వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరే లేఖ ఇచ్చారుగా: బాబుకు జైరాం దిమ్మతిరిగే షాక్, కంగుతిన్న సీఎం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మంగళవారం గట్టి షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు పార్లమెంటు సెంట్రల్ హాలులో పలువురు నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయనకు జైరాం పార్లమెంటు సెంట్రల్ హాలులో ఎదురుపడ్డారు.

పార్లమెంట్ మెట్లకు నమస్కరించి సెంట్రల్ హాల్‌కు బాబు, కాంగ్రెస్-బీజేపీ మినహా..పార్లమెంట్ మెట్లకు నమస్కరించి సెంట్రల్ హాల్‌కు బాబు, కాంగ్రెస్-బీజేపీ మినహా..

ఈ సందర్భంగా చంద్రబాబు, జైరాం రమేష్‌లు చేతులు కలిపారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మీరే విభజించారని అన్నారు. దానికి జైరాం గట్టి కౌంటర్ ఇచ్చారు.

Jairam Ramesh shocks Chandrababu Naidu

మీరు రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చారని, ఆ తర్వాతే విభజన జరిగిందని చెప్పారు. జైరాం సమాధానంతో చంద్రబాబు ఖంగుతిన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత, మళ్లీ కలుద్దామని జైరాం అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం.

కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఉదయం పార్లమెంటుకు చేరుకున్న ఆయన ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నమస్కరించి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంటు ద్వారానికి నమస్కరించి లోనికి వెళ్లారు.

అనంతరం పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్లో వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌, ఎన్సీపీ నేతలు శరద్‌ పవార్‌, సుప్రియా సూలె, తారిక్‌ అన్వర్‌, టీఎంసీ నేతలు సుదీప్‌ బందోపాధ్యాయ, డెరిక్‌ ఒబ్రెయిన్‌, ఎస్పీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు.

Recommended Video

సీఎం రమేష్ రాజీనామా ? మోడీ ఫేర్‌వెల్ స్పీచ్

విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు. విభజన చట్టంలోని అంశాలు, హోదా సహా కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు చంద్రబాబు కృ,తజ్ఞతలు భవిష్యత్తులోనూ తమకు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

English summary
Congress Party leader Jairam Ramesh gave shock to Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X