వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"ఆర్నెళ్లుగా జగన్‌కు పనిలేదు.. జనం నల్లసముద్రంలో కలిపేస్తారు"

ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఎవరైనా చేయగలరని, వాటిని పూర్తి చేయడమే ప్రధాన ఆశయమని ఆయన పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: టీడీపీ నేతలంతా ప్రతిపక్ష వైసీపీపై విమర్శలకు పదునుపెడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీ అధ్యక్షుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో విజయవాడను నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించినప్పుడు.. తాను బల్లలు చరిచి ఆ నిర్ణయాన్ని సమర్థించానని, అందువల్లే జగన్ తనపై కక్ష పెంచుకున్నారని జలీల్ ఖాన్ దుయ్యబట్టారు.

వైఎస్ చేయలేని పనిని సీఎం చంద్రబాబు చేసి చూపించారని అన్నారు. పులివెందులలో వైఎస్ కుటుంబం రక్తం పారిస్తే.. చంద్రబాబు నీళ్లు పారిస్తున్నారని చెప్పారు. ఆరు నెలలుగా జగన్ కు అసలు పని పాటా లేకుండా పోయిందని, అందుకే చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపెయ్యాలని అవాకులు చవాకులు పేలుతూ తిరుగుతున్నాడని మండిపడ్డారు.

ప్రజలే జగన్ ను నల్లసముద్రంలో కలిపేస్తారని ఈ సందర్బంగా టీడీపీ నేతలు విమర్శించారు. బుధవారం నాడు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ బుధవారం స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు.

Jalil Khan takes on Jagan over pattiseema issue

పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా బతికి బట్టకట్టిందన్నారు దేవినేని నెహ్రూ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏడాదిలోగా పట్టిసీమను పూర్తి చేస్తే 500కార్లతో చంద్రబాబును ఊరేగిస్తానని గతంలో తాను చెప్పినట్టుగా దేవినేని గుర్తు చేశారు.

చెప్పినట్టుగానే చంద్రబాబు పట్టిసీమను పూర్తి చేశారని దేవినేని అన్నారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఎవరైనా చేయగలరని, వాటిని పూర్తి చేయడమే ప్రధాన ఆశయమని ఆయన పేర్కొన్నారు.కమిషన్ కు కక్కుర్తి పడి జల యజ్ఞానికి, ప్రభుత్వ పథకాలకు కేవీపీ ఓ దళారిగా పని చేశాడని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.

ఇదే సమావేశంలో టీడీపీ నేతలు డియాల బుచ్చిబాబు, ఫ్లోర్‌లీడర్‌ జి.హరిబాబు
సహా తదితరులు పాల్గొన్నారు.

English summary
TDP MLA Jalil Khan fired on Jagan regarding pattiseema issue. He said people will thrown him into black sea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X