గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శేఖర్ రెడ్డి కేసులో మీ అబ్బాయి పేరుందని... అందుకే మౌనమా: చంద్రబాబుకు పవన్ ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: సత్యమేవతే జయతి అంటారు కదా సత్యం చెప్పండని ఆయనచంద్రబాబును అడిగారు. పర్యావరణాన్ని నాశనం చేసే అభివృద్ధి మనకు వద్దని ఆయన అన్నారు. నైతికంగా తాము తప్పు చేస్తున్నామని తమకు తెలుసునని అధికారులు తనకు చెప్పారని, తమ రాజకీయ బాస్‌లు చెప్పారు కాబట్టి చేయక తప్పడం లేదని గోడు వెల్లబోసుకున్నారని ఆయన అన్నారు. న్యాయ పోరాటం చేసిన మహిళను జైల్లో పెడుతారా అని అడిగారు.

జైల్లో పెట్టిన మహిళను పలకరిస్తూ ఇసుక మాఫియా దాడి ఎమ్మెల్యేకు కొమ్ములొచ్చాయా, చట్టం వారికి వర్తించదా, వనజాక్షి మీద దాడి జరిగితే తెలుగుదేశం నాయకులు కొమ్ము కాస్తారా, మేం చేతగాని వాళ్లమా, సహనం చేతగాని తనమా, తమ సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు.

మహిళా అధికారిపై దాడి జరిగితే

మహిళా అధికారిపై దాడి జరిగితే

మహిళా అధికారులపై దాడి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సింగపూర్ తరహా రాజధాని చేయాలంటే సింగపూర్ తరహా పాలన కావాలి చంద్రబాబు గారూ అని అన్నారు. కీర్తిశేషులైన సింగపూర్ ప్రధాని పేరు ప్రస్తావిస్తూ ఆయనకు జాతి, ప్రాంతం లేదని, వివిధ ప్రాంతాలకు ఆయన మంత్రివర్గంలో ఉన్నారని అన్నారు. సింగపూరియన్ జాతి అనే బావనను తీసుకుని వచ్చారని అన్నారు.

 ఆ ఎమ్మెల్యేను వెనుకేసుకొస్తారా...

ఆ ఎమ్మెల్యేను వెనుకేసుకొస్తారా...

మహిళా అధికారిపై దాడి జరిగితే, దాడి చేసినవారిని తోలు ఊడిపోయేలాగా సింగపూర్‌లో కొట్టేవారని అన్నారు. చంద్రబాబు అలాంటివి చేయలేదు కదా అని అన్నారు. మన చట్టాలు ఒప్పుకోకవచ్చు కానీ ఎమ్మెల్యేను వెనకేసుకొస్తారా అని అడిగారు పాతికవేల కోట్ల పైన తాను పన్ను కట్టానని అన్నారు. అభివృద్ధి అంటే తనకు తెలుసునని అన్నారు. వంద కోట్ల సినిమా తాను చేస్తే వేయి కోట్ల డబ్బులు సర్క్యులేట్ అవుతాయని అన్నారు. వీరు చేసే పనులు ఎలా ఉన్నాయని అన్నారు. ఇసుక పెడుతారు, డబ్బులు జేబుల్లోకి వెళ్తాయని అన్నారు. తల్లి భూమిని అడ్డగోలుగా తన్నేస్తున్నారని, అట్టడుగులోకి భూమి లాక్కుపోతుందని అన్నారు.

 అలా కుదరని పవన్ కల్యాణ్

అలా కుదరని పవన్ కల్యాణ్

తప్పు చేసినవారికి 60 శాతం శిక్ష అయితే, ప్రోత్సహించినవారికి 20 శాతం, చూస్తూ ఉండిపోయేవారికి 20 శాతం శిక్ష ఉంటుందని, చూస్తూ ఊరుకుందామా తానైతే చూస్తూ ఊరుకోనని, ఉద్దానం బాధితుల కోసం పవన్ కల్యాణ్ రావాలా అని అడిగారు. ఉద్దానంలో కొంత మాత్రమే ఉందని, కదలిక వచ్చిందని అన్నారు. చేయని తప్పులకు వాళ్లు శిక్ష అనుభవిస్తున్నారని, అభివృద్ధి అంటే కొందరికేనా, అవకాశాలు కొందరికేనా అందరికీ, అధికారం కొన్ని కులాల గుప్పిట్లోనేనా.... కుదురదు, అన్ని కులాలకు అధికారం అందాలని, అలాంటి రాజకీయ వచ్చి తీరుతుందని అన్నారు.

నన్ను శ్రామికుడిగా వాడుకలోదు.

నన్ను శ్రామికుడిగా వాడుకలోదు.

ఆర్థిక వనరులను మీరు కంట్రోలే చేస్తారు, వారికి ఏమ చేయరని అన్నారు. ఈ సమయంలో వైసిపి నేత బొత్స సత్యనారాయణ పేరును ప్రస్తావించారు. రాయలసీమ వెనకబాటుకు అక్కడి రాజకీయాలే కారణమని, చంద్రబాబు కూడా రాయలసీమకు చెందినవారేనని అన్నారు. రైతుల గురించి, మహిళల బాధల గురించి ఎందుకు మాట్లాడాడరని అన్నారు పవన్ కల్యాణ్‌ను తెలుగుదేశం ప్రభుత్వ శ్రామికుడిగా వాడుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.

శేఖర్ రెడ్డి కేసులో మీ అబ్బాయి..

శేఖర్ రెడ్డి కేసులో మీ అబ్బాయి..

ప్రధాని ఎందుకు పట్టించుకుంటారని పవన్ అన్నారు. శేఖర్ రెడ్డి పేరులో మీ అబ్బాయి పేరుందని అంటారు, నిజమో కాదో తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. మీరు ఎందుకు కామ్‌గా ఉంటున్నారని అడిగారు. ముఖ్యమైన ప్రత్యేక హోదాపై మూడు విషయాలు చెబుతుంటే ఆరు అబద్ధాలు చెబుతున్నారని ఆయన చంద్రబాబును అడిగారు. మీకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని అడిగారు.

English summary
Jana Sena chief Pawan kalyan made serious allegations against Andhra Padesh CM Nara Chnadrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X