• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిమ్మగడ్డ -జగన్ వార్: మధ్యలో మోదీ -ఎన్నికల వివాదంలోకి కేంద్రాన్ని లాగిన ఏపీ -రేపు ప్రధానితో సీఎం భేటీ

|

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు మధ్య కొనసాగుతోన్న వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. కరోనాను కారణంగా చూపుతూ పంచాయితీ ఎన్నికల వాయిదాకు జగన్ సర్కారు యత్నిస్తుండగా, ఎన్నికల నిర్వహణపై పూర్తి అధికారాలు తనవేనంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకంగా షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. దీంతో జగన్ సర్కారు.. నిమ్మగడ్డ తీరును ఖండిస్తూ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఆ పోరాటంలోకి మోదీ సర్కారును కూడా లాగింది. దీనిపై విచారణ జరుగనున్న సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ కానుండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

Home Loan: బ్యాంకు బంపరాఫర్ -సున్నా వడ్డీతో 20 ఏళ్ల కాల పరిమితికి హోమ్ లోన్ -ఇవీ వివరాలు..

ఏపీలో ఆంక్షలు..

ఏపీలో ఆంక్షలు..

స్థానిక ఎన్నికల విషయంలో జగన్ సర్కారు, ఎన్నికల కమిషన్ పోటాపోటీగా వ్యవహరిస్తుండటం, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలన్న కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ ఇద్దరూ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు రెచ్చగొట్టే చర్యలకు దిగుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంమైంది. ఏపీ ఐఏఎస్ అధికారులు శనివారం నిమ్మగడ్డను కలిసి ఎన్నికలు వద్దని రిక్వెస్ట్ చేయగా, ఆయన మాత్రం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేశారు. కోడ్ అమల్లోకి వచ్చేసిందంటూ ఆంక్షలు సైతం విధించారు.

4 దశల్లో పంచాయితీ ఎన్నికలు

4 దశల్లో పంచాయితీ ఎన్నికలు

మొత్తం నాలుగు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని, జనవరి 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా ఫిబ్రవరి 5న తొలిదశ, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ పోలింగ్ నిర్వహిస్తామని ఎస్ఈసీ తెలిపారు. షెడ్యూల్ ప్రకటనతో శనివారం నుంచే ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమలులోకి వచ్చిందని, పాత సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు త‌ప్ప కొత్త ప‌థ‌కాల‌ను వేటిని కోడ్ స‌మ‌యంలో ప్ర‌క‌టించరాదని నిమ్మగడ్డ నిషేధం విధించారు. ఈ మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్ఈసీ లేఖ రాశారు. ఈ చర్యను ప్రభుత్వం బాహాటంగా ఖండించింది. ఇక..

తండ్రి అక్రమ సంబంధంతో కూతుళ్ల విరక్తి -భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య -ప్రేయసికి షాక్

నిమ్మగడ్డపై మళ్లీ న్యాయపోరాటం..

నిమ్మగడ్డపై మళ్లీ న్యాయపోరాటం..

ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంలో ఇప్పటికే పలు మార్లు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తిన్న జగన్ సర్కారు.. మరోసారి న్యాయపోరాటానికి దిగింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కీలక జడ్జిలుగా కొత్త వాళ్లు నియమితులైన నేపథ్యంలో ఈసారి విచారణ తీరు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ విుదల చేసిన షెడ్యూల్ ను సవాలు చేస్తూ ఏపీ సర్కార్ శనివారం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలో కరోనా రెండో దశ, స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్నాయని చెప్పినా ఎస్ఈసీ ఇవేవీ పరిగణంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఎన్నికల కోడ్ పేరుతో బదిలీల నిలుపుదల, అభివృద్ధి పథకాల అడ్డగింత అప్రజాస్వామికమని నిమ్మగడ్డపై ఏపీ సర్కార్ మండిపడింది. కోర్టు ఆదేశాల మేరకు జరిగిన సంప్రదింపుల ప్రక్రియను నిమ్మగడ్డ అపహాస్యం చేశారని పిటిషన్ లో పేర్కొంది. అంతేకాదు..

కేంద్రాన్ని లాగిన ఏపీ సర్కార్

కేంద్రాన్ని లాగిన ఏపీ సర్కార్

ఏపీలో స్థానిక ఎన్నికల వివాదానికి సంబంధించి జగన్ వర్సెస్ నిమ్మగడ్డగా కొనసాగుతోన్న వివాదంలోకి దాదాపు తొలిసారి కేంద్రాన్ని లాగారు. కరోనా వ్యాక్సినేషన్ పై గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుండటం, జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తుండటాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల నిర్వహణకు కేటాయిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని జగన్ సర్కారు పిటిషన్ లో పేర్కొంది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డతోపాటు అమిత్ షా నేతృత్వంలో కేంద్ర హోం శాఖను, డాక్టర్ హర్షవర్థన్ చూస్తోన్న కేంద్ర ఆరోగ్య శాఖలను, వాటి కార్యదర్శులను కూడా వ్యక్తిగత ప్రతివాదులుగా చేర్చింది ఏపీ సర్కారు. తద్వారా ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని బీజేపీ పార్టీ మాత్రం స్థానికానికి సై అంటుండగా.. కేంద్రం ఎలాంటి అభిప్రాయం చెబుతుందో ఇంకొద్ది రోజుల్లో తేలనుంది. మరోవైపు..

ప్రధాని మోదీతో సీఎం జగన్ ఫేస్ టైమ్

ప్రధాని మోదీతో సీఎం జగన్ ఫేస్ టైమ్

స్థానిక ఎన్నికల వివాదంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చిన ఏపీ సర్కారు.. కేంద్రం చెబుతోన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ లెక్క చేయడం లేదని విమర్శలు గుప్పిస్తోంది. దేశమంతటితో కిలిపి ఏపీలోనూ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీతో ఈనెల 11న(సోమవారం) ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని హౌజ్ మోషన్ పిటిషన్ లో ప్రభుత్వం తెలిపింది. తొలి విడత వ్యాక్సినేషన్ అవసరమైన వారిని గుర్తించడంతోపాటు అధికారులు డేటా రూపొందిస్తున్నారని, ఇంతటి కీలక సమయంలో ఎన్నికలు వద్దని పిటిషన్ లో పేర్కొంది. దీన్ని హైకోర్టు సోమవారమే విచారించనుంది. మరోవైపు.. సుప్రీంకోర్టులోనూ నిమ్మగడ్డ తీరుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది.

English summary
Row over andhra pradesh local body elections has taken a new turn amid ap sec nimmagadda ramesh kumar issued schedule. ate ap govt lodged petition agings nimmagadda and includes central government as defendant in the row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X