వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ గా జనసేన అభ్యర్థి విజయం .. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే

|
Google Oneindia TeluguNews

తెలంగాణాలోనూ తన అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది జనసేన పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఏపీలో ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానానికి పరిమితం అయ్యిందో అదే విధంగా తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క స్థానానికి పరిమితం అయ్యింది. జన సేన పార్టీ తెలంగాణలోనూ తన మార్క్ చూపించాలి అనుకుంది. కానీ . స్థానిక ఎన్నికలలో, జనసేన పార్టీ నుండి ఒకే ఒక్క అభ్యర్థి పృథ్వి ఎంపీటీసీ గా ఎన్నికయ్యారు, 400 ఓట్ల మెజారిటీతో ఆయన ఎన్నికయ్యారు.

డబ్బివ్వలేదు .. మద్యం పంచలేదు .. జనసేన పార్టీ నుండి ఎంపీటీసీగా జనగామ జిల్లా వాసి పృధ్వీ

డబ్బివ్వలేదు .. మద్యం పంచలేదు .. జనసేన పార్టీ నుండి ఎంపీటీసీగా జనగామ జిల్లా వాసి పృధ్వీ

దీంతో జనసేన మద్దతుదారులు విస్తృతంగా ఈ విజయాన్ని ప్రశంసించారు . అయితే పృధ్వీ జనసేన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పని చేశారు , డబ్బు మరియు మద్యం ఓటర్లకు పంపిణీ చేయలేదు. పృథ్వి 1457 మొత్తం ఓట్లు సంపాదించి, టిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులు 1000 ఓట్లను కూడా పొందలేకపోయారు. ఇప్పుడు పృధ్వీ జనసేన పార్టీ తరపున ఎంపీటీసీ . ఆయన జనగామ జిల్లాలోని ఘన్పూర్ మండలం జూలపల్లి గ్రామం నుండి ఆయన గెలుపొందారు. దీంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పృథ్వీకి కాల్ చేసి మాట్లాడారు . మంగళగిరిలో సమీక్ష సమావేశాలతో బిజీగా ఉన్నానని అందుకే కాల్ చేశానని చెప్పి పృధ్వీని ప్రశంసించారు జనసేనాని.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాత్మకంగానే పోటీ చేసిన జనసేన

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాత్మకంగానే పోటీ చేసిన జనసేన

జనసేన పార్టీ తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగింది . అయితే జనసేన పోటీ వెనుక వ్యూహం లేకపోలేదు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల గుర్తు మీదనే జరిగినప్పటికీ, అభ్యర్థుల కేంద్రంగానే ఎన్నిక మొత్తం సాగుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. అభ్యర్థి బలాబలాలే ప్రాతిపదికగా ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ నుంచే తీవ్ర పోటీ నెలకొని ఉంటుంది.

 తెలంగాణలో పోటీలో ఒకే ఒక స్థానానికి పరిమితం అయిన జనసేన

తెలంగాణలో పోటీలో ఒకే ఒక స్థానానికి పరిమితం అయిన జనసేన

స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యక్తి ప్రాధాన్యత ఎంతలా ఉంటుంది అంటే, స్థానిక ఎంపీ, ఎమ్మె్ల్యే, మంత్రుల సపోర్ట్ ఉన్నప్పటికీ ఒక్కోసారి స్థానిక అభ్యర్థి బలంగా ఉంటే అతన్నే విజయం వరిస్తుంది. అయితే ఇదే అదనుగా భావించిన జనసేన తెలంగాణలో విస్తరించేందుకు వ్యూహం రచించింది . ఎందుకంటే అధికార పార్టీ అభ్యర్థిత్వం దక్కని వారు, స్థానికంగా బలమైన నేతలు స్వతంత్రంగా బరిలోకి నిలిచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికి జనసేన వేదిక ద్వారా పోటీలో నిలబెడితే పార్టీకి తెలంగాణలో ఊపిరిలభించే అవకాశం ఉందని జనసేన వ్యూహకర్తలు భావించారు .కానీ కొన్నైనా వస్తాయని భావించారు. ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది జనసేన .

English summary
Jana Sena Party has made its mark in Telangana. In the local body polls, Jana Sena candidate Prithvi has been elected as MPTC as he won the poll with a majority of 400 votes.Supporters of Jana Sena are widely hailing this victory and are also appreciating Prithvi for sticking to Jana Sena norms i.e, not distributing money and liquor to the voters. Prithvi has secured a total votes of 1457 while TRS and Congress candidates failed to get even 1000 votes.Prithvi is now the MPTC of Joolapalli village of Ghanpur, Janagoan district.Meanwhile the party chief Pawan Kalyan is yet to call on Prithvi as he is busy with review meetings in Mangalagiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X