వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నామన టార్గెట్ ఏంటో కరెక్ట్ గా చెప్పు...పవన్ తీరుతో తలపట్టుకుంటున్నజనసేన కార్యకర్తలు...

|
Google Oneindia TeluguNews

ఒంగోలు: అన్నా...అసలు మన టార్గెట్ ఏంటో చెప్పన్నా...దాన్నిబట్టిదూసుకుపోతాం...అనుకుంటున్నారట జనసేన కార్యకర్తలు...పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ పాలసీ ఏంటో...ఆయన మనసులో ఏముందో అర్థం చేసుకోలేక అల్లాడిపోతున్నారట...పవన్ కళ్యాణ్ ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడుతుండటంతో ఏం చెయ్యాలో అర్థం కాక బుర్రగోక్కుంటున్నారట...అంతేకాదు ఒకే వేదిక మీద పరస్పర విరుధ్దమైన సూత్రీకరణలు చేస్తూండటంతో గందరగోళానికి గురవుతున్నారట.ఆ కన్ఫ్యూజన్లో ఏం చేస్తే తమ అధినేత ఏమనుకుంటాడో అని ఆందోళన చెందుతున్నారట...

ఇది ఆ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డ్ చర్చల్లో చెప్పి వాపోతున్నారు. మరీ సీరియస్ టాపిక్ ల విషయాల సంగతి అటుంచితే పవన్ తాజాగా మూడు సందర్భాల్లో రియాక్ట్ అయిన తీరు జనసేన కార్యకర్తలను ఫూర్తిగా అయోమయానికి గురిచేసిందట...పైగా ఆ నాలుగు సందర్భాలు కూడా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడేనట...ఆ సందర్భాలు ఇవీ....

 సందర్భం 1...

సందర్భం 1...

విజయవాడలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం... ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాను జగన్ కు ఎందుకు మద్దతు ఇవ్వలేదో కార్యకర్తలకు వివరించారు. వైఎస్ జ‌గ‌న్‌పై సీబీఐ కేసులు, అభియోగాలు లేక‌పోయి ఉంటే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేవాడినేమో...అవినీతి ఆరోప‌ణ‌లు..సీబీఐ కేసులు ఉన్న వ్య‌క్తికి మ‌ద్ద‌తు ఇస్తే త‌ప్పుచేసిన‌వాడిన‌వుతాను. అందుకే బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చాను అని చెప్పారు.

 సందర్భం 2..

సందర్భం 2..

అదే మీటింగ్ లో పవన్ మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇబ్బంది పడ్డారని, అయినప్పటికీ ఆయన సీఎం కుర్చీలో ఉంటే ఆయనకు ఉన్న అనుభవంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తారన్న భావనతోనే ఆ అంశంపై తాను మౌనంగా ఉన్నానని చెప్పారు. నేను ఆ అంశాన్ని ప్ర‌శ్నిస్తే సీఎం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోతారు. త‌ప్పును ఎత్తి చూప‌డం కంటే ఆయ‌న వ‌ల్ల ఎంతోమందికి న్యాయం జ‌రుగుతుంద‌నేదే నాకు ముఖ్యం. అందువల్లే అప్పుడు తాను టిడిపిని నిలదీయలేదని అన్నారు

 సందర్భం 3..

సందర్భం 3..

పవన్ కల్యాణ్ తన ఆంధ్రా టూర్ లో భాగంగా ఒంగోలులో ప్రసంగిస్తూ తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ తాను ఒక్కడినే బయల్దేరానని, మార్పు ఎప్పుడైనా సరే ఒక్కడితోనే మొదలవుతుందని అన్నారు. మళ్లీ కాసేపటికి అదే ప్రసంగంలో ప్రత్యేకహోదా సంగతి కూడా తానే ప్రస్తావించారు. ఆ సందర్భంలో తాను చాలా చిన్నవాడినని...నేను ఒక్కడినే పోరాడితే ప్రత్యేక హోదా రాదు...అందరూ కలిస్తే సాధించుకోవచ్చుని అని మాట్లాడారు.

సందర్భం 4..

సందర్భం 4..

శనివారం ఒంగోలు లో జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ మోడీపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ప్రధాని మాట తప్పాడని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.

 ముందు హుషారు...తరువాత బేజారు

ముందు హుషారు...తరువాత బేజారు

మోడీ బిజేపిపై నిప్పులు చెరుగుతుండటంతో అప్పటి వరకు లేని స్పష్టత వచ్చినట్లుగా భావించిన జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా
'మోడీ డౌన్ డౌన్... పీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అయితే మళ్లీ పవన్ వెంటనే జోక్యం చేసుకుని కార్యకర్తలను నినాదాలు ఆపమని చెబుతూ "డౌన్ డౌన్ అనమని నేను చెప్పానా? ఎవరినీ తక్కువ చేయవద్దు" అది చాలా తప్పు...అని సూచించారు. దీంతో తప్పు చేసిన వ్యక్తిని విమర్శిస్తుంటే తాము డౌన్ డౌన్ అంటే తప్పేమిటో అర్థం గాక పవన్ అభిమానులు బుర్ర గోక్కున్నారట. అంతలోనే పవన్ ప్రస్తుత సమస్యల గురించి పరిష్కారం గురించి తీవ్ర స్వరంతో మాట్లాడుతూ హెచ్చరికలు చేస్తుంటే కార్యకర్తలు...సిఎం...కాబోయే సిఎం...అని నినాదాలు చేస్తే పవన్ మళ్లీ వారించారట...సిఎం అవ్వాలంటే ఎంతో అనుభవం ఉండాలని అది తనకు లేదని అన్నారట..దీంతో జనసేన అభిమానుల్లో అయోమయం పతాకస్థాయికి చేరిందట...

 పవన్ తీరేమిటో...

పవన్ తీరేమిటో...

వైసిపి అధినేత జగన్ మీద ఆరోపణలు, అభియోగాలనే చూసి ఆ పార్టీకి మద్దతు ఇవ్వలేదని చెప్పిన పవన్ ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ని ప్రశ్నించడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేయడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందనే ఆలోచనతోనే నేను నిగ్రహంతో ఉన్నాను..ప్రజలకు అన్యాయం జరుగుతుందని మౌనం వహించానని చెప్పిన లాజిక్ ఏమిటో అర్థం కావడం లేదట. ముందు ఒకలా కాసేపట్లో ఒకలా చెప్పారేంటా అని తలలు తడుముకున్నారట. అయితే గుండు కొట్టించుకున్న విషయంలో టిడిపి వాళ్లే నన్ను అవమానపర్చారని చెప్పడం ద్వారా టిడిపిలో కొందరు పవన్ వ్యతిరేకులు ఉన్నారని మాత్రం అర్థం అయిందట. ఒకసారి తానొక్కడిని చాలని మరోసారి తానొక్కడినే ఏమి సరిపోతానని అనడం అర్థం కావడం లేదట. పోనీ బిజెపి మీద,మోడీ మీద ఫైర్ అయ్యారు కదాని మోడీ డౌన్ డౌన్ అంటే అదీ తప్పు అనడంతో ఇక ఎలా మసలుకోవాలో వారికి అర్థం కావడం లేదట. మరోవైపు రెండు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానంటూనే మళ్లీ తాను సిఎం కానని, సిఎం అవ్వాలంటే ఎంతో అనుభవం ఉండాలని అంటుంటే మరి పార్టీ పెట్టేది గెలిచి సిఎం అవడానికే కదా...అదే మాట అంటుంటే అన్న ఒప్పుకోడేంటని మధనపడుతున్నారట. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు..పవన్ తన మనసులో ఏముందో సూటిగా చెప్పేస్తే ఆ ప్రకారం ముందుకు దూసుకుపోతాం కదా...పవన్ అలా చేస్తే బావుండు అని పవన్ అభిమానులు,జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారట.

English summary
ongole: Pawan Kalyan seems to be very different. he will not be too harsh to replace the word ‘different’ by ‘confused’ and it makes no difference. But once he comes into active politics, he needs to do a lot of homework before he makes statements in public and should not fumble while speaking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X