వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదకరమైన విభజన శక్తిగా పవన్ కల్యాణ్: పని చేయలేను: జనసేనకు రాజు రవితేజ గుడ్ బై!

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీకి రాజీనామాల తాకిడి తగ్గట్లేదు. ఒక్కరొక్కరుగా కీలక నాయకులు జనసేన నుంచి తప్పుకొంటున్నారు. రాజీనామా చేసి.. వైదొలగుతున్నారు. తాజాగా అదే జాబితాలో జనసేన పార్టీ కీలక నాయకుడు రాజు రవితేజ కూడా చేరిపోయారు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో పొలిట్ బ్యురో సభ్యుడి హోదాలో ఆయన కొనసాగారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు కుడిభుజంగా పేరు తెచ్చుకున్న కీలక నాయకుడు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.

పౌరసత్వ నిరసల ఎఫెక్ట్: అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దు..!పౌరసత్వ నిరసల ఎఫెక్ట్: అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దు..!

పవన్ తో గానీ, జనసేనతో గానీ సంబంధం లేదు..


పవన్ కళ్యాణ్ తో గానీ, జనసేన పార్టీతో గానీ ఇక నుంచి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఉండబోదని రాజు రవితేజ అన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని ఆయన కోరారు. పార్టీ భావజాలం, పార్టీ రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించానని అన్నారు. జనసేన పార్టీకి మొట్ట మొదటి ప్రధాన కార్యదర్శి తాను ఎన్నికయ్యానని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను పార్టీలో పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నానని చెప్పారు.

కక్షసాధింపు ధోరణి పెరిగింది..

పవన్ కల్యాణ్ కోరిక మేరకు తాను ఈ పదవి ఇష్టం లేకపోయినప్పటికీ అంగీకరించానని అన్నారు. ఇక మీదట తాను పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయబోనని, ఆయనతో లేదా జనసేన పార్టీతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండట్లేదని అన్నారు. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు కక్షసాధింపు ధోరణి పెరిగిందని రాజు రవితేజ ఆరోపించారు. కులం, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారని విమర్శించారు.

పదవులకు అనర్హుడు..

రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదని ధ్వజమెత్తారు. అర్హత లేకుండా పొందినది, అనుమతి లేకుండా వెళ్లిపోతుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను జనసేన పార్టీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని అన్నారు. రాజీనామాను ఆమోదించిన పవన్ కల్యాణ్..

రాజీనామా ఆమోదం

రాజు రవితేజ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఆయన ఆవేదనను, అభిప్రాయాలను పార్టీ నాయకత్వం గౌరవిస్తోందని చెప్పారు. ఇదివరకు ఆయన ఇలాంటి బాధ, ఆవేదనతోనే రాజకీయాల్లోకి వచ్చారని, జనసేనలో కీలక నేతగా ఎదిగారని అన్నారు. ఆయనకు మంచి భవిష్యత్తు లభించాలని కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

English summary
Jana Sena Party polit bureau member Raju Ravitej quit the Party. He sent his resignation letter to the Party leaders. Jana Sena Party president Pawan Kalyan accepted his resignation on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X