వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు దమ్ము లేదు...అప్పుడు మగతనం బైటికి వస్తుంది;నేనొక్కడినే:పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్‌ మగతనం అప్పుడు బైటికి వస్తుంది : పవన్ కళ్యాణ్ | Oneindia Telugu

తూర్పుగోదావరి:తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర సందర్భంగా సిఎం చంద్రబాబు,ప్రతిపక్షనేత జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు.

సిఎం చంద్రబాబు అనేక తప్పులు చేస్తున్నారు. జగన్...మీరు శాసనసభకు వెళ్లండి...ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని లేని నేనే ఇన్ని ప్రజా సమస్యలు బయటకు తీసుకొచ్చి పరిష్కరిస్తుంటే జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజలకు ఏం న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు..."జగన్ మీరు ఓదార్పు యాత్రలు చేస్తూ ఉంటే ఎలా?...మీరు అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై నిలదీస్తే అప్పుడు మీ మగతనం బయటకి వస్తుంది"...అంటూ పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

జగన్ తీరును...ఎండగట్టిన పవన్

జగన్ తీరును...ఎండగట్టిన పవన్

ప్రజాపోరాట యాత్రలో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ప్రసంగిస్తూ ప్రతిపక్ష నేత జగన్ తీరును ఎండగట్టారు. ప్రజాసమస్యలపై నిలదీసేందుకు ఎమ్మెల్యేలను గెలిపిస్తే...జగన్ అసెంబ్లీకి వెళ్లడం మానేసి రోడ్లపై తిరుగుతున్నారని దుయ్యబట్టారు. వైసిపి ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మేలుకొని అసెంబ్లీకి వెళ్లాలని పవన్ సూచించారు.

ఆ దమ్ము,ధైర్యం...జగన్ కు లేవు

ఆ దమ్ము,ధైర్యం...జగన్ కు లేవు

తెలంగాణలో అక్కడి నాయకులకు ఎదురుచెప్పే ధైర్యం జగన్‌కు లేదని...వాళ్లు ఆంధ్రులను దోపిడీదారులని తిడుతుంటే ప్రజలు వేరు, పాలకులు వేరు అని చెప్పే దమ్ము కూడా జగన్‌కు లేనేలేదన్నారు. ఇక ఎపి సిఎం చందబ్రాబు తీరు కర్ర విరగకూడదు...పాము చావకూడదు అన్నట్లు ఉంటుందని...కానీ అలాంటి సమయంలో సైతం దమ్ముతో మాట్లాడింది నేనొక్కడినేనని పవన్‌ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

తల్లి నేర్పిన...సంస్కారం వల్లే

తల్లి నేర్పిన...సంస్కారం వల్లే

ఇక తన వ్యక్తిగత జీవితంపై జగన్‌ గతంలో చేసిన విమర్శల గురించి పవన్ గుర్తచేసి తెలంగాణ నేతలను అనే ధైర్యం లేని జగన్‌కు...మా ఇంటి ఆడపడుచులను తిట్టే ధైర్యం మాత్రం ఉందని...ఏం...పవన్‌ సినిమా వాడు ఏం చేస్తాడులే అనుకుంటున్నారా?...జగన్‌ ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయి మాట్లాడకపోవడానికి కారణం...తన తల్లి నేర్పిన సంస్కారం అని పవన్ వ్యాఖ్యానించారు.

తెలంగాణా ఎన్నికల బరిలో నందమూరి హరికృష్ణ కుమార్తె?...కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని పోటీ! <br /> తెలంగాణా ఎన్నికల బరిలో నందమూరి హరికృష్ణ కుమార్తె?...కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని పోటీ!

అందుకే...జనసేన పెట్టా

అందుకే...జనసేన పెట్టా

రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు అభ్యర్థిస్తే రాష్ట్రాభివృద్ధి కోసం జనసేన పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చిందని...కానీ నేడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి తాకట్టు పెట్టారని పవన్ ఆరోపించారు. గతంలో జనసేన పార్టీ పెట్టకుండా తనపై కాంగ్రెస్‌ పెద్దలు ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. కానీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం, రాష్ట్రంలో పేరుకుపోతున్న అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ చూసి...కుటుంబాన్ని కూడా వదులుకొని 2014లో పార్టీని ఏర్పాటు చేశానని గుర్తు చేసుకున్నారు. దళితులు, బడుగు, బలహీనవర్గాలు ఎప్పుడూ పాలితులుగానే ఉండిపోవటం కాకుండా వారిని పాలకులుగా చూడాలన్నదే జనసేన లక్ష్యమని పవన్‌ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో జనసేనకు అధికారమిస్తే స్వచ్ఛమైన పాలన అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు.

English summary
East Godavari:Janasena chief Pawan Kalyan has been criticized Opposition Leader Jagan during the public meeting in his Prajaporata yatra, East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X