వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా ఎఫెక్ట్: జూ.ఎన్టీఆర్‌కు చంద్రబాబుకు లంకె పెట్టడమా?

నటుడు జూనియర్ ఎన్టీఆర్ 2009లో టిడిపికి ప్రచారం చేసి, ఆ తర్వాత దూరమయ్యారు. నాటి నుంచి ఆయన బయట ఏమైనా మాట్లాడినా లేదా సినిమాలో డైలాగులైనా పొలిటికల్ యాంగిల్‌లో ఉంటే అవి చర్చనీయాంశమవుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Jai Lava Kusa Dialogues For Chandrababu జూ.ఎన్టీఆర్‌కు చంద్రబాబుకు లంకె | Oneindia Telugu

అమరావతి/హైదరాబాద్: నటుడు జూనియర్ ఎన్టీఆర్ 2009లో టిడిపికి ప్రచారం చేసి, ఆ తర్వాత దూరమయ్యారు. నాటి నుంచి ఆయన బయట ఏమైనా మాట్లాడినా లేదా సినిమాలో డైలాగులైనా పొలిటికల్ యాంగిల్‌లో ఉంటే అవి చర్చనీయాంశమవుతున్నాయి.

తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కూడా కొన్ని డైలాగులను టిడిపికి ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెబ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వస్తున్నాయి.

జూ ఎన్టీఆర్ డైలాగ్‌లకు చంద్రబాబుకు లంకె

జూ ఎన్టీఆర్ డైలాగ్‌లకు చంద్రబాబుకు లంకె

జై లవ కుశ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అదే సమయంలో ఇందులో కొన్ని డైలాగ్‌లను రాజకీయాలకు సరిపోల్చుతున్నారు. వాటి ఆధారంగా టిడిపికి లేదా చంద్రబాబుకు కౌంటర్‌గా అందులో డైలాగ్‌లు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

హరికృష్ణకు పదవి

హరికృష్ణకు పదవి

ఇందుకు ఈ సినిమాలోను రెండు మూడు డైలాగులను కూడా ఉదహరిస్తున్నారు. చంద్రబాబుకు జూ ఎన్టీఆర్ రాజకీయంగా దూరం జరగడం, ఇటీవల నందమూరి హరికృష్ణకు టిటిడి బోర్డ్ చైర్మన్ పదవి ఇస్తారనే ఊహాగానాల నేపథ్యంలో.. ప్రస్తుత జై లవ కుశ సినిమాలోని అంశాలను వాటికి లంకె పెట్టారు.

చంద్రబాబు దువ్వే ప్రయత్నమని

చంద్రబాబు దువ్వే ప్రయత్నమని

ఈ సినిమాలో ఓ డైలాగ్.. మనం అనే దానిలో అర్థం లేదని, నేను అనేదే నిజం అని ఉంది. 2019 కోసం జూ ఎన్టీఆర్‌ను మళ్లీ చంద్రబాబు దువ్వే ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో భాగంగానే హరికృష్ణకు టిటిడి చైర్మన్ పదవి ఇచ్చే అంశంపై ఆలోచన చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఊహాగానానికి, సినిమాలోని డైలాగ్‌కు లంకె పెట్టారు.

చంద్రబాబుకు కౌంటర్ అంటూ

చంద్రబాబుకు కౌంటర్ అంటూ

మనం అనే దానికి అర్థం లేదని, నేను మాత్రమే నిజమనే డైలాగ్ చంద్రబాబు.. దగ్గరకు అయ్యే ప్రయత్నాలకు కౌంటర్‌గానే కావొచ్చునని పేర్కొంటున్నారు.

దగ్గరయ్యేందుకు డ్రామాలు అంటూ

దగ్గరయ్యేందుకు డ్రామాలు అంటూ

మీరు నాకు దగ్గరయ్యే డ్రామాలు ఆడుతున్నారా అనే డైలాగ్ కూడా ఉంది. ఇది కూడా టిడిపిని ఉద్దేశించి అని చెబుతుండటం గమనార్హం.

సహకారంపై..

సహకారంపై..

గెలిచిన వారికంటే గెలిపించడానికి సహకరంచిన వ్యక్తికి ఎక్కువ గుర్తింపు ఉంటుందనే అభిప్రాయంతో వచ్చే డైలాగ్ కూడా ఉంది. గతంలో జూ ఎన్టీఆర్ టిడిపికి ప్రచారం చేశారు. దీంతో ఈ డైలాగ్ కూడా ఆపాదిస్తున్నారు.

పలువురి విస్మయం

పలువురి విస్మయం

ఓ సినిమా అన్నప్పుడు సందర్భాన్ని బట్టి డైలాగ్‌లు ఉంటాయి. కానీ ప్రతి డైలాగ్‌ను వారి రియల్ జీవితానికి ముడిపెట్టి ఆపాదించడం విడ్డూరమంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరమని జూనియర్ ఎప్పుడో చెప్పారు. సినిమాలపై ఆయన దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలోను ఆయన తీసిన సినిమాల్లోని డైలాగ్‌ను టిడిపికి లేదా చంద్రబాబుకు ఆపాదించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Junior NTR says in the latest film that There is no meaning for us and I am the only truth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X