వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Jagan : వైఎస్ జగన్ ను తిట్టిన కానిస్టేబుల్ కు జగ్గయ్యపేట కోర్టు బెయిల్..

తాజాగా సీఎం జగన్ ను దుర్భాషలాడిన కేసులో అరెస్టు అయిన కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావుకు జగ్గయ్యపేట కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.

|
Google Oneindia TeluguNews

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ను దుర్భాషలాడిన కేసులో అరెస్టు అయిన తన్నీరు వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ కు ఇవాళ బెయిల్ లభించింది. ఆయన్ను జగన్ ను దుర్భాషలాడిన కేసులో సస్పెండ్ చేసి పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఇవాళ ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది.

తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని గౌరవరం సమీపం హెచ్.పి. పెట్రోల్ బంకు దగ్గర రాత్రి 1.30 నిమిషాలకు పోలీస్ హైవే మొబైల్ డ్రైవర్ అయిన AR PC 2587 కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వర్లు గౌరవరం నివాసి వెలగపూడి సతీష్ తో మాటల సందర్భంలో పలు కామెంట్స్ చేశాడు. సతీష్ జీతం విషయం కానిస్టేబుల్ ను ప్రశ్నించగా సదరు కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ను , ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో సతీష్ తన సెల్ ఫోన్ లో ఈ వీడియో తీశాడు.

jaggayyapeta court grants bail to police constable, who scolded cm ys jagan

రెండు పార్టీల మధ్య విద్వేషం రెచ్చగొట్టే విధంగా ఆ వీడియోలో పదజాలం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యత గల కానిస్టేబుల్ అయి ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయటం సహించరాన్ని నేరంగా పరిగణించి సదరు సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకల్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఏపీ డిస్టిక్ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ARPC 2587 కానిస్టేబుల్ ను రిమాండ్ కు తరలించారు. విధుల్లో దుష్ప్రవర్తన కింద అయన్ను సస్పెండ్ చేశారు.

జగన్ ను దూషించిన కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావును పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే బెయిల్ కు అప్పీలు చేసుకోవడంతో కేసు విచారించిన జగ్గయ్యపేట కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తన్నీరు వెంకటేశ్వరరావుపై జీతాల విషయంలో ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను దూషించినట్లు అభియోగాలున్నాయి.

English summary
jaggyyapeta local court on today granted bail to constable tanniru venkateswara rao in scolding against ys jagan case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X