అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ చిరంజీవిపై, 2019లో ఏం చేయాలో నాకు బాగా తెలుసు: వెంకయ్యపై పవన్ (వీడియో )

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో ప్రసంగించారు.

అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు

పవన్ మాటల్లో.. 'ఇక్కడకు వచ్చిన అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు హృదయపూర్వక నమస్కారం. 2014 ఎన్నికల సమయంలో వచ్చాను. తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వచ్చాను. ఆ రోజున నేను మద్దతు పలుకుతున్నానని, సమస్యలు పరిష్కరించాలని చెప్పాను

ఆ పార్టీలకు మద్దతిస్తున్నానని, సమస్యలు వస్తే పరిష్కరించేందుకు ముందుంటానని చెప్పాను. ఆ రోజు ఎంతమంది నమ్మారో తెలియదు. కానీ సమస్యలు ఎంత పెద్దవి వచ్చినా నిలబడతాం. పోరాడుతాం.

అనంతపురం అంటే నాకు చాలా ప్రేమ, ఇష్టం. మీరు చూపించే ప్రేమ, అప్యాయతల కంటే కూడా కరువుతో ఇబ్బంది పడే జిల్లా. ఇలాంటి జిల్లాకు అండగా ఉండటం నాకు చాలా ఇష్టం.

ఇదీ జనసేన, మోడీ అపాయింట్‌మెంట్ కోరా: కొత్త గెటప్‌లో పవన్, సైటొచ్చింది ఇదీ జనసేన, మోడీ అపాయింట్‌మెంట్ కోరా: కొత్త గెటప్‌లో పవన్, సైటొచ్చింది

సరిహద్దుల్లో రెండు మూడు వారాల క్రితం పాకిస్తాన్ దేశం మన సైనికుల పైన దాడి చేసి చంపిన తర్వాత అలాంటి సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం సరైంది కాదనిపించింది. ఒక్కసారిగా ముఖ్య అంశాలు ప్రారంభించబోయే ముందు చనిపోయిన మన భారత జవాన్ల కోసం కొద్ది క్షణాలు మౌనం పాటిద్దాం.' అన్నారు.

మౌనం పాటించిన అనంతరం.. ఒకసారి మన దేశానికి, జన్మభూమికి జేజేలు కొడదామంటూ.. భారత్ మాతాకీ జై అన్నారు.

చాలా చదివి అర్థం చేసుకున్నా

నేను హోదా గురించి మాట్లాడేందుకు చాలా ఆలోచించానని చెప్పారు. మేధావులు రాశారని సెటైర్ వేశారు. నాలాంటి వాళ్లు మాట్లాడాలంటే చాలా చదవాలన్నారు. తెంత్ క్లాస్ పాసైన నాకు తెలుసుకొని మాట్లాడాలన్నారు.

ఎవరైనా అందరికీ సాధారణ భాషను వాడుతారని, కానీ తికమక భాష వాడి మనలను ఇబ్బంది పెట్టాలని చూస్తారని అభిప్రాయపడ్డారు. నేను ఆర్థిక శాస్త్రవేత్తలతో కూర్చొని, అర్ధం చేసుకున్న తర్వాతనే మీ ముందుకు వచ్చానని చెప్పారు.

కొందరు ఇది పాచిపోయిన లడ్డూలు అన్నారు. ప్యాకేజీతో మనకు రావాల్సిందే ఇచ్చారని, కొత్తగా ఇచ్చిందేం లేదన్నారు.

పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారన్నారు. ఎంపీలు పెప్పర్ స్పేలు కొట్టవచ్చునని, తలుపులు మూసి విభజన చేసారన్నారు.

2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఓడినా పర్లైదు, నేను కూలి పని చేస్తా: పవన్ 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఓడినా పర్లైదు, నేను కూలి పని చేస్తా: పవన్

వెంకయ్యకు సన్మానాలపై సెటైర్

ప్రత్యేక ప్యాకేజీ అద్భుతం అని చెప్పవచ్చునని అన్నారు. చట్టబద్ధత లేని ప్యాకేజీకి సన్మానాలు చేయించుకున్న వారు ఉన్నారని వెంకయ్య నాయుడును ఉద్దేశించి అన్నారు. ఏపీని వెంకయ్య వంచించారని, మోసం చేశారన్నారు.

కుటుంబాన్ని పక్కన పెట్టా

నేను కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ బిజెపి, టిడిపికి మద్దతు పలికానని తన సోదరుడు చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. అనంతపురం కరువును దృష్టిలో పెట్టుకొని తాను బీజేపీకి టిడిపికి మద్దతిచ్చానని చెప్పారు.

ఇది మీకు ముగిసిన అధ్యాయం కావొచ్చు కాక, మాకు కాదన్నారు. దీని నుంచి సరికొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. దండాలు పెట్టి మరీ ఓట్లు అడిగారని, అందలం ఎక్కించాక ఇప్పుడు ప్రజలను మర్చిపోయారన్నారు.

అనంతపురంలోని తిమ్మమ్మ మర్రిమాను కూడా ఎదిగిందన్నారు. ఓ చెట్టు కూడా కృతజ్ఞతతో నీడను ఇచ్చిందన్నారు. అలాంటిది రాజకీయ పార్టీలు మాత్రం ఓటు వేయండి అది చేస్తామని చెప్పి ఆ తర్వాత మరుస్తున్నారని మండిపడ్డారు.

మీ మూలాలు జనాల వద్దే

మీ మూలాలు, మీ పునాదులు మా వద్దే ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ప్యాకేజీ పైన వివిధ రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. జైట్లీ రూ.2 లక్షల అయిదువేల కోట్లు అంటారని, మరొకరు రూ.2 లక్షల ఇరవై అయిదువేల కోట్లు అంటారన్నారు. కేంద్రమంత్రుల మధ్యే స్పష్టత లేదన్నారు. ఎవరికి భయపడి అర్ధరాత్రి ప్యాకేజీని ప్రకటించారో చెప్పాలన్నారు. అర్ధరాత్రి ప్రకటనతోనే మోసం చేస్తున్నారని తెలుస్తోందన్నారు.

కావాలనే వంచిస్తున్నారు, బాబు పొగుడుతున్నారు

రాష్ట్రాన్ని ఎలాగైతే తలుపులు మూసేసి విభజన చేశారో, ఇప్పుడు ప్యాకేజీ కూడా అలాగే ఇచ్చారన్నారు. ప్యాకేజీకి ఎలాంటి చట్టబద్ధత లేదన్నారు. మీరు కావాలనే మమ్మల్ని వంచిస్తున్నారని చెప్పారు.

మనకు రావాల్సిందే ఇచ్చారని, అందులో ఎక్కువగా ఇచ్చిందేమీ లేదన్నారు. వారు రావాల్సిందే ఇచ్చినా, చంద్రబాబు ఆహా ఆంధ్రబోజా, ఓహో ఆంధ్రబోజా అంటూ పొగడ్తలు కురిపించారని ఎద్దేవా చేశారు.

శ్రీశ్రీ జగన్మోహన్.., శత్రువునే: పవన్ కౌంటర్, చంద్రబాబుకు '2' హెచ్చరికలు శ్రీశ్రీ జగన్మోహన్.., శత్రువునే: పవన్ కౌంటర్, చంద్రబాబుకు '2' హెచ్చరికలు

విసుగు కలిగించినా...

కొంత విసుగు కలిగించినా నా మాటలు వింటే, ఆ తర్వాత అనంతపురం సమస్యలు, జనసేన బలోపేతం గురించి మాట్లాడుతానని చెప్పారు. హోదా పైన మడమ తిప్పే పరిస్థితి లేదన్నారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎలా అయింది?

పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఎలా అయిందో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టు అని చెప్పి వంచిస్తున్నారన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

పరిశ్రమల స్థాపనకు ట్యాక్స్ ఇన్‌సెంటివ్స్ ఇస్తున్నారని చెబుతున్నారని, మీకు పేపర్ మీద చెప్పేందుకే రెండున్నర సంవత్సరాలు పట్టిందని టిడిపి, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి అది అమలులోకి వచ్చే వరకు ఇంకెన్నాళ్లు పడుతుందో చెప్పాలన్నారు.

ఆ తర్వాత ఏమైనా అయితే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్రం కేంద్రం పైన విమర్శలు చేసుకుంటుందన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని పేపర్ పైన మాట ఇచ్చారన్నారు.

బీజేపీకి, కాంగ్రెస్‌కు తేడా ఏమిటి

కాంగ్రెస్ నాయకులు ఇస్తాం ఇస్తాం అని చెప్పి, కొన్ని వందల మంది చనిపోయిన తర్వాత తెలంగాణ ఇచ్చిందన్నారు. ఇప్పుడు బీజేపీ హోదా ఇస్తామని చెప్పారన్నారు. మీరు ప్యాకేజీ పైన అలాంటి మోసమే చేస్తున్నారన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి తేడా ఏమిటన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఇవ్వమని చెప్పాలని, కానీ అంకెల గారడీతో ప్రజలను వంచించవద్దన్నారు. విషయాలను మార్చి మార్చి ప్రజలను మోసం చేస్తే మా మనసులు గాయపడతాయన్నారు. అప్పుడు మా మనసులు గట్టి పడతాయని, అప్పుడు ఎలాంటి స్థాయికైనా వెళ్తాయని బిజెపి, టిడిపిలను ఉద్దేశించి హెచ్చరించారు.

2019లో ఏం చేయాలో నాకు బాగా తెలుసు

ప్రజల్లో కోపతాపాలు, భావోద్వేగాలు పెరిగే వరకు పెంచుకోవద్దన్నారు. అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ వస్తుందని చెప్పారని, ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజల్ని వంచిస్తుంటే మీ ఆత్మ క్షోభించడం లేదా అన్నారు. మీరు ఇలాగే చేస్తే 2019 ఎన్నికల సమయానికి బీజేపీని, టిడిపిని ఏం చేయాలో నాకు బాగా బాగా తెలుసునని చెప్పారు. మా ప్రాణాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ఏపీకి అన్యాయం జరిగినప్పుడు కచ్చితంగా మాట్లాడుతానని చెప్పారు.

English summary
Jana Sena party chief Pawan Kalyan speech in Public Meeting at Anantapur on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X