విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు-మోడీలపై జైరాం రమేష్ సంచలనం, 2019లో హోదాపై తొలి సంతకం

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆదివారం నిప్పులు చెరిగారు. వీరిద్దరు పార్లమెంటులో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జైరాం రమేష్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మోడీ, చంద్రబాబుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు.

చంపించారు, నీ గుట్టు.. నీ తాత గుట్టు విప్పుతా రా! నేనొక్కడినే వస్తా: జగన్‌పై ఆదినారాయణచంపించారు, నీ గుట్టు.. నీ తాత గుట్టు విప్పుతా రా! నేనొక్కడినే వస్తా: జగన్‌పై ఆదినారాయణ

11 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏపీకి ఇవ్వవచ్చుగా

11 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏపీకి ఇవ్వవచ్చుగా

11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అనుభవిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా ఇవ్వడానికి మోడీకి ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయన్నారు. పోలవరాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. మోడీ, చంద్రబాబులు తమ వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారన్నారు.

వాటిని అమలు చేయడం లేదు

వాటిని అమలు చేయడం లేదు

ఎన్డీయే నేతృత్వంలోని కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా ఏపీని విస్మరించిందని జైరామ్ రమేష్ దుయ్యబట్టారు. విభజన బిల్లులో పొందుపర్చిన అంశాలను అమలు చేయకుండా అన్యాయం చేసిందన్నారు. పార్లమెంటులో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనలు అమలు చేయడం లేదన్నారు.

విభజన ద్వారా కాంగ్రెస్‌పై ఏపీ ప్రజల ఆగ్రహం

విభజన ద్వారా కాంగ్రెస్‌పై ఏపీ ప్రజల ఆగ్రహం


2014లో తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన హామీలు ఆచరణ సాధ్యం చేయకుండా ప్రజలను మోగసిస్తున్నారని జైరాం మండిపడ్డారు. కాంగ్రెస్ విభజన ద్వారా ఏపీ ప్రజల ఆగ్రహాన్ని 2014లో చవి చూసిందన్నారు.

ఏపీకి హోదాపై తొలి సంతకం

ఏపీకి హోదాపై తొలి సంతకం

తాము బిల్లులో పొందుపర్చిన 11 అంశాల్లో ఒక్కదానికి సవరణలు చేయించలేకపోవడం బిల్లు ఎంత పగడ్బందీగా రూపొందించామనడానికి నిదర్శనం అన్నారు. ఏ ఒక్క అంశానికి ఎందుకు మార్పు చేయించలేదన్నారు. 2019లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, ఏపీకి హోదాపై తొలి సంతకం చేస్తామన్నారు.

English summary
Congress leader Jairam Ramesh on Sunday said that Narendra Modi and Chandrababu Naidu match fixing in praliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X