వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌తో జాగ్రత్త: జగ్గారెడ్డి, అంతా గమనిస్తున్నా:యాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy warns Yashki
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబంతో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ జాగ్రత్తగా ఉండాలని సంగారెడ్డి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి శనివారం హితవు పలికారు. తాను మీకో మాట చెప్పదలచుకున్నానని, ఎవరెన్ని చెప్పినా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం తథ్యమని, కెసిఆర్ వల్ల తెలంగాణ ప్రకటన రాలేదని, కేంద్రం వద్దనుకుంటే ఇంతకంటే పెద్ద ఉద్యమం చేసినా తెలంగాణ ఇవ్వారని యాష్కీతో జగ్గారెడ్డి అన్నారు.

తెరాస కాంగ్రెస్‌లో విలీనం అయితే తమ సీట్లకు తప్పకుండా చెక్ పెడతారని యాష్కీతో చెప్పారు. కెసిఆర్ ముందు ఆయన భార్య, కొడుకు, కూతురు పాయిజన్ బాటిల్ పెట్టుకుని బెదిరించి అయినా సీట్లు దక్కించుకుంటారన్నాన్నారు. తెలంగాణ వచ్చాక హరీశ్ రావును కూడా పక్కనబెడతారని చెప్పారు.

కల్వకుంట్ల కవిత నీ సీట్లోకి జొరపడాలని చూస్తోందని, రిజర్వేషన్ల పేరుతో కొద్దిమంది పెద్దలు తమ సీట్లకు డోకా లేకుండా చేసుకుంటున్నారని యాష్కీకి చెప్పారు. మీది జనరల్ సీటని, ఎసరు పెడతారు జాగ్రత్త అన్నారు. అందుకు మధుయాష్కీ.. తాను గమనిస్తున్నానని చెప్పారు.

కెసిఆర్‌పై యాష్కీ

కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే బేషరతుగా తెరాసను విలీనం చేస్తానన్న కెసిఆర్ ఇప్పుడు మాట మార్చారని మధుయాష్కి మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిందని కెసిఆర్ సంబరపడుతున్నారని అయితే తాము కోరుకున్నది సామాజిక తెలంగాణ అని మధుయాష్కి తెలిపారు.

English summary
Government whip Jagga Reddy on Saturday warned Nizamabad MP Madhu Yashki on his Lok Sabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X