వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌కు డెడ్‌లైన్‌: వైసీపీ పొత్తుకు ప్ర‌తిపాదించింది..మేమే నిరాక‌రించాం :ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌నం.

|
Google Oneindia TeluguNews

జ‌న‌సేన అధినేత మ‌రో ఆస‌క్తి క‌ర విష‌యం వెల్ల‌డించారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీతో పాటుగా వైసీపీ సైతం త‌మ‌తో పొత్తు కోసం ప్ర‌య‌త్నించింద‌ని..తాము ఒంట‌రిగా పోటీ చేయాల‌నే ఉద్దేశంతో అంగీరించ‌లేద‌ని స్వ‌యంగా ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వంద రోజుల డెడ్‌లైన్ విధించారు. పాల‌న‌లో లోపాల‌ను ఈ వంద రోజుల్లోగా స‌రి చేసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో ఇసుక కొర‌త కార‌ణంగానే త‌మ పార్టీ కార్యాల‌య నిర్మాణం నిలిచిపోయింద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

వైసీపీ పొత్తుకు ప్ర‌తిపాదించింది...వ‌ద్ద‌న్నాం

వైసీపీ పొత్తుకు ప్ర‌తిపాదించింది...వ‌ద్ద‌న్నాం

గ‌త ఏప్రిల్‌లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీతో పాటుగా వైసీపీ సైతం జ‌న‌సేన‌తో పొత్తుకు ప్ర‌తిపాదిం చాయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే, తాము ఒంట‌రిగా పోటీ చేయాల‌నే ఉద్దేశంతో పొత్తు కు ఆమోదం తెల‌ప‌లేద‌న్నారు. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంటరిగా పోటీ చేయ‌లేదు. ఆ ఎన్నిక‌ల్లో ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీ ల‌తో పాటుగా బీఎస్పీతో పొత్త పెట్టుకున్నారు. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ..వైసీపీ పొత్తు కోసం ప్ర‌య‌త్నిస్తుందం టూ జోర‌గా ప్ర‌చారం సాగింది. ఒక ద‌శ‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం వ‌ర‌కు ప‌వ‌న్ తీరు మీద ఎక్క‌డా విమ‌ర్శ‌లు చేయ‌లేదు. జ‌గ‌న్ కాకినాడ కేంద్రంగా ప‌వ‌న్ మీద చేసిన వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌ను త‌ప్పు బ‌ట్టారు. ఇక‌, జ‌న‌సేన త‌మ‌తో పాత్తు పెట్టుకోక‌పోవ‌టంతో ఎన్నిక‌ల ప్ర‌చారంలో అక్క‌డ‌క్క‌డా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద విమ‌ర్శ‌లు చేసారు. అయితే, చంద్ర‌బాబు..లోకేశ్ అవినీతి మీద జ‌గ‌న్ కంటే ప‌వ‌న్ చేసిన ప్ర‌చార‌మే ప్ర‌జ‌ల మీద ఎక్క‌వ ప్ర‌భావం చూపిం చింద‌నే అభిప్రాయం బ‌లంగా ఉంది.

Recommended Video

ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడతం- జనసేనాని
వైసీపీ నేత‌లు చెబుతుందేంటంటే..

వైసీపీ నేత‌లు చెబుతుందేంటంటే..

ఇప్పుడు ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల మీద అసెంబ్లీ లాబీల్లో ఇద్ద‌రు వైసీపీ నేత‌లు స్పందించారు. అప్ప‌ట్లో కొంద‌రు వైసీపీ నేత‌లు చంద్ర‌బాబు పైన వ్య‌తిరేకంగా ఉన్న ప‌వ‌న్‌తో క‌లిసి పోటీ చేద్దామంటూ జ‌గ‌న్ వ‌ద్ద ప్ర‌తిపాదించార‌ని చెప్పుకొ చ్చారు. అయితే, ఆ ప్ర‌తిపాద‌న‌లు జ‌గ‌న్‌..ప‌వ‌న్ మ‌ధ్య చ‌ర్చ‌ల స్థాయికి వెళ్ల‌లేద‌ని స్పష్టం చేసారు. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ ఇంకా చంద్ర‌బాబు స‌న్నిహితుడిగా పేరున్న ఒక ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌తో ట‌చ్ ఉన్నార‌నే అభిప్రాయం జ‌గ‌న్ వ్య‌క్తి చేసార‌ని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ప‌వ‌న్ తో పొత్తు పెట్టుకోవ‌టం కంటే ఒంట‌రిగా వెళ్తేనే మేలు జ‌రుగుతుంద‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పార‌ని ఆ నేత‌లు వివ‌రించారు. ఎన్నిక‌లు తొలి విడ‌త‌లోనే ఉంటాయ‌నే స‌మాచారం లేక జ‌న‌సేన చివ‌రి నిమిషం వ‌ర‌కు పొత్తులు..సీట్లు కేటాయింపుల విష‌యంలో నిర్ణ‌యం తీసుకోక పోవ‌టం ఆ పార్టీ ఓటింగ్‌ను దెబ్బ తీయ‌టానికి మ‌రో కార‌ణంగా వైసీపీ నేత‌లు ఇప్పుడు విశ్లేష‌ణ చేస్తున్నారు. ప‌వన్ త‌న ప్ర‌సంగంలో చంద్ర‌బాబు కంటే జ‌గ‌న్ పైనే ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు చేసార‌ని గుర్తు చేసారు.

జ‌గ‌న్‌కు ప‌వ‌న్ డెడ్‌లైన్‌...

జ‌గ‌న్‌కు ప‌వ‌న్ డెడ్‌లైన్‌...

ఇదే స‌మ‌యంలో వైసీపీ నేత‌లు మ‌రో విష‌యాన్ని చెప్పుకొస్తున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎక్క‌డా ప‌వ‌న్ పేరెత్త‌లేద‌నే విష‌యాన్ని తెర మీద‌కు తెచ్చారు. ఒక యాక్ట‌ర్ అని మాత్ర‌మే ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు కానీ, ఎక్క‌డా ప‌వ‌న్ పేరుతో విమ‌ర్శ‌లు చేయ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. ఇక‌, తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తు గురించి చెప్ప‌టం ఇప్పుడు అసంద‌ర్భం అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌క్ డెడ్ లైన్ విధించారు. 100 రోజుల స‌మ‌యం ఇస్తున్నామ‌ని..ఈ లోగా పొర‌పాట్లు స‌రి చేసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో ఇసుక కొర‌త మీద స్పందించారు. ఇసుక లేక‌నే త‌మ కార్యాల‌య నిర్మాణం నిలిచిపోయింద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్త‌గా ప‌వ‌న్ మ‌రోసారి పొత్తుల గురించి ప్ర‌స్తావించం పైన అటు టీడీపీలో..వైసీపీలో చ‌ర్చ సాగుతోంది.

English summary
Janasena Chief pawan Kalyan Fixed 100 days dead line for Jagan to improve his administration. Pawan raised the alliance discussions which taken place before elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X