్షకు దిగాల్సి వచ్చిందని రోజా చెప్పారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

దేశంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందంటే అది టీడీపీయేనని వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి విమర్శించారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

చంద్రబాబు నాయుడు గతంలో చేసిన తప్పిదాలనే తిరిగి కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

రాజధాని పేరిట అడ్డగోలుగా భూసేకరణ చేసి రైతులకు అన్యాయం చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోందని వైసీపీ నేత వంగవీటి రాధ దుయ్యబట్టారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రైతు దీక్ష ప్రారంభోపన్యాసంలో ఆయన ఈ విధంగా అన్నారు. ఆయన క్లుప్తంగా మాట్లాడారు.

రైతు దీక్ష

రైతు దీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను, డ్వాక్రా అక్కచెల్లెళ్లను మోసం చేశారని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా మోసపోతున్న రైతులకు, డ్వాక్రా అక్కాచెల్లెళ్లకు అండగా నిలబడేందుకు ఈ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

ఇంతకు ముందు మండల, జిల్లా కేంద్రాల్లో ముట్టడి కార్యక్రమాలు నిర్వహించామని, దాని కొసనాగింపుగా ఇప్పుడు తుణుకు రైతు దీక్ష చేపట్టామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ దీక్ష చేస్తున్నట్లు చెప్పారు.

రైతు దీక్ష

రైతు దీక్ష

పనులను వదులుకుని, ఎండను సైతం లెక్క చేయకుండా, కష్టమైనా ఓర్చి రైతుల కోసం, డ్వాక్రా అక్కాచెల్లెళ్ల కోసం జరుగుతున్న ఈ దీక్షకు వేల సంఖ్యలో సంఘీభావం తెలిపేందుకు వచ్చారని, వారి ఆప్యాయతకు చేతులు జోడించి, శిరసు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ అన్నారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

రుణమాఫీపై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, కిరిరికి కోటయ్య కమిటీ వేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైయస్ జగన్ అన్నారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

మనకు సమర్థుడైన నాయకుడు దొరికాడని అంతకు ముందు ప్రసంగించిన పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాద రావు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

 రైతు దీక్ష

రైతు దీక్ష

ప్రజాశక్తితో చంద్రబాబును నిలదీద్దామని ఆయన అన్నారు. జగన్ ప్రసంగం ముగిసిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఒక్కరొక్కరే దీక్ష శిబిరం వేదిక మీంచి మాట్లాడుతూ వెళ్లారు.

English summary
YSR Congress president YS Jaganmohan Reddy on Saturday began his two-day hunger strike on the issue of farm loan waiver in this delta town of West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X