వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఇస్తే: ఎన్టీఆర్‌పై జైరాం, జగన్‌పై కృష్ణంరాజు ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరీంనగర్/హైదరాబాద్/న్యూఢిల్లీ: స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నాడు రాజ్యసభ సీటు ఇచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ పుట్టక పోయి ఉండేదని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ సోమవారం అన్నారు. ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

కెసిఆర్‌పై పాల్వాయి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తానని చెప్పి మాట తప్పారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఢిల్లీలో మండిపడ్డారు. ఆయన ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణకు ప్రత్యేక పిసిసిని ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు.

Jairam on late NTR

జగన్‌పై కృష్ణం రాజు ఫైర్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పచ్చి అవకాశవాది అని బిజెపి సీనియర్ నేత రఘురామ కృష్ణం రాజు వేరుగా చెప్పరు. ఆ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నారన్నారు. సీమాంధ్రకు ఏం కావాలని వెంకయ్య నాయుడు రాజ్యసభలో పోరాడారో.. తాను కోర్టులో దాని కోసమే పోరాడుతున్నానని చెప్పారు.

ఏప్రిల్ మొదటి వారంలో రాజ్యాంగ ధర్మాసనం ముందుకు పిటిషన్ వచ్చే అవకాశముందన్నారు. చివరి క్షణం వరకు రాష్ట్రం కోసం పోరాడుతానని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, దేశంలో తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

English summary
Union Minister Jairam Ramesh on Monday talk about late Nandamuri Taraka Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X