వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జలీల్ ఖాన్‌కు కీలక పదవి, నంద్యాల ఎఫెక్ట్.. ఆయనకూ బాబు పదవి

వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పదవి కట్టబెట్టారు. ఆయనకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు. దీనిపై టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పదవి కట్టబెట్టారు. ఆయనకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు. దీనిపై టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

<strong>వైయస్ ఉంటే రాష్ట్రం విడిపోయేదా, నన్ను అబద్దమాడమన్నారు, 30 ఏళ్లు సీఎంగా నా ఆశ: జగన్</strong>వైయస్ ఉంటే రాష్ట్రం విడిపోయేదా, నన్ను అబద్దమాడమన్నారు, 30 ఏళ్లు సీఎంగా నా ఆశ: జగన్

వైసిపి నుంచి వచ్చిన పలువురు నేతలకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు పదవులు ఇస్తున్నారు. జలీల్ పార్టీలో చేరినప్పుడు, ఆ తర్వాత కూడా కేబినెట్లోకి తీసుకొని మైనార్టీ శాఖను అప్పగిస్తారనే ప్రచారం సాగింది.

కానీ కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు ఆయనకు వక్ఫ్ చైర్మన్ పదవిని అప్పగించారు. దీనిపై జలీల్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు.

సమీకరణాల వల్ల కేబినెట్లో చోటు దక్కక..

సమీకరణాల వల్ల కేబినెట్లో చోటు దక్కక..

టిడిపిలో సీనియర్లకు, దీర్ఘకాలంగా పార్టీనే అంటిపెట్టుకుని సేవలందిస్తున్న వారికి, వివిధ కారణాల వల్ల 2014 ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేని వారికి, ఎమ్మెల్సీలుగానూ అవకాశం కల్పించలేని వారికి కూడా కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకంలో ప్రాధాన్యమిచ్చారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో జలీల్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. కొన్ని సమీకరణాల వల్ల ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ముస్లింలలో పట్టున్న నాయకుడు కావడంతో వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు.

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయనకు పదవి

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయనకు పదవి

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నౌమాన్‌ ఇటీవలే టిడిపిలో చేరారు. ఆయన గతంలో నంద్యాల మున్సిపల్‌ ఛైర్మన్‌గా, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ సభ్యుడిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డికి మద్దతుగా పని చేశారు. అనంతరం తటస్థంగా ఉంటున్నారు. స్థానికంగా పట్టున్న నాయకుడు కావడంతో నంద్యాల ఉప ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను ఉర్దూ అకాడెమీ ఛైర్మన్‌గా నియమించారు.

Recommended Video

MPC Group In Matriculation, 'B Com Physics' Jaleel Khan New Interview
పష్పరాజ్‌కు పదవి

పష్పరాజ్‌కు పదవి

గుంటూరు జిల్లాకు చెందిన జెఆర్‌ పుష్పరాజ్‌ టిడిపి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి మంత్రిగా పని చేశారు. 2004 ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో వేమూరు నుంచి టిక్కెట్‌ ఇస్తామంటే పోటీ చేసేందుకు నిరాకరించారు. 2014లో టిక్కెట్‌ రాలేదు. ఎమ్మెల్సీ పదవి ఆశిస్తూ వచ్చారు. ఆయనను రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్‌గా నియమించారు.

ఏపీ సినిమా, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అంబికా కృష్ణ

ఏపీ సినిమా, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అంబికా కృష్ణ

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అంబికా కృష్ణ దీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో స్థానిక రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయనకు టిక్కెట్‌ లభించలేదు. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లో పార్టీ నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చింది. కానీ దక్కలేదు. ఇప్పుడు ఏపీ సినిమా, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించారు.

వీరికీ పదవులు

వీరికీ పదవులు

కర్నూలు నగరాభివృద్ధి సంస్థ (కుడా) ఛైర్మన్ పదవి సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు దక్కింది. తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్ పదవి జినరసింహయాదవ్‌‌కు దక్కింది. తోలు పరిశ్రమల అభివృద్ధి సంస్థ (లిడ్‌ క్యాప్‌) ఛైర్మన్‌గా జి.ఎరిక్సన్‌ బాబు,*మాంస అభివృద్ధిసంస్థ ఛైర్మన్‌గా పి ప్రకాశ్‌ నాయుడులను నియమించారు.

English summary
The State government has appointed chairmen for different corporations in the State. The corporations and organisations include Wakf Board, Urdu Academy and urban development authorities, according to a press release from the TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X