కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్: పోలింగ్ త‌రువాత తొలిసారి..జ‌నంలోకి!

|
Google Oneindia TeluguNews

అమరావతి: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నెల‌రోజుల త‌రువాత జ‌నంలోకి రానున్నారు. శ‌నివారం ఆయ‌న క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు వెళ్ల‌నున్నారు. కింద‌టి నెల 11వ తేదీన పోలింగ్ ముగిసిన త‌రువాత.. ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌కు వెళ్లిపోయారు. అక్క‌డే విశ్రాంతి తీసుకున్నారు. స‌రిగ్గా నెల‌రోజుల త‌రువాత ఆయ‌న మ‌ళ్లీ జ‌నంలోకి రానున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున నంద్యాల నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి క‌న్నుమూసిన నేప‌థ్యంలో- ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఎస్పీవై రెడ్డి చిత్ర‌ప‌టానికి నివాళి అర్పిస్తారు.

చంద్రబాబు సర్వేలో పాల్ పార్టీకి 100 స్థానాలు .. బాబుకి రిటైర్మెంట్ ఇద్దాం ..కేఏ పాల్చంద్రబాబు సర్వేలో పాల్ పార్టీకి 100 స్థానాలు .. బాబుకి రిటైర్మెంట్ ఇద్దాం ..కేఏ పాల్

దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను పార్టీ విడుద‌ల చేసింది. నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి కింద‌టి నెల 30న కన్నుమూసిన విష‌యం తెలిసిందే. గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైదరాబాద్‌లో కేర్ ఆసుప‌త్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఏప్రిల్ 3వ తేదీన ఆయన ఆసుప‌త్రిలో చేరారు.

Jana Sena Party Chief Pawan Kalyan will visit Nandyal on Saturday

ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న స‌మ‌యంలో అనారోగ్యానికి గురి కావ‌డంతో హుటాహుటిన కేర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్పటి నుంచి ఆయ‌న‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వ‌చ్చారు డాక్ట‌ర్లు. 30వ తేదీన ఆయ‌న ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు.

English summary
Jana Sena Party President Pawan Kalyan will visit Nandyal on Saturday, Party released a Official statement on Thursday. Pawan Kalyan participate in condolence meeting of Party Senior leader and Nandyal Lok Sabha Party Candidate SPY Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X