వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pawan Kalyan: వైసీపీ రంగులతో నిన్న జాతీయ జెండా..నేడు జాతిపిత..రేపు ఎవరు జగన్ రెడ్డి జీ: పవన్ కల్యాణ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండా రంగుల వివాదం రోజురోజుకూ ఉధృతమౌతోంది. అధికార పార్టీ నాయకుల మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ప్రభుత్వ వైఖరిపై ఘాటు విమర్శలు చేయడానికి రాజకీయ ప్రత్యర్థులకు అయాచిత అస్త్రంలాగా మారుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు వైఎస్ఆర్సీపీ జెండాలోని రంగులతో నింపేయడాన్ని తప్పు పడుతూ ఇదివరకే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతాపార్టీలు అధికార పార్టీపై ముప్పేట దాడిని చేశాయి. తాజాగా మరోసారి అలాంటి ఉదంతానికి అవకాశం ఇచ్చినట్టయింది వైఎస్ఆర్సీపీకి.

అధికారం పోయిందిగా: అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పట్టాలెక్కడం డౌటేనా?అధికారం పోయిందిగా: అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పట్టాలెక్కడం డౌటేనా?

ఫొటోను ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్..

జాతిపిత మహాత్మాగాంధీకి బస్ట్ సైజు విగ్రహాన్ని అమర్చిన దిమ్మెకు వైఎస్ఆర్సీపీ జెండా రంగులు పూలిమి ఉన్న ఓ ఫొటోను పవన్ కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. `వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా, ఈరోజు గాంధీజీ, రేపు ఎవ్వరు శ్రీ జగన్ రెడ్డి జీ..? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తోన్న విజయనగరం జిల్లాలోనిది ఈ ఫొటో అని రాశారు.

క్షణాల్లో వైరల్ గా..

క్షణాల్లో వైరల్ గా..

ఈ ఫొటో క్షణాల్లో వైరల్ గా మారింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు దీనిపై ఘాటు కామెంట్లను చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రంగులు వేసుకుని పరిపాలన సాగిస్తోందంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. మహాత్మగాంధీని మాత్రమే వదిలి వేసి, దిమ్మె మొత్తాన్నీ రంగులతో నింపేశారని విమర్శిస్తున్నారు. ఇదివరకు అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలంలో ఓ గ్రామ పంచాయతీ భవనంపై ముద్రించి ఉన్న జాతీయ పతాకాన్ని చెరిపేసి, వైసీపీ రంగులను పూసిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.

విమర్శల సుడిగుండంలో వైఎస్ఆర్సీపీ..

విమర్శల సుడిగుండంలో వైఎస్ఆర్సీపీ..

రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జెండా రంగుల వ్యవహారం పార్టీ నాయకులకు తలనొప్పిని తెచ్చి పెడుతూనే వస్తోంది. అధికార పార్టీ నాయకులను విమర్శల సుడిగుండంలో నెట్టేస్తోంది. ఆత్మరక్షణలో పడేస్తోంది. విమర్శలకు సమాధానాలను ఇచ్చుకుంటూ పోవాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది. గ్రామ సచివాలయాలకు పార్టీ జెండా రంగులను పూయాలంటూ ఏ ముహూర్తంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో గానీ.. ప్రతి విషయంలోనూ ఈ పార్టీ రంగుల అద్దకం వివాదం చిలికి, చిలికి గాలీవానగా మారుతోంది. ఇలాంటి పనులను నిషేధిస్తూ ప్రభుత్వం సైతం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం మరిన్ని వివాదాాలకు కేంద్రబిందువుగా మారుతోంది.

English summary
Jana Sena Party president Pawan Kalyan is posted a ruling YSR Congress Party flag coloured Mahatma Gandhi photo on his twitter on Friday. He questioned to Chief Minister YS Jagan Mohan Reddy that Yester day Nataional flag, today Gandhiji, Who is tomorrow?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X