శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సముద్రస్నానం చేసిన పవన్ కళ్యాణ్, నేడే పోరాట యాత్ర ప్రారంభం

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇఛ్ఛాపురం నుంచి ప్రారంభం కానుంది. కపాసుకుద్ది తీర ప్రాంతంలో గంగపూజ చేశారు. ఉదయం గం.11.30కు స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇచ్ఛాపురంలో నిరసన కవాతులో పాల్గొంటారు.

పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో కలిసి సముద్రస్నానం చేశారు. అనంతరం తీర ప్రాంతంలో గంగపూజ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపించారు.

Jana Sena chief Pawan Kalyan’s 45 day porata yatra to start from Ichchapuram today

కాగా, పవన్‌ తలపెట్టిన జన పోరాట యాత్ర ఈ రోజు ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి మొదలయ్యే ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఆదివారం మధ్యాహ్నం సూరంగి రాజావారి మైదానంలో బహిరంగ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.

English summary
Jana Sena chief Pawan Kalyan’s State-wide ‘porata yatra’ is all set to start from Ichchapuram on Sunday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X