కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వైఖరి వల్లే, ఇంకా తగ్గలేదు : భూమా మృతిపై జలీల్‌ఖాన్ సంచలనం

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణమని టిడిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.

|
Google Oneindia TeluguNews

ఆళ్లగడ్డ: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణమని టిడిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. వైసిపిలో ఉన్నప్పుడు జగన్ పెట్టిన టార్చర్‌తోనే భూమా తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, ఆయన తన బాధను చెప్పుకొని బాధపడేవారన్నారు.

తాను కూడా వైసిపిని వీడి వచ్చానని గుర్తు చేశారు. నాడు జగన్ వైఖరి కారణంగా మొదలైన తలనొప్పి ఇంకా తగ్గలేదన్నారు. ఓ పెద్ద నేత మృతిపై అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశ పెడితే.. పక్క గదిలో ఉన్న జగన్ హాజరు కాకపోవడం హేయమన్నారు.

<strong>అఖిలప్రియ బాధ్యత: చలించిన బాబు, నా తండ్రి ప్రజలకప్పగించారు: అఖిల</strong>అఖిలప్రియ బాధ్యత: చలించిన బాబు, నా తండ్రి ప్రజలకప్పగించారు: అఖిల

 Jaleel Khan lashes out at YS Jagan mohan

జగన్ వైఖరితో ఏర్పడిన మానసిక ఆందోళనే భూమాను బలిగొన్నదని చెప్పారు. ఆ ఆందోళనే వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలో చేరేలా చేసిందని వ్యాఖ్యానించారు. జగన్ మనిషి రూపంలో ఉన్న సైతాన్ అని దుయ్యబట్టారు.

జగన్ ఇలాగే ఉంటే రాజకీయాలకే నష్టమని వ్యాఖ్యానించారు. భూమాను వారం క్రితమే కలిశానని చెప్పారు. అన్నా నంద్యాలలే పేదరికం ఉంది అని తనతో చెప్పారని జలీల్ ఖాన్ అన్నారు. జగన్‌తో ఉండటం ఓ పీడకలగా భావిస్తున్నట్లు చెప్పారు.

వైయస్ చనిపోయినప్పుడు చంద్రబాబు హైదరాబాద్ నుంచి వెళ్లారని, పరామర్శించారని గుర్తు చేశారు. జగన్ మాత్రం పక్కగదిలో కూర్చొని కూడా రాకపోవడం బాధగా ఉందన్నారు. శత్రువు మరణించినా పలకరించే మనస్తత్వం చంద్రబాబుది అన్నారు.

English summary
Telugudesam Party MLA Jaleel Khan lashes out at YSRCP chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X