అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు ప్యాలెస్ కావాలి .. రాజప్రసాదాల్లో నే బస.. అమరావతిలో గృహ ప్రవేశంపై చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయాక నాలుగున్నరేళ్లకు అమరావతిలో ఇంటి నిర్మాణం పూర్తైందని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు ఆయన హైదరాబాద్ ను విడిచి రాక .. ఇప్పుడు గృహప్రవేశం చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. తాను మాత్రం వెంటనే ఏపీ ప్రజల సంక్షేమం కోసం అమరావతి వచ్చినట్టు గుర్తుచేశారు. చిన్న, చితకా ఇంటిలో ఉండేందుకు జగన్ కు మనసొప్పదని .. అందుకే తనకు నచ్చే విధంగా ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు.

jagan wants palace only .. chandra babu comments

రాజప్రసాదాల్లో బస ..
ఏపీ ప్రజల సంక్షేమం జగన్ కు ఏమాత్రం పట్టదని మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇంటి, పార్టీ కార్యాలయ నిర్మించేందుకు నాలుగున్నరేళ్లు పడుతోందా అని ప్రశ్నించారు. 'ఆయన ఉండేందుకు ప్యాలెస్ లు కావాలి, రాజప్రసాదాల్లో బస చేయాలి .. ఆయనో సామంతరాజు .. తన పరివారంతో ఉండేందుకు ఇంద్రభవనాలు తప్ప .. సాధారణ ఇల్లు సరిపోవు' అని విమర్శించారు చంద్రబాబు.

వైసీపీ ప్యాలెస్ల పార్టీ ..
టీడీపీ మాదిరిగా వెనుకబడిన సంక్షేమం గురించి వైసీపీ ఆలోచించదన్నారు చంద్రబాబు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ పాటుపడుతుందని గుర్తుచేశారు. అయితే వైసీపీకి మాత్రం ఇవేమీ పట్టవని .. ఆ పార్టీ కార్పొరేట్ ను తలపిస్తోందని విమర్శించారు. వైసీపీ పేదల పార్టీ కాదు .. ప్యాలెస్ల పార్టీ తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన.

English summary
ap cm chandra babu fire on the oppositon leader ys jagan. after 4 and half years he construct the house in amaravati. jagan was satying in palaces only .. he never leave on ordinary home. he didnot interest peoples aspects
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X