వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌పై జగ్గారెడ్డి నిప్పులు, డిఎస్ సిఎంఐతే ఒకే: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జగ్గా రెడ్డి సోమవారం మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజల అవసరాలను ఓట్లుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పేదలకు మూడు పడకల ఇళ్లు, హెలికాప్టర్లో వైద్యం సాధ్యమా అని ప్రశ్నించారు. తెరాస పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

డిఎస్ అయితే ఓకే: విహెచ్

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయితే తాము మద్దతిస్తామని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. తనను అంబర్ పేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని, సోనియా గాంధీ ఏం చెబితే అది చేస్తానని చెప్పారు. ఈ నెల 19న అమరవీరుల కుటుంబాలతో సమావేశమై, వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటామని చెప్పారు.

కిరణ్ మోసం చేశారు: కంతేటి

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీని మోసం చేశారని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు మండిపడ్డారు. కాంగ్రెసులో గంజాయీ మొక్కల సంఖ్య పెరిగిందని, పార్టీలో కుల, మత, అవినీతి ప్రాబల్యం అధికమయిందని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ కష్టాల్లో ఉందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నేతలు బరిలోకి దిగితే కాంగ్రెసు బలపడుతుందన్నారు.

హైదరాబాద్‌కు వంశీచంద్ పాదయాత్ర

కాంగ్రెసు పార్టీ యువజన అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డి వరంగల్ నుండి చేపట్టిన పాదయాత్ర హైదరాబాదులోకి ప్రవేశించింది. ఉప్పల్ వద్ద ఆయనకు ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి, ఇతరులు ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్ర గన్ పార్కుకు చేరుకోగానే బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.

English summary
Congress MLA Jagga Reddy on Monday fired at TRS chief K Chandrasekhar Rao for his promices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X