వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతి చేస్తున్నారు: నంది అవార్డులపై జగపతిబాబు, బెజవాడలో అడ్డుకున్న ఏపీ పోలీసులు

నంది అవార్డుల వివాదంపై నటుడు జగపతి బాబు తీవ్రంగా స్పందించారు. నంది అవార్డులపై మీడియా అతి చేస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రతి అంశాన్ని కులంతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని ఆయన అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: నంది అవార్డుల వివాదంపై నటుడు జగపతి బాబు తీవ్రంగా స్పందించారు. నంది అవార్డులపై మీడియా అతి చేస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రతి అంశాన్ని కులంతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని ఆయన అన్నారు.

చదవండి: కలిసి నడుస్తారా: 'ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ ఆఫర్ గురించి ఆలోచిస్తాం'

జగపతి బాబు పాదయాత్ర

జగపతి బాబు పాదయాత్ర

చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు జగపతి బాబు సోమవారం విజయవాడలో పాదయాత్ర చేపట్టారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఐమాక్స్ వద్ద పాల్గొన్నారు. 'రచయిత' చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆయన పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ సినిమాలో తాను నటించలేదని చెప్పారు.

చిన్న సినిమాలను బతికిద్దాం

చిన్న సినిమాలను బతికిద్దాం

చిన్న సినిమాలను ప్రోత్సహించాలని కోరుతూ ముందుకు వచ్చానని జగపతి బాబు చెప్పారు. మంచి సినిమాలు చచ్చిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలను బతికిద్దామని పిలుపునిచ్చారు.

సినిమా అంటే చాలా ఇష్టం, అందుకే

సినిమా అంటే చాలా ఇష్టం, అందుకే

కొత్త హీరో, కొత్త డైరెక్టర్లు, కొత్తవాళ్లే అందరూ వస్తున్నారని, వారందరినీ ఆదరించాల్సిన అవసరముందన్నారు. సినిమాలు తీయడం అంటే చాలామందికి ఇష్టమని, అందుకే చిన్న సినిమాలను ప్రోత్సహించాలని జగపతి బాబు పిలుపునిచ్చారు.

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు

తనకు రాజకీయాలకు వచ్చే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని జగపతి బాబు చెప్పారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. కాగా ఇటీవల ప్రకటించిన నంది అవార్డుల్లో జగపతి బాబుకు లెజెండ్, హితుడు సినిమాలకు వచ్చింది.

జగపతిబాబు పాదయాత్రను అడ్డుకున్నారు కానీ

జగపతిబాబు పాదయాత్రను అడ్డుకున్నారు కానీ

ఇదిలా ఉండగా, సోమవారం విజయవాడలో జగపతి బాబు పాదయాత్ర సమయంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ, సీపీఐ నాయకులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదే సమయంలో జగపతి బాబు పాదయాత్ర చేస్తున్నారు. దీంతో తొలుత ఆయన పాదయాత్రకు కూడా పోలీసులు నిరాకరించారు. ఆ తర్వాత విషయం తెలుసుకొని షరతులతో అనుమతించారు.

చదవండి: బాలకృష్ణ వల్లేనా? బాబుకు తలనొప్పి: నంది అవార్డులు ఎవరికి, ఎలా సంబంధం?

చదవండి: అది కూడా తెలియదా: పోసానికి లోకేష్ కౌంటర్, బాలకృష్ణ-కులంతో టీడీపీకి ఝలక్

చదవండి: కలిసి నడుస్తారా: 'ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ ఆఫర్ గురించి ఆలోచిస్తాం'

English summary
Tension prevailed for a while near Kaleswara Rao Market here on Monday when police denied permission to actor Jagapathi Babu to take out a padayatra citing law and order problem. The actor was mistaken to be taking part in ‘Chalo Assembly’, called by the Left Parties to demand Special Category Status for Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X