వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయంలో రోజాకు జగన్ వార్నింగ్: ఫైర్ బ్రాండ్ రోజాతో పాటు నేతలంతా సైలెంట్!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP CM Jagan On APIIC Chairperson Roja ! || కేసీఆర్ విషయం లో రోజా పై సీరియస్ అయిన జగన్..! || Oneindia

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనవసరమైన విషయాలపై వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయంలోఆర్టీసీ సమ్మెపై మాట్లాడొద్దని సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న క్లాస్ ఏపీలోని వైసీపీ నేతలకు గట్టిగానే పనిచేస్తుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయ్యారు. మిగతావారు ఇంతకాలంగా ఏపీలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ఒక్క ముక్క మాట్లాడిన పాపాన పోలేదు.

 చేనేతపై జగన్ సంచలన నిర్ణయం .. నవంబర్ 1 నుండి ఆన్లైన్ లో చేనేత అమ్మకాలు చేనేతపై జగన్ సంచలన నిర్ణయం .. నవంబర్ 1 నుండి ఆన్లైన్ లో చేనేత అమ్మకాలు

తెలంగాణా ఆర్టీసీ సమ్మెపై వ్యాఖ్యలు చేసిన రోజా

తెలంగాణా ఆర్టీసీ సమ్మెపై వ్యాఖ్యలు చేసిన రోజా

తెలంగాణా ఆర్టీసీ సమ్మెపై వ్యాఖ్యలు చేసిన రోజాకు జగన్ వార్నింగ్ ఇవ్వటం ఏపీ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ వార్నింగ్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. ఆర్టీసి సమ్మె పై స్పందించిన రోజా సీఎం కేసీఆర్ అక్కడ నిర్దాక్షిణ్యంగా ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాల నుంచి తీసేశారని, ఏపీలో మాత్రం కార్మికులు అదృష్టవంతులని పేర్కొన్నారు.అంతేకాదు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో విలీనం అయ్యారని పేర్కొన్నారు.

రోజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్

రోజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్ కార్మికుల వైపునుండి ఎలాంటి ఉద్యమాలు లేకపోయినా, ఎలాంటి ఒత్తిడి లేకున్నా ఆర్టిసిని కాపాడడం కోసం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా విలీనం చేశారని పేర్కొన్నారు. తెలంగాణలోని ఆర్టీసీ సమ్మెపై ఇటీవల స్పందించిన రోజా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను కేసీఆర్ వినిపించుకోవడంలేదని, వారి న్యాయపరమైన డిమాండ్ల కోసం సమ్మెకు వెళితే ఉద్యోగాల నుంచి తొలగించారని చేసిన ఆరోపణలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడినట్లుగా తెలుస్తుంది.

అందరికీ క్లాస్ .. ఆర్టీసీ సమ్మెపై ఎవరూ మాట్లాడొద్దు అని వార్నింగ్

అందరికీ క్లాస్ .. ఆర్టీసీ సమ్మెపై ఎవరూ మాట్లాడొద్దు అని వార్నింగ్

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో ఏపీలోని నేతలు మాట్లాడటం మంచిది కాదని సీరియస్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. అందుకే హుజూర్నగర్ లో గెలుపు తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించినా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద తనదైన వ్యంగ్యాస్త్రాలు సంధించినా ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఇక అంతకు ముందు కాస్త గట్టిగానే మాట్లాడిన రోజా సైతం సైలెంట్ గా ఉండిపోయారు.

సీఎం కేసీఆర్ ఏపీ ఆర్టీసీ విలీనంపై వ్యాఖ్యలపై నోరు మెదపని నేతలు

సీఎం కేసీఆర్ ఏపీ ఆర్టీసీ విలీనంపై వ్యాఖ్యలపై నోరు మెదపని నేతలు

కేసీఆర్, సీఎం జగన్ ను ఉద్దేశించి ఏపీలో ఆర్టీసీని విలీనం చేయలేదని, కేవలం కమిటీని మాత్రమే వేశారని ఒక మూడు నెలలు గడిచాక ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలని అనడంతో అటు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు కాస్త టెన్షన్ పడ్డారు. అయితే ఏపీ రవాణా శాఖ మంత్రి మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా అలాంటివేవీ నమ్మొద్దని ఆర్టీసీ కార్మికులకు సూచించారు. అయితే దీనిపై ముందస్తు ఆలోచన చేసిన సీఎం జగన్ తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, ముఖ్యంగా రోజాకు, మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

రోజా ఎఫెక్ట్ .. నేతలంతా సైలెంట్

రోజా ఎఫెక్ట్ .. నేతలంతా సైలెంట్

అందుకే సీఎం కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఏపీ అంశం ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఈ విషయంపై రోజా కూడా మళ్ళీ నోరు మెదపలేదని , రోజా సైలెంట్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. ఇక అంతే కాదు రోజా ఎఫెక్ట్ వల్ల ఏపీలోని మంత్రులు ఎవరు నోరు మెదపడం లేదని, సీఎం కేసీఆర్ ఆర్టీసీ విషయంలో ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై ఒక రవాణా శాఖ మంత్రి తప్ప మరెవరూ స్పందించలేదని, ఆయన సైతం కేవలం ఏపీ ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చే దిశగా మాట్లాడారని అర్థమవుతుంది. ఎవరు పడితే వాళ్ళు స్పందిస్తే ఏపీ, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మనస్పర్ధలు వస్తాయనే జగన్ ఎవరినీ మాట్లాడొద్దు అని సూచించినట్టు తెలుస్తుంది.

English summary
YSR Congress Party Fire Brand, Nagari MLA, APIIC Chairperson Roja commented on ts rtc strike . CM Jagan serious on roja . It is not advisable to make comments on unnecessary matters, especially in the case of Telangana State, not to speak on the RTC strike, which is strongly working for the leaders of the AP Ycp leaders . In particular, Fire brand Roja became Silent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X