వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ కోరుకున్నారు..కేంద్రం కొర్రీ పెట్టింది: ప‌్ర‌ధాని అంగీక‌రిస్తేనే సాధ్యం: సీఎం ఏం చేస్తారు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ఇంట‌లిజెన్స్ చీఫ్ ప‌ద‌వి మ‌రి కొంత కాలం ఖాళీగా ఉండాల్సిందేనా. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏరి కోరి కావాల‌ని ఎంచుకున్న అధికారికి ఈ ప‌ద‌వి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకోసం తెలంగాణ ముఖ్య‌మంత్రిని అగిడారు. ఆయ‌న వెంట‌నే రిలీవ్ చేసారు. కానీ, కేంద్రం కొర్రీ వేసింది. ఇప్పుడు ఏపీ ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా నియమించాల‌ని నిర్ణ‌యించిన స్టీఫెన్ ర‌వీంద్ర ఏపీకి రావాలంటే జ‌గ‌న్ నేరుగా ప్ర‌ధానితో సంప్రదింపులు చేయాల్సిందే. ప్ర‌ధాని ఆమోద ముద్ర వేస్తేనే..జ‌గ‌న్ కోరుకున్న‌ట్లుగా స్టీఫెన్ ర‌వీంద్ర ఏపీ ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ ఏరి కోరి ఎంపిక చేసినా..

జ‌గ‌న్ ఏరి కోరి ఎంపిక చేసినా..

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వంలో కొన్ని కీల‌క‌మైన ప‌ద‌వుల‌కు కొంద‌రిని ఎంపి చేసుకున్నారు. అందులో భాగంగా...త‌న తండ్రి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో భ‌ద్ర‌తా అధికారిగా ప‌ని చేయటం తో పాటుగా రాయ‌ల‌సీమ జిల్లాల పైన పూర్తి అవ‌గాహ‌న ఉన్న స్టీఫెన్ ర‌వీంద్ర‌కు కీల‌క‌మైన ఇంట‌లిజెన్స్ చీఫ్ ప‌ద‌వి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప‌ని చేసిన ఇంట‌లిజెన్స్ చీఫ్ పైన నాడు వైసీపీ అనేక ఆరోప‌ణ‌లు చేసింది. ఆయ‌న పూర్తిగా ముఖ్య‌మంత్రికి అనుకూలంగా..టీడీపి కోస‌మే ప‌ని చేస్త‌న్నార‌ని విమ‌ర్శ‌లు చేసింది. దీంతో..స‌మ‌ర్ధ‌వంత‌మైన అధికారిగా పేరున్న స్టీఫెన్ ర‌వీంద్రకు ఇంట‌లిజెన్స్ చీఫ్ ప‌ద‌వి ఇవ్వాల‌ని భావించిన జ‌గ‌న్ అందుకు అనుగుణంగా ఆయ‌న‌ను తెలంగాణ నుండి రిలీవ్ చేయాల‌ని కేసీఆర్‌ను కోరారు. ఆయ‌న సైతం వెంట‌నే ఆమోదించారు. స్టీఫెన్ వ‌చ్చి జ‌గ‌న్‌ను క‌లిసారు. కానీ, ఏపీకి రావ‌టానికి మాత్రం కేంద్రం కొర్రీ వేసింది.

Recommended Video

నేడు ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటన
కేంద్రం అభ్యంత‌రం ఏంటి..

కేంద్రం అభ్యంత‌రం ఏంటి..

స్టీఫెన్ ర‌వీంద్ర ఫైల్ ను కేంద్ర డీవోపీటీ ఫైల్‌ను పక్కనపెట్టినట్లు స‌మాచారం. అఖిల భారత సర్వీసు అధికారులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అంతరాష్ట్ర డిప్యుటేషన్‌పైౖ పంపించాలంటే చాలా బలమైన కారణాలను చూపించా లి. డిప్యుటేషన్‌పై వెళ్లాలనుకునే అధికారి ప్రస్తుతం ఉన్న కేడర్‌లో కనీసం తొమ్మిదేళ్లు పనిచేసి ఉండాలి. అలాగే ఆ అధికారి సూపర్‌టైమ్‌ స్కేల్‌ లోపు ఉండాలి. కానీ స్టీఫెన్‌ రవీంద్ర ఐజీ కేడర్‌లో సూపర్‌టైమ్‌ స్కేలు పొందుతున్నారు. కానీ, స్టీఫెన్ అసాధారణ కారణాలను ఏమీ ప్రస్తావించలేదు. దీనిప్రకారం డిప్యుటేషన్‌ను డీవోపీటీ వెంటనే తిరస్క రించాలి. కానీ ఆ పని చేయలేదు. ఒక రాష్ట్రం కోరిక మేరకు మరో రాష్ట్రం అంగీకరించిందన్న ఏకైక మెరిట్‌తో ఫైలును తిరస్కరించకుండా పెండింగ్‌లో ఉంచింది. దీని పైన ఇప్పుడు ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యం తీసుకోగ‌ల‌రు. దీంతో.. ఇప్పుడు ముఖ్య‌మంత్రి ఏం చేస్తార‌నేది కీల‌కంగా మారింది.

సీఎం జ‌గ‌న్ ఏం చేస్తారు..

సీఎం జ‌గ‌న్ ఏం చేస్తారు..

ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా నియ‌మించిన విశ్వ‌జిత్ ప్ర‌స్తుతం ఏసీబీ చీఫ్‌గా ఉన్నారు. ఏపీ ఇంట‌లిజెన్స్ చీఫ్ పోస్ట ఎవ‌రికీ ఇవ్వ‌క‌పోవ‌టంతో ఆయ‌నే ప్ర‌స్తుతానికి ఇన్‌ఛార్జ్‌గా కొన‌సాగుతున్నారు. అయితే, జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు స్టీఫెన్ రవీంద్ర అధికారుల‌తో ట‌చ్‌లో ఉంటూ అన‌ధికారికంగా ఇంట‌లిజెన్స్ బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షి స్తున్న‌ట్లు స‌మాచారం. ఇక‌, ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర ఏపికి రావాలంటే పెండింగ్‌లో ఉన్న ఫైల్ పైన ప్ర‌ధాని మాత్ర‌మే ఆమోద ముద్ర వేయ‌గ‌ల‌రు. సీఎం స్థాయిలో ఢిల్లీలో ఒత్తిడి తీసుకొస్తే గానీ ఇది కొలిక్కి రాదని అంటున్నారు. డీవోపీటీ ప్రధానమంత్రి పర్యవేక్షణలో ఉంటుంది. ప్రధాని చెబితేనే డీవోపీటీ అధికారులు నిబంధనల సడలింపు ఉంటుంది. దీంతో..ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ తాను కోరుకున్న అధికారి కోసం ప్ర‌ధానికి విజ్ఞప్తి చేస్తారా..లేక స్టీఫెన్ స్థానంలో మ‌రొక‌రి కి అవ‌కాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే. అయితే, ముఖ్య‌మంత్రి కార్యాలయ అధికారులు మాత్రం జ‌గ‌న్ నేరుగా ప్ర‌ధానితో ఈ విష‌యం పైన త్వ‌ర‌లోనే సంప్ర‌దింపులు చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

English summary
AP Cm Jagan wants to appoint Stephen Ravindra as AP Intelligence Chief. Already Telangana Govt relived him. But DOPT put his file in pending. Now, Prime Minister has to take decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X