విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కు కోపమొచ్చింది..! జనసైనికులకు క్లాస్.. కాంగ్రెస్ పార్టీలాగ భయపడను..!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఆయన ఆగ్రహాన్ని, తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అగ్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలను కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తాము తీసుకునే నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత సమయంలో కార్యాలయాలకు వచ్చి, వాటిని వ్యక్తీకరించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రోడ్లెక్కినట్లు సోషల్ మీడియా ఎక్కితే నిర్ణయాలు వెనక్కి తీసుకోవడానికి తాను నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదని మందలించారు. పార్టీ తీసుకునే కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలను గౌరవించాల్సిందేనని అన్నారు. సోషల్ మీడియా అనే ఒక అద్భుతమైన వ్యవస్థను బజార్లో తిట్టుకునే దానిలా మార్చొద్దని అన్నారు. రాజకీయాల్లో చాలా మందికి భావోద్వేగాలు, ఆవేశం ఎక్కువ ఉంటాయని, ఒక్కోసారి నాతో సహా నాయకులందరిని తిడుతుంటారని అన్నారు. రాజకీయాల్లో మాట నియంత్రణ, సమన్వయం చాలా అవసరమని హితబోధ చేశారు. అభిమానుల ప్రేమ తనకు అడ్డంకి కాకూడదని, తనకు స్వేచ్ఛ కావాలని అన్నారు.

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నాయకులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో ఆయన సమావేశం అయ్యారు. ఎన్నికలు ముగిసిన తరువాత పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితులపై పవన్ కల్యాణ్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాకినాడ, నరసాపురం లోక్ సభ నియోజకవర్గాలను సమీక్షించారు. తాజాగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధి నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్, పీఏసీ ఛైర్మన్ పీ రామ్మోహన్ రావు సహా పలువురు నేతలు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పలు అంశాలను స్పృశించారు. ముఖ్యమంత్రి పదవిని అందుకోవాలనే ఆశతోనే తాను పార్టీని నెలకొల్పలేదని అన్నారు.

 ముఖ్యమంత్రి కావడం నా లక్ష్యం కాదు..

ముఖ్యమంత్రి కావడం నా లక్ష్యం కాదు..

తాను ముఖ్యమంత్రిని కావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదని ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయ పార్టీని స్థాపించానని అన్నారు. ప్రాంతీయంగా పుట్టిన పార్టీ అయినప్పటికీ..జాతీయవాదాన్ని వినిపించేలా తయారు చేశామని అన్నారు. మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లే పార్టీ అని అభివర్ణించారు. ఏ జాతీయ పార్టీ తమ తల మీద తుపాకులు పెట్టినా విలీనం చేసే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో తాను హామీ మాట ఇస్తున్నానని స్పష్టం చేశారు. దేశ పౌరులందరిని సమదృష్టితో చూసేలా, సమగ్రతను కాపాడేలా, ఎవరు ద్వితీయశ్రేణి పౌరులుగా ఉండకూడదు అనే జాతీయవాదంతో పెట్టినది ఒక్ జనసేన మాత్రమేనని అన్నారు.

మా నాన్న ముఖ్యమంత్రి అయ్యారు..నేనూ అవ్వాలి అంటే కుదరదు

మా నాన్న ముఖ్యమంత్రి అయ్యారు..నేనూ అవ్వాలి అంటే కుదరదు

తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పెట్టారని, టీఆర్ఎస్ తెలంగాణ హక్కుల కోసం పుట్టిందని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్.. పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్న ఒక పార్టీ తన తండ్రి ముఖ్యమంత్రి అయ్యారు, నేనూ ముఖ్యమంత్రిని కావాలనే ఏకైక లక్ష్యంతో ఆవిర్భవించిందని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభుత్వానికి 100 రోజుల గడువు ఇస్తున్నామని, ఆ తరవాత ముఖ్యమంత్రి పని తీరును బట్టి ఎలా స్పందించాలి? ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నాయకుల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటానని, వారి పనితీరును బట్టి భాద్యతలు అప్పగిస్తామని చెప్పారు.

 నావి లోతైన ఆలోచనలు..

నావి లోతైన ఆలోచనలు..

తాను వ్యక్తిగత లాభం కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. తెలుగు ప్రజలకు అండగా ఉండటానికే వచ్చానని, తనవి చాలా లోతైన ఆలోచనని అన్నారు. ఒక ఓటమి తనను భయపెట్టలేదని చెప్పారు. తాను పదే పదే చెప్పిన విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కారణం తనను అర్థం చేసుకోవడానికేనని వివరణ ఇచ్చారు. తాను సాధారణ జీవితం కోరుకునే వ్యక్తిని అని, వేల కోట్ల సంపాదన ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదని అన్నారు. పార్టీ కార్యకర్తలు సంధించే ఒక్క ప్రశ్న, వారు వేసే ఒక్క అడుగు ఈ సమాజాన్ని మార్చగలదని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఒక్కో ప్రశ్న ఒక్కో తూటాలా మారి అవినీతి నాయకుల అంతిమ సంస్కారానికి అంకురార్పణ జరగాలని పవన్ కల్యాణ్ ఉద్విగ్నంగా పిలుపు ఇచ్చారు. బలం, బలహీనత రెండు తెలిసిన వ్యక్తినని చెప్పారు. ఇప్పుడు తనను తిట్టే వ్యక్తులకు బలం ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. తన అభిమానులు ఓటు వేయడంలో వారికి ఆ బలం వచ్చిందని చెప్పారు.

టెంట్ వేసుకుని పార్టీని నడిపిస్తా..

టెంట్ వేసుకుని పార్టీని నడిపిస్తా..


శ్రీకాకుళం ప్రాంతంలో ఒక త్రోపుడు బండి మీద టిఫిన్లు అమ్ముకునే వ్యక్తి పార్టీకి 20వేల రూపాయలు పార్టీకి ఖర్చుపెడుతున్నారని, ఓ చిన్న టిఫిన్ బండి నడిపే వ్యక్తి అంత సహాయం చేస్తే పార్టీ కార్యకర్తలు, నాయకులు నెలకు ఒక రూపాయి పార్టీ చందాగా ఇవ్వాలని సూచించారు. ఒక పూట భోజనం ఖర్చు తగ్గించుకుని డబ్బులు పోగేసి తెలంగాణలో ఉద్యమాలు చేసిన నాయకులు చాలా మంది ఉన్నారని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో కార్యాలయాలు అవసరం అయినప్పటికీ.. తన దగ్గర అంత ఆర్థిక సత్తా లేదని, 175 నియోజకవర్గాల్లో ఆఫీసులు నిర్మించే ఆర్థిక సత్తా లేనప్పుడు, టెంట్ వేసుకొని పార్టీని నడిపిస్తానని అన్నారు. సినిమాలు చేసి వచ్చిన డబ్బుతో స్థలం కొన్నానని, పార్టీ ఆఫీస్ నిర్మించి ముందుకు వెళ్లానని అన్నారు. రాజకీయ పార్టీని ఎలా నడుపుతావంటూ తనను చాలామంది ప్రశ్నించారని, పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకునే కొద్దిమంది వ్యక్తులతో నడిపించుకుంటానని అన్నారు.

ఉంటే ఉండండి..పోతే పొండి..

ఉంటే ఉండండి..పోతే పొండి..

తాను ఎన్నో దెబ్బలు తింటూ ఇక్కడి వరకు పార్టీని తీసుకువచ్చానని పవన్ కల్యాణ్ చెప్పారు. తనను విమర్శల నుంచి రక్షించకుండా, తననే విమర్శించే నాయకులు అక్కర్లేదని, ఉంటే ఉండండి పోతే పోండి అని నాయకులకు హెచ్చరించారు.
తనను చాలామంది విమర్శిస్తుంటారని, అసలు తనను విమర్శించే హక్కు వాళ్లకు ఉందా అని ప్రశ్నించారు. కృష్ణానదికి వరదలు సంభవించిన నేపథ్యంలో.. బాధితులను ఆదుకోవాలని పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని ఆదేశించారు. ప్రాణ నష్టాన్ని నివారించడానికి శతవిధాలా కృషి చేయాలని అన్నారు.

English summary
Jana Sena Party President Pawan Kalyan was participate in Vijayawada Parliamentary leaders and Party workers and supporters on Friday in Vijayawada. He Spoke lot of issues in this meeting. Pawan Kalyan indirectly Criticized to Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X