వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన ముగిసిపోయిన కథా..? లేక కొత్త అధ్యాయానికి శ్రీకారమా?

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. ఫాలోయింగ్ కు తగ్గట్టే ప్రజల్లో బాగా మమేకం అయ్యారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి వస్తున్న పవన్ కళ్యాణ్.. పార్టీ పెడుతున్న పవర్ స్టార్.. ప్రశ్నించడానికి వస్తున్న పవన్.. టీడిపి కి, వైసీపికి ప్రత్యామ్నాయం కాబోతున్న జనసేన.. ఈ పేర్లన్నీ గత రెండు, మూడు సంవత్సరాలుగా పతాక స్థాయిలో మారుమోగాయి. అందుకు తగ్గట్టే శ్రీకాకుళం నుండి గుంటూరు వరకూ అనేక సందర్బాల్లో అనేక సార్లు అనేక రాజకీయ పర్యటనలు కూడా నిర్వహించారు పవన్ కళ్యాణ్.

ప్రశ్నించడానికి ఉద్బవించిన జనసేన.. బీజేపీతో పొత్తు..

ప్రశ్నించడానికి ఉద్బవించిన జనసేన.. బీజేపీతో పొత్తు..

ప్రశ్నించడానికి ఉద్బవించిన జనసేన.. బీజేపీతో పొత్తు..
బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం అంబేడ్కర్ స్పూర్తిగా, అణగారిన వర్గాల హక్కుల గురించి పాలకులను ప్రశ్నించేందుకు ఓ గొంతు కావాలని జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని కూడా ఆకర్శించగలిగారు. రాజకీయాల్లోకి ఓ యువ నాయకుడి ప్రవేశం వల్ల సమూల మార్పులకు ఆస్కారం ఉంటుందనే ఆలోచనను కూడా ఉదయింపజేసారు పవన్ కళ్యాణ్. ప్రజల ఆకాంక్ష మేరకు జనసేన అనే రాజకీయ పార్టీని స్ధాపించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపిలోని అన్ని నియోజక వర్గాల్లో పోటీ కూడా చేసారు.

ఏపి ప్రజల పక్షాన పోరాటం చేసిన పవన్.. బీజేపి పొత్తుతో కొనసాగించాలని నిర్ణయం..

ఏపి ప్రజల పక్షాన పోరాటం చేసిన పవన్.. బీజేపి పొత్తుతో కొనసాగించాలని నిర్ణయం..

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీని కుదిపేసాయి. ఊహించని ప్రజాతీర్పుకు జనసేన తో పాటు ఇతర పార్టీలు ఖంగుతిన్నాయి. ఫలితాలు వెలుపడిన తర్వాత కొద్దిరోజులు మౌనంగా ఉన్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారంలో వెనక్కు తగ్గే పరిస్తితే లేదని తేల్చిచెప్పారు. అంతే కాకుండా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి 100రోజుల సమయాన్ని కూడా ఇచ్చారు. వంద రోజుల కొత్త ప్రభుత్వ పాలన చూసిన తర్వాత స్పందిస్తామన్న పవన్ అనుకున్నట్టే వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇసుక పాలసీతో పాటు భవన నిర్మాణ కార్మికులకు అండగా వైసిపి ప్రభుత్వంపై పవన్ పెద్దయెత్తున పోరాటం చేసారు.

Recommended Video

Janasena Party And BJP Confirms Alliance | Pawan Kalyan | Amit Shah | Narendra Modi
 బీజేపి నేతలతో పవన్ భేటీ.. కీలక నిర్ణయం తీసుకున్న జనసైనికుడు..

బీజేపి నేతలతో పవన్ భేటీ.. కీలక నిర్ణయం తీసుకున్న జనసైనికుడు..

అంతే కాకుండా వైసిపి ప్రభుత్వం తీపకున్న అమ్మఒడి, మద్యం పాలసీ, ఇసుక, ఇంగ్లీష్ మీడియం వంటి నిర్ణయాల పట్ల జనసేన వ్యతిరేకత వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయడం ఒక ఎత్తైతే పార్టీని ముందుకు నడిపించే సత్తా కూడా సవాల్ గా మారింది. కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఎంత ఖర్చు తగ్గించుకున్న కార్యాలయ నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు, మెయింటెనెన్స్ జనసేన పార్టీకి భారంగా మారినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో నాలుగు సంవత్సరాలు సమయం ఉన్నందున, ఒంటరి పోరాటం చేసే బదులు ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని పవన్ భావించినట్టు తెలుస్తోంది. అందుకోసం జాతీయపార్టీ బీజేపితో పొత్తు పెట్టుకునేందుకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్.

 ముగిసిన చరిత్రా.. లేక కొత్త అధ్యాయానికి శ్రీకారమా..?

ముగిసిన చరిత్రా.. లేక కొత్త అధ్యాయానికి శ్రీకారమా..?

ఇదిలా ఉండగా సత్వర అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాష్ట్రాల ఆవశ్యకత ఉందని ఏపీ సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాత ఏపి రాజకీయాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అధికార వికేంద్రీకరణ వల్ల పెద్దగా ఒరిగేది ఏమి ఉండదని, రాజధానితో పాటు పాలనా పరమైన సముదాయాలు మొత్తం ఒకే చోట ఉండాలని జనసేన విశ్వసిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు రాజధానిపై చేసే పోరాటంలో తనకున్న శక్తి చాలదని భావించిన పవన్ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఏపీలో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ, సరైన ఫ్టాట్ ఫార్మ్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునన్నారనే చర్చ జరుగుతోంది. దీంతో జనసేన పార్టీ ముగిసిన అధ్యాయమని కొందరంటుంటే కాదు కాదు కొత్త అధ్యాయానికి తొలి అడుగు పడిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

English summary
The Janasana believes that decentralisation will not be what is much, and that administrative complexes with the capital should be all in one place. Pawan Kalyan decided to go ahead with the Bharatiya Janata Party, which feels that his power in the fight against the capital is not enough to solve public problems. The Bharatiya Janata Party, which wants to be strengthened in the AP, is going to take the right decision at the right time to look for a proper platfarm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X