వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డకు దిమ్మతిరిగేలా జగన్ షాక్ -స్థానిక ఎన్నికలపై వ్యాక్సిన్ అస్త్రం -హైకోర్టునూ ఇరుకునపెట్టేలా..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న వివాదం అనూహ్య మలుపు తిరిగింది. ఎన్నికల కమిషన్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా సాగుతోన్న గొడవలో ఇన్నాళ్లూ ఘోరంగా దెబ్బయిపోతోన్న సీఎం జగన్.. ఇప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దిమ్మతిరిగేలా షాకిచ్చారు. ఇప్పట్లో ఎన్నికల జరపబోమంటోన్న జగన్ సర్కారు తాజాగా కొవిడ్ వ్యాక్సినేషన్ రూపంలో అందివచ్చిన అవకాశాన్ని ఆయుధంగా వాడేసిందిలా..

భారత్‌కు అమెరికా హెచ్చరిక -ట్రంప్ చివరి బాంబు -టర్కీపై ఏకంగా ఆంక్షలు -రష్యన్ S400 క్షిపణుల రచ్చభారత్‌కు అమెరికా హెచ్చరిక -ట్రంప్ చివరి బాంబు -టర్కీపై ఏకంగా ఆంక్షలు -రష్యన్ S400 క్షిపణుల రచ్చ

హైకోర్టు విచారణలో మలుపు..

హైకోర్టు విచారణలో మలుపు..

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై అన్ని అధికారాలు ఎన్నికల కమిషనర్ కే ఉంటాయని, ప్రభుత్వ సహకారంతో ఆయన ప్రక్రియ మొదలుపెట్టొచ్చని సుప్రీంకోర్టు ఆదేశించిన దరిమిలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుకు కదిలారు. కానీ కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని జగన్ సర్కారు వాదించింది. కరోనా పరిస్థితులను పేర్కొంటూ.. నిమ్మగడ్డను నిలువరించేలా స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరగా, అందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదే వ్యవహారంపై మంగళవారం జరిగిన విచారణలో హైకోర్టు సైతం ఇరుకున పడేలా జగన్ సర్కారు సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది..

ముందు వ్యాక్సినేషన్.. తర్వాతే పోల్స్

ముందు వ్యాక్సినేషన్.. తర్వాతే పోల్స్

ఇన్నాళ్లూ కరోనా కారణంగా ఎన్నికల వాయిదా కోరుతూ వచ్చిన ఏపీ సర్కారు.. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి పోల్స్ కుదరవని హైకోర్టుకు చెప్పింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కరోనా వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని, ఈ వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని తెలిపింది. మొదటి డోస్ వేసిన నాలుగు వారాల తర్వాత రెండవ డోస్ వేయాలని కేంద్రం సూచించింది కాబట్టి నెలల తరబడి సిబ్బంది అందుబాటులో ఉండరని అఫిడవిట్ లో పేర్కొంది. తద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతగానీ స్థానిక ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం స్పస్టం చేసింది. అంతేకాదు..

హైకోర్టు స్పందనపై ఉత్కంఠ

హైకోర్టు స్పందనపై ఉత్కంఠ

స్థానిక ఎన్నికలపై మంగళవారం దాఖలు చేసిన అఫిడవిట్ లో జగన్ సర్కారు అనూహ్య కామెంట్లు రాసుకొచ్చింది. పరోక్షంగా ఎస్ఈసీ నిమ్మగడ్డను, కోర్టు గత ఆదేశాలను సవాలుచేస్తున్నట్లుగా.. ‘‘ఎన్నికల ప్రక్రియ లాగానే వాక్సినేషన్ ప్రక్రియ కూడా అత్యవసరంగా నిర్వహించాల్సి ఉంది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల కంటే వాక్సినేషన్ ప్రక్రియకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాల్సి ఉంది'' అని ప్రభుత్వ పేర్కొంది. ఇప్పటికే కొవిడ్ వ్యాక్సినేషన్ గైడ్ లైన్లను కేంద్రం విడుదల చేసిన దరిమిలా వాటిని ఎన్నికలకు ముడిపెడుతూ హైకోర్టును సైతం ఇరుకునపెట్టేలా అఫిడవిట్ లోని రాతలు ఉండటం గమనార్హం. వ్యాక్సినేషన్ ప్రక్రియకు నో చెప్పలేని పరిస్థిలో హైకోర్టు స్పందన ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది.

నిమ్మగడ్డకు భారీ షాకిచ్చిన జగన్

నిమ్మగడ్డకు భారీ షాకిచ్చిన జగన్

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ పదవీకాలం మార్చిలో ముగియనుండగా, అప్పటివరకు ఎన్నికలు నిర్వహించరాదని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు వైసీపీ కీలక నేతలు బాహాటంగా ప్రకటలు చేయడం తెలిసిందే. స్థానిక ఎన్నికలపై తాజా అఫిడవిట్ వ్యవహారంలో వైసీపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సర్కారు తెరపైకి తెచ్చిన ‘కొవిడ్ వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికలు' వాదనకు కౌంటర్ ప్రిపేర్ చేసుకోడానికే ప్రత్యర్థులు సమయం తీసుకునేలా చేసింది. అడిషనల్ అఫిడవిట్ తనకు సోమవారం రాత్రి అందిందని, దానిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు చెప్పడమే అందుకు నిదర్శనం. దీంతో హైకోర్టు విచారణను వచ్చే శుక్రవానికి వాయిదా వేసింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డను తొలగించడానికి జగన్ చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టడం, కొత్త ఎస్ఈసీ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళతామని వైసీపీ నేతులు చెబుతున్న దరిమిలా ఇవాళ్టి పరిణామాం నిమ్మగడ్డకు జగన్ షాకిచ్చినట్లేనని పరిశీలకులు అంటున్నారు.

భరతమాతకు బ్రిటిష్ ప్రధాని వందనం -రిపబ్లిక్ డే-2021కు చీఫ్ గెస్ట్‌గా బోరిస్ జాన్సన్ -మోదీకి రిటర్న్ గిఫ్ట్భరతమాతకు బ్రిటిష్ ప్రధాని వందనం -రిపబ్లిక్ డే-2021కు చీఫ్ గెస్ట్‌గా బోరిస్ జాన్సన్ -మోదీకి రిటర్న్ గిఫ్ట్

English summary
ys Jagan's govt made it clear that local body elections in Andhra Pradesh cannot be held at present. govt on Tuesday filed an additional affidavit to the high court. amid covid-19 vaccination process is underway, elections cannot be held, govt tells to court. it seems that CM Jagan has given a big shock to SEC Nimmagadda Ramesh Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X