వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ప్ర‌తిష్ఠ‌కు స‌వాల్ : వివేకా మృతి తో క‌ష్టాలు : జ‌మ్మ‌ల‌మడుగు లో గెలుపెవ‌రిది..!

|
Google Oneindia TeluguNews

ఎలాగైనా ముఖ్య‌మంత్రి కావాల‌నేది జ‌గ‌న్ ల‌క్ష్యం. వైసిపి కార్య‌క‌ర్త‌లు..జ‌గ‌న్ అభిమానులు కోరుకుంటందీ అదే. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ అభిమానుల తో పాటుగా టిడిపి నేత‌లు సైతం ఆస‌క్తిగా చూస్తున్న నియోజ‌క‌వ‌ర్గం క‌డప జిల్లా లోని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం. వివేకానంద రెడ్డి హ‌త్య‌తో అక్క‌డి స‌మీక‌ర‌ణాల్లో మార్పు వ‌స్తోంది. దీంతో.. ఇప్పు డు ఆ నియోజ‌క‌వ‌ర్గం లో గెలుపు జ‌గ‌న్ కు వ్య‌క్తిగ‌తంగా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది.

ఆ ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు..

ఆ ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు..

జ‌మ్మ‌ల‌మ‌డుగు తొలి నుండి కాంగ్రెస్‌..టిడిపి మ‌ధ్య హోరా హోరీ పోరుకు వేదిక‌. కాంగ్రెస్ నుండి రెండు సార్లు.. వైసిపి నుండి ఒక సారి జ‌మ్మ‌ల‌మ‌డుగు నుండి ఆదినారాయ‌ణ రెడ్డి గెలుపొందారు. మూడు సార్లూ ఆయ‌న టిడిపి అభ్య ర్ది రామ‌సుబ్బారెడ్డి మీద గెలిచారు. 2014 లో వైసిపి నుండి గెలిచిన ఆదినారాయ‌ణ రెడ్డి టిడిపిలోకి ఫిరాయించి మంత్రి ప‌ద‌వి పొందారు. ఆ త‌రువాత అక్క‌డి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి రామ‌సుబ్బారెడ్డి తో తాజా ఎన్నిక‌ల కార‌ణంగా రాజీ ఫార్ములా ప్ర‌తిపాదించారు. ఆ ఇద్ద‌రూ స‌మ్మ‌తించారు. ఆదినారాయ‌ణ రెడ్డి క‌డ‌ప ఎంపీగా..రామ‌సుబ్బారెడ్డి టిడిపి నుండి జ‌మ్మ ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా టిడిపి నుండి బ‌రిలో ఉన్నారు. ఇక‌, జ‌మ్మ‌ల‌మడుగు వైసిపి ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా సుధీర్ రెడ్డి పోటీ లో ఉన్నారు. అయితే, ప్ర‌త్య‌ర్ధులుగా ఉన్న ఆ ఇద్ద‌రూ ఇప్పుడు ఒక్క‌ట‌య్యారు. సుధీర్ రెడ్డి రెండేళ్లుగా నియోజ‌క వ‌ర్గంలో ప‌ని చేసుకుంటున్నారు.

వివేకా మృతి తో ఇబ్బందులు..

వివేకా మృతి తో ఇబ్బందులు..

జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల‌ని..క‌డ‌ప పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త చూడాల‌ని వివేకా ను బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు ఇన్‌ఛార్జ్ గా వివేకా బాధ్య‌త‌లు తీసుకున్నారు. నియో జ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కీల‌క‌మైన రెండు మండ‌లాల్లో ముఖ్య నేత‌ల‌ను క‌లిసి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నులు ప్రారంభించారు.
సరిగ్గా అదే స‌మ‌యంలో వివేకా హ‌త్య‌కు గుర‌య్యారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు లో వైసిపి అభ్య‌ర్ది సుధీర్ రెడ్డి..ఎంపి అభ్య‌ర్ది అవినాశ్ రెడ్డితో క‌లిసి గ్రామాల్లో ప్ర‌చారానికి వెళ్తుంటే ఆ ఇద్ద‌రి మ‌ద్దుత దారుల‌తో స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయి. ఆ ఇద్ద‌రి ప్రాబ‌ల్యం బ‌లంగా ఉన్న గ్రామాల్లో ప్ర‌చారానికి సుధీర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివేక మ‌ర‌ణం తో వైసిపి నుండి ఇంకా ఎవ‌రు ఈ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు తీసుకోలేదు. ఎంపి అభ్య‌ర్దిగా ఉన్న ఆదినారాయ‌ణ రెడ్డి ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎంపీ గా మెజార్టీ ఓట్లు సాధించాల‌ని భావిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

జ‌గ‌న్ కు ప్ర‌తిష్ఠాత్మ‌కం గా ...

జ‌గ‌న్ కు ప్ర‌తిష్ఠాత్మ‌కం గా ...

ఈ ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న జ‌గ‌న్ కు సొంత జిల్లాలో అన్ని సీట్లు గెల‌వ‌టం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మా రింది. అయితే, జ‌మ్మ‌ల‌మ‌డుగు లో సుధీర్ రెడ్డి ఎలాగైనా గెల‌వాల‌ని జ‌గ‌న్ జిల్లా పార్టీ నేత‌ల‌ను నిర్ధేశించారు. అదే స మ‌యంలో..త‌మ అధినేత జ‌గ‌న్ పై అనుచిత విమర్శ‌లు చేసిన ఆదినారాయ‌ణ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో సుధీర్ గెల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. రాష్ట్ర ప్ర‌చారంలో ఉన్న జ‌గ‌న్ ఆ నియోజ‌క‌వ‌ర్గం పై ప్ర త్యేకంగా దృష్టి పెట్ట‌టం క‌ష్టంగా మారింది. దీంతో..జ‌మ్మ‌ల‌మ‌డుగు లో వైయ‌స్ కుటుంబానికి బంధుత్వం..ప‌రిచ‌యా ల‌ను దృష్టిలో పెట్టుకొని విజ‌య‌మ్మ ను అక్క‌డ ప్ర‌చారానికి పంపాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ప్ర‌చారం చివ‌రి రోజుల్లో ష‌ర్మిళ‌..తాను కూడా ప్ర‌చారానికి వెళ్లాల‌ని భావిస్తున్నారు. దీంతో...జ‌మ్మ‌ల‌మ‌డుగులో ప‌ట్టు సాధించాల‌ని జ‌గ‌న్ ప‌ట్టు ద‌ల‌తో ఉన్న‌ట్లు పార్టీ నేత‌లు చెబుతున్నారు.

English summary
Key fight in Jammalamadugu assembly constituency in Kadapa dist. Winning in Jammalamadugu is become prestigious for Jagan. YS Family members planning to campaign in Jammalamadugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X