వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాన్స్‌తో భేటీ: మౌనం వీడనున్న పవన్ కళ్యాణ్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విశాఖపట్నం సభ తర్వాత మౌనంగా ఉంటూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనం వీడే అవకాశాలున్నాయి. ఆయన మూడో సభను ఎక్కడ పెడుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన బిజెపికి ప్రచారం చేయడానికి సన్నద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తన అభిమానులతో సమావేశమయ్యారు. అభిమానుల అభిప్రాయాలను తీసుకుని ఆయన ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలోనూ, సమీంధ్రాలోనూ బీజీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ బిజెపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ''కాంగ్రెస్ హటావో దేశ్ బచావో'' నినాదాన్ని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు ప్రకటించిన వియషం తెలిసిందే.

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ తొలుత కర్నాటకలో తమ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో బిజెపి - టిడిపి కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్, జన సేన పార్టీ ఆవిర్భావ సభలోనూ, విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలోనూ నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ను బిజెపి పార్టీ ప్రచారానికి వాడుకోవడానికి రంగం సిద్ధంచేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి బిజెపి తరపున కర్ణాటకలో వవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ పవన్ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలుస్తోంది.

English summary
Jan Sena chief Pawan Kalyan, who met his fans, may compaign for BJP in Karnataka, Andhra Pradesh and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X