అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ గోల్డెన్ ఛాన్స్ మిస్ - సీఎం జగన్ చేతికి అస్త్రం : చంద్రబాబుకు కొత్త టెన్షన్..!!

|
Google Oneindia TeluguNews

Pawan Kalayn in AP Politics: జనసేన అధినేత పవన్ లక్ష్యం మారిందా. పవన్ ఎలక్షన్ టార్గెట్ 2024 నుంచి 2029కి మారిందా. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ వచ్చిన అవకాశం మిస్ చేసుకున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ ట్రాప్ లో చిక్కుకుంటున్నారు. వీకెండ్ పొలిటిషీయన్ అంటూ వైసీపీ విమర్శలకు అవకాశం ఇస్తున్నారు.

తన మద్దతు కోసం వేచి చూస్తున్న టీడీపీలోనూ పవన్ తీరు ఒకింత టెన్షన్ గా మారుతోంది. తాజాగా సీఎం జగన్ చేతికి పవన్ కల్యాణ్ కొత్త అస్త్రం అందించారు. అది చంద్రబాబుకు రిలీఫ్ గా మారుతోంది. ఇప్పుడు మూడు పార్టీల్లోనూ ఈ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది.

పవన్ టార్గెట్ మారిందా - అందుకే ఈ మార్పు

పవన్ టార్గెట్ మారిందా - అందుకే ఈ మార్పు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యం మారినట్లు కనిపిస్తోంది. టార్గెట్ 2024 నుంచి 209 కి రూటు మారినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. టీడీపీ నేతలే ఈ విషయాన్ని అంగీకిరస్తున్నారు. ప్రధాని మోదీతో సమావేశం తరువాత వపన్ వైఖరిలో స్పష్టమైన మార్పు మొదలైంది. దీనిని గమనించిన చంద్రబాబు పొత్తుల సంగతిని తాత్కాలికంగా పక్కన పెట్టారు.

సొంతగా బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ విశాఖ ఆ తరువాత పార్టీ కార్యాలయంలో వైసీపీ పైన చూపించిన దూకుడుకు చంద్రబాబుకు తెగ నచ్చారు. వెంటనే పవన్ బస చేసిన హోటల్ కు వెళ్లి మరీ సమావేశమయ్యారు. కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. కానీ, పవన్ అటు బీజేపీతో..ఇటు టీడీపీతో సమ దూరం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో పవన్ ప్రజల్లోకి రాకుండా.. రియల్ టైం పాలిటిక్స్ - పార్టీ నిర్మాణం పైన ఎక్కడా సమయం కేటాయించటం లేదు.

పూర్తిగా సోషల్ మీడియా పాలిటిక్స్ పైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది. దీంతో, పవన్ లక్ష్యం 2024 నుంచి మారిందనే వాదన మొదలైంది. జగన్ అటు అయిదు లక్షల మందితో ఎన్నికల సైన్యం సిద్దం చేస్తుంటే..ఇటు పవన్ ఎన్నికల ప్రచార రధం వివాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

గోల్డెన్ ఛాస్ పవన్ మిస్ చేసుకున్నారా..

గోల్డెన్ ఛాస్ పవన్ మిస్ చేసుకున్నారా..

పవన్ కు గత నెలలో విశాఖ పర్యటన..ఆ తరువాత పార్టీ సమావేశం..ప్రధానితో భేటీతో ఒక్క సారిగా ప్రాధాన్యత పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. వైసీపీ ఒక దశలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాదు, పవన్ అనే తరహాలో టార్గెట్ చేసింది. పవన్ అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

కానీ, అందివచ్చిన అవకాశాన్ని కంటిన్యూ చేసుకోవటంలో..పవన్ విఫలమయ్యారు. ప్రతీ శని, ఆది వారాల్లో మాత్రమే ఏపీకి రావటం ద్వారా వైసీపీ చేస్తున్న వీకెండ్ పొలిటీషియన్ అనే ప్రచారానికి జనసేన నేతల వద్ద సమాధానం కనిపించటం లేదు. ఇంకా ఏడాదిన్నార సమయం ఉన్నా ఎన్నికల కోసం సీఎం జగన్ ముందస్తు కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లోకి వచ్చేసారు.

వచ్చే నెల నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. తాజాగా గుజరాత్ ఎన్నికల్లో గెలుస్తాననే ధీమా ఉన్నా..ప్రధాని చాలా ముందస్తుగానే ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. కానీ, ఎన్నికల పైన ఫోకస్ చేయటం పైన కావాల్సిన స్థాయిలో చేయటం లేదు. దీంతో, ముందస్తు ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటనే చర్చ జనసేనలో మొదలైంది.

జగన్ చేతికి అస్త్రం - చంద్రబాబులో కొత్త టెన్షన్

జగన్ చేతికి అస్త్రం - చంద్రబాబులో కొత్త టెన్షన్

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తమతోనే ఉంటారనేది చంద్రబాబు నమ్మకం. తమతో దూరం పాటిస్తున్నా.. బీజేపీకి పవన్ దగ్గర కాకపోవటం చంద్రబాబుకు ఇప్పటి వరకు ఊరటనిచ్చే అంశం. అయితే, పవన్ రియల్ టైం పాలిటిక్స్ లో వ్యవహరిస్తున్న తీరు జనసేనతో పాటుగా టీడీపీలోనూ ఆలోచనకు కారణమవుతోంది.

జనసేనసంస్థాగతంగా బలహీనంగా ఉన్నా.. వపన్ పార్టీని బలోపేతం చేయటం పైన ఫోకస్ చేయటం లేదు. వైసీపీ - టీడీపీ ఇప్పటికే అభ్యర్దులను ఖరారు చేస్తున్నాయి. అసలు జనసేనలో ఇప్పటి వరకు పవన్ - మనోహర్ తప్పితే మరో నేత హైలైట్ కావటం లేదు. పవన్ ను పూర్తిగా మైండ్ గేమ్ తో వైసీపీ రాజకీయంగా ఆత్మరక్షణలోకి నెట్టేస్తుంది. పవన్ వాటికి సమాధానాలు ఇవ్వటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 2024 ఎన్నికలు తమ టార్గెట్ కాదనే విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది.

ఇదే, ఇప్పుడు సీఎం జగన్ చేతికి అస్త్రంగా మారింది. అటు చంద్రబాబు పొత్తుల దిశగా ప్రయత్నాలు ఫలించకపోవటం..ఇటు పవన్ రాజకీయం సీరియస్ గా చేయకపోవటం వైసీపీకి అనుకూలంగా మారుతోంది. దీంతో, రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.

English summary
Political Equations changing day by day in Andhr Pradesh, Janasena Chief Pawan Kalyan fails to use the golden opportunity that has become an advantage to CM jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X