వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2022లో జమిలీ ఎన్నికలు..?: దోపిడి పాలనకు చరమగీతం పాడాల్సిందే: శ్రేణులతో చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

2022లో జమిలి ఎన్నికలు వస్తాయని, సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికల కోసం నేతలు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని కోరారు. శుక్రవారం అమలాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలతో చంద్రబాబు ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిణామాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ చేస్తోన్న అరాచకాలకు త్వరలోనే ముగింపు పలుకుతామని శ్రేణుల్లో ధైర్యం నూరిపోశారు.

 చంద్రబాబు ఇంటికి ప్రమాద హెచ్చరికలు, మరో 36 ఇళ్లకు కూడా.. వరదనీరు పోటెత్తడంతో.. చంద్రబాబు ఇంటికి ప్రమాద హెచ్చరికలు, మరో 36 ఇళ్లకు కూడా.. వరదనీరు పోటెత్తడంతో..

దోపిడీ పాలనకు చరమగీతం..

దోపిడీ పాలనకు చరమగీతం..

కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రజల ఆదాయం తగ్గి పాట్లు పడుతున్నారని చెప్పారు. కానీ జగన్ సర్కార్ మాత్రం వారిని పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలతో చంద్రబాబు అన్నారు. వారికి జనం బాగోగులు పట్టవని మండిపడ్డారు. కానీ అవినీతి మాతం యధేచ్చగా జరుగుతోందని చెప్పారు. దోపిడీ పాలనను చరమగీతం పాడాల్సిందేనని చంద్రబాబు స్పష్టంచేశారు.

వైరస్ తగ్గాక పర్యటన

వైరస్ తగ్గాక పర్యటన

కరోనా వైరస్ సమూల నిర్మూలన జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చంద్రబాబు తెలిపారు. కష్టాల్లో ఉన్నవారి కోసం గళం విప్పుతానని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై రోజు దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. అంతేకాదు న్యాయమూర్తి సోదరుడిని కొట్టినా న్యాయం జరగడం లేదన్నారు. చలో మదనపల్లికి పిలుపిచ్చిన దళిత నేతలను అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. ఇటు విజయవాడలో దళిత యువకుడిని పోలీసులు లాక్‌పలో కొట్టి చంపేశారని చంద్రబాబు మండిపడ్డారు.

సీఎం జగన్ వల్లే

సీఎం జగన్ వల్లే

అవినీతిని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. దీంతో మంత్రులకు బెంజికార్లు గిప్టులుగా వస్తున్నాయని చెప్పారు. దళితులు, సామాన్య జనాన్ని మాత్రం పోలీసులు హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో సామాజిక బాధ్యతగా తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌ ప్రారంభిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Recommended Video

YCP తీర్థం పుచ్చుకోనున్న గంటా వారు.. రేపే పార్టీ లో చేరిక! || Oneindia Telugu
వడ్డీతో సహా..

వడ్డీతో సహా..

టీడీపీ కార్యకర్తలను వేధించిన వారు భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ నిజస్వరూపం ఏమిటో ప్రజలకు అర్థమవుతోందన్నారు. సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇటు టీడీపీ కమిటీలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

English summary
jamili elections to be conduct 2022: jamili elections to be conduct the 2022 year tdp chief chandrababu naidu says his party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X