కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ కి..ఎంపి సీటుకు లింకేంటి: అది-రామసుబ్బారెడ్డి ఒప్పందం ఎవ‌రికి లాభం..!

|
Google Oneindia TeluguNews

జ‌మ్మ‌ల‌మ‌డుగు నేతలిద్ద‌రూ క‌లిసారు. మ‌నుషులుగా క‌లిసారు.. మ‌నసులు సైతం క‌లిసిన‌ట్టేనా. ఎంపీగా ఆదినారాయ ణ రెడ్డి..జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా రామ సుబ్బారెడ్డి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే, ఇందులో ఈ ఎమ్మెల్సీ ప‌ద‌వికి..ఎంపి సీటుకు లింకు ఏంటి..ఇందులో ప‌ర‌మార్ధం ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది. వీరిద్ద‌రి ఒప్పందం క‌డ‌ప ఎంపీ గా.. జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా రెండు చోట్ల గెల‌వ‌టానికి స‌హ‌క‌రిస్తుందా..లేక ఏం జ‌రుగుతుంది..

రామ‌సుబ్బారెడ్డికి ఆలోచ‌న ఇదేనా..

రామ‌సుబ్బారెడ్డికి ఆలోచ‌న ఇదేనా..

అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌రువాత మాట కూడా క‌ల‌వ‌ని ఆది - రామ సుబ్బారెడ్డి ఇద్ద‌రూ ఒకే మాట మీద‌కు వ‌చ్చారు. వ‌చ్చే ఎన్నికల్లో ఆది నారాయ‌ణ‌రెడ్డి క‌డ‌ప ఎంపీగా.. రామ‌స‌బ్బారెడ్డి జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని పార్టీ అధి నేత ఆదేశించారు. అందుకు ఆ ఇద్ద‌రూ అంగీకరిస్తూనే..ఒక్క ష‌ర‌తు పెట్టారు. ఆదినారాయ‌ణ రెడ్డి జ‌మ్మ‌ల‌మ‌డుగు వ‌దిలి క‌డ‌ప ఎంపీగా పోటీ చేయాలంటే ముందుగా రామ‌సుబ్బారెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని..ఆ ప‌ద‌వి త‌న కుటుంబంలో ఒక‌రికి ఇవ్వాల‌ని కోరారు. దీనికి రామ‌సుబ్బారెడ్డి స‌రే అన్నారు. త‌న‌కు కీల‌క‌మైన జ‌మ్మ‌ల‌మ డుగు లో ఎమ్మెల్యే సీటు కోసం ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్సీ ప‌ద‌విని వ‌దులుకున్నారు. ఎమ్మెల్యేగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలిస్తే..టిడిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే మంత్రి అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న అంచ‌నా. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ప్ర‌త్య‌ర్ధి అయిన ఆదినారాయ‌ణ రెడ్డి త‌మ పార్టీలోకి వ‌చ్చి మంత్రి అవ్వ‌టాన్ని రామ‌సుబ్బారెడ్డి అయిష్టంగానే అం గీక‌రించాల్సి వ‌చ్చింది. ఇక‌, జ‌మ్మ‌ల మ‌డుగు నిజంగా ఆదినారాయ‌ణ రెడ్డి మ‌ద్ద‌తు ఇస్తే త‌న గెలుపు ఖాయ‌మ‌నే భావ న‌లో రామ‌సుబ్బారెడ్డి ఉన్నారు.

ఎంపీగా పోటీ అంటే రిస్క్..అందుకే..

ఎంపీగా పోటీ అంటే రిస్క్..అందుకే..

ముఖ్య‌మంత్రి మాట కోసం తాను క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తున్నాన‌ని ఆది నారాయ‌ణ‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యం లో ప‌ట్టుబ‌ట్టి ఎమ్మెల్సీ ప‌ద‌వి త‌న అన్న కుమారుడికి ఇప్పించారు. అంటే..తాను క‌డ‌ప ఎంపీగా రిస్క్ తీసుకొని పోటీ చేస్తున్న స‌మ‌యంలో..త‌న కుటుంబానికి ఒక ప‌ద‌వి ఉండాల‌నేది ఆది నారాయ‌ణ‌రెడ్డి భావ‌న‌గా క‌నిపిస్తోంది. ఇక‌, ఎంపీగా ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టిడిపి నేత‌ల నుండి మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతోంది. ఇప్ప‌టికే వైసిపి నుండి వ‌చ్చి టిడిపి లో త‌మ పై పెత్త‌నం చేస్తున్నార‌నే భావ‌న‌లో కొంత మంది నియోజ‌క‌వ‌ర్గ టిడిపి నేత‌లు ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌ర‌గుతోంది. ఇదే స‌మ‌యంలో క‌డ‌ప ఎంపీగా పోటీ చేసిన త‌రువాత ఫ‌లితం అనుకూలంగా ఉంటే ఓకే. లేకుంటే త‌న‌కు రాజ‌కీయంగా ఎటువంటి ప్రాధాన్య‌త ఉంటుంద‌నే మీమాంస‌లో ఆది నారాయ‌ణ‌రెడ్డి ఉన్న‌ట్లుగా విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇందులో భాగంగానే..ముందుగానే రామ‌సుబ్బారెడ్డికి ప‌ద‌వి లేకుండా త‌న కుటుంబానికి ఆ ప‌ద‌వి ఇప్పించుకున్నార‌నేది వారి విశ్లేష‌ణ‌.

ఎవ‌రు లాభం పొందుతారు..

ఎవ‌రు లాభం పొందుతారు..

ఎంపీగా ఆదినారాయ‌ణ రెడ్డి..జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యేగా రామ‌సుబ్బారెడ్డి పోటీకి దిగుతున్నారు. వైసిపి నుండి క‌డ‌ప ఎంపీ గా అవినాశ్ రెడ్డి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా స్ప‌ష్ట‌త లేదు. జ‌గ‌న్ కుటుంబం నుండే ఒక‌రు బ‌రిలో ఉంటార ని చెబుతున్నారు. ఇక‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు లో ఇప్ప‌టికే సుధీర్ రెడ్డి వైసిపి అభ్య‌ర్దిగా ఖ‌రార‌య్యారు. ఈ పోటీ ఎలా ఉన్నా జ‌మ్మ‌ల‌మ‌డుగు లో నేత‌లు క‌లిసినంత సులువుగా కింది స్థాయి కేడ‌ర్ క‌లుస్తుందా అనేదే ఇప్పుడు చర్చ‌. జ‌మ్మ‌ల‌మ డుగు లో రామ‌సుబ్బారెడ్డి-ఆది నారాయ‌ణ‌రెడ్డి ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అందించుకుంటేనే జ‌మ్మ‌ల‌మ‌డుగు సీటు ద‌క్కేది. అదే విధంగా క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తున్న ఆదినారాయ‌ణ రెడ్డికి ఇక్క‌డ వ‌చ్చే మెజార్టీనే కీల‌కం కానుంది. తు ది ఫ‌లితాలు ఎలా ఉన్నా..అవి ఈ ఇద్ద‌రి మ‌ద్య సంబంధాల పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ఎమ్మెల్సీ ప‌ద‌వి రామ‌సుబ్బారెడ్డికి లేకుండా చేసి ఆదినారాయ‌ణ రెడ్డి చెక్ పెట్టిన‌ట్టా..లేక జ‌మ్మ‌ల‌మ‌డుగు నుండి ఆదినారాయ‌ణ రెడ్డి పోటీ లేకుండా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగుతున్న రామ‌స‌బ్బారెడ్డి పై చేయి సాధించిన‌ట్లా అనేది ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తేల‌నుంది.

English summary
Jammalamadugu in Kadpa district main leaders compromised in party seats. Ramasubba reddy as Jammalamadugu Mla and Adi narayana reddy as Kadapa Mp contest in coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X