వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ ఎఫెక్ట్, పవన్ దెబ్బ: బాబు-జగన్‌లకు షాక్, అలా హంగ్‌కు ఛాన్స్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటు లోపల, బయట ఆందోళనలు చేస్తున్నాయి. జగన్ అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పగా, చంద్రబాబు కేంద్ర కేబినెట్‌కు దూరమయ్యారు.

చదవండి: కర్నాటకపై బాబు-జగన్-పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్!: రంగంలోకి 'తెలుగు' బీజేపీ నేతలు

ఈ నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనిపై మైసూరా రెడ్డి ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారని, కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోవడం ద్వారా జగన్‌ను ఇరకాటంలో పడేశారని చెప్పారు.

చదవండి: ఆ ఒత్తిడే నా తండ్రి మృతికి కారణం, పీక్కు తినేందుకు ఏకమయ్యారు: భూమా అఖిలప్రియ

జగన్ బీజేపీతో వెళ్లలేడు

జగన్ బీజేపీతో వెళ్లలేడు

వైయస్ జగన్ 2019 ఎన్నికల్లో బీజేపీతో వెళ్లే అవకాశాలు అంతగా లేవని మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రజలు అతనికి అనుకూలంగా లేరని అభిప్రాయపడ్డారు. జగన్ సొంతగానే పోటీ చేయాల్సి ఉంటుందన్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో జగన్ ముఖ్యమంత్రిని సవాల్ చేశారని, అయితే కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు జగన్ టీడీపీని ఇరుకున పడేసే ప్రయత్నం చేసినా ఫలితముండదని అభిప్రాయపడ్డారు.

Recommended Video

చిరంజీవి ఏం పీకలేకపోయాడు, 2019 మాదే ?
జగన్-బీజేపీ.. చంద్రబాబుకు అనుకూలం

జగన్-బీజేపీ.. చంద్రబాబుకు అనుకూలం

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ బీజేపీని గట్టిగా ఏమీ అనలేని పరిస్థితి ఉందని మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రత్యేక హోదా వంటి అంశాల కారణంగా బీజేపీపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇంకోవైపు బీజేపీని గట్టిగా అంటే జగన్‌ను కేసులు వెంటాడుతాయని అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన కేంద్రాన్ని గట్టిగా అనలేని పరిస్థితి అన్నారు. ఈ పరిణామాలు చంద్రబాబుకు అనుకూలిస్తాయన్నారు.

అలా వెళ్తే హంగ్ ఛాన్స్

అలా వెళ్తే హంగ్ ఛాన్స్

ఇదిలా ఉండగా, కొందరి అభిప్రాయం మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పడం, పవన్ కితాబివ్వడం తెలిసిందే. దీనిపై మైసూరా స్పందిస్తూ.. పవన్ అలా వెళ్తే వచ్చే ఎన్నికల్లో కనీసం హంగ్ ఏర్పడే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

అలా అయితే అనుకూలం

అలా అయితే అనుకూలం

కాంగ్రెస్, జనసేన, లెఫ్ట్ కలిసి పోటీ చేస్తే టీడీపీ, వైసీపీలకు దెబ్బ పడుతుందని, హంగ్ పరిస్థితి వస్తుందని, అప్పుడు ఎన్నికల అనంతరం బాబు లేదా జగన్‌లు కచ్చితంగా వీరితో పొత్తు పెట్టుకునే పరిస్థితులు ఉంటాయని మైసూరా అభిప్రాయపడ్డారు. అప్పుడు అది తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని అంటున్నారు.

బీజేపీతో వెళ్లలేమని వైసీపీ నేతల భావన

బీజేపీతో వెళ్లలేమని వైసీపీ నేతల భావన

మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ బీజేపీని విడిచినా తాము వెళ్లే పరిస్థితి లేదని వైసీపీ నాయకులు భావిస్తున్నారట. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసినా 45 శాతం ఓట్లు వచ్చాయని, వైసీపీకి ఒంటరిగా 44 శాతం వచ్చాయని, ఇప్పుడు అలయెన్స్ లేకుండా ముందుకు వెళ్తే జగన్ గెలుస్తారని వైసీపీ లెక్కలు వేస్తోంది.

English summary
Pavan Kalyan’s “Jana Sena” may go for an alliance with the Congress and Communists in the 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X