వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప‌వ‌న్ తేల్చేసారు: బీజేపీతో పొత్తుపై స్ప‌ష్ట‌మైన‌ సంకేతాలు..!? విలీనం లేదు..క‌లిసి వెళ్లినా ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

బీజేపీతో పొత్తు దిశగా జనసేన || Pawan Kalyan Indicated Alliance With BJP In Coming Days || Oneindia

ఏపీ రాజ‌కీయాల్లో భారీ మార్పు. జ‌న‌సేన అధినేత చేసిన వ్యాఖ్య‌ల‌తో కొత్త స‌మీక‌ర‌ణాలకు తెర లేచింది. పార్టీ పొలిటి క‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. కొన్ని జాతీయ పార్టీలు త‌మ‌తో క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని కోరుతున్నాయ‌ని వివ‌రించారు. ఎవ‌రితో ప్ర‌యాణం చేసినా లౌకిక పంథాను వీడబోమ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. జ‌న‌సేన అధినేత వ్యాఖ్య‌ల‌ను లోతుగా ప‌రిశీలిస్తే..ఈ మ‌ధ్య కాలంలో బీజేపీ నేత‌లు మాత్ర‌మే ప‌వ‌న్‌తో మంత‌నాలు సాగించారుద‌. లౌకిక పంథా అని ప్రస్తావించం ద్వారా అది ఖ‌చ్చితంగా బిజేపి అనే విష‌యం స్ప‌ష్టం అవు తోంది. ఇక‌, విలీనం ఉండ‌దు కానీ..ఎవరితో ప్ర‌యాణం చేసినా..అంటూ ముక్తాయింపు ఇవ్వ‌టంతో జ‌న‌సేన ఇక బీజేపీ తో క‌లిసి న‌డ‌వ‌టానికి సిద్దం అవుతున్న విష‌యం స్ప‌ష్టం అవుతోంది.

జనసేనాని నిర్ణయం జనసైనికులకు నచ్చటం లేదట ! పార్టీలో అంతర్గత చర్చజనసేనాని నిర్ణయం జనసైనికులకు నచ్చటం లేదట ! పార్టీలో అంతర్గత చర్చ

విలీనం లేదు..ఎవ‌రితో ప్ర‌యాణం చేసినా..

విలీనం లేదు..ఎవ‌రితో ప్ర‌యాణం చేసినా..

ఏపిలో జ‌న‌సేన అధినేత కొత్త వ్యూహాల‌తో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. తాజా ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌రువాత సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న టీడీపీ కంటే ముందుగానే ప‌వ‌న్ కోలుకున్నారు. ఆ వెంట‌నే పార్టీ శ్రేణుల్లో భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. స‌డ‌న్‌గా జ‌న‌సేన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ..పొలిట్ బ్యూరో ప్ర‌క‌టించారు. అందులో పార్టీ ముఖ్యుల స‌మావేశంలో ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. కొన్ని జాతీయ పార్టీలు తమతో కలిసి ప్రయా ణం చేయాలని కోరుతున్నాయని.. ఎవరితో ప్రయాణం చేసినా లౌకిక పంథాను వీడబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. విలువలను కాపాడటం కోసం ఏర్పాటు చేసిన జనసేన పార్టీని మరే పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీని ద్వారా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు..సంకేతాలు చూస్తే ఆయ‌న జ‌న‌సేన పార్టీని ఏపిలో బ‌లోపే తం చేసుకుంటూనే..మ‌రో వైపు వైసీపీ..టీడీపీల‌ను ఎదుర్కోవటానికి బీజేపీతో క‌లిసే అవ‌కాశం ఉంద‌నే భావ‌న క‌నిపి స్తోంది. ఆయ‌న పార్టీ పేరు చెప్ప‌క‌పోయినా..లౌకిక పంథా వీడ‌బోమ‌ని చెప్ప‌టం ద్వారా అది బీజేపియే అనే విష‌యం చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

తానా స‌భ‌ల నుండే ఆరంభం....

తానా స‌భ‌ల నుండే ఆరంభం....

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మ‌ధ్య కాలంలో అమెరికాలో జ‌రిగిన తానా స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఆ స‌మావేశాల‌కు బీజేపీ ముఖ్య నేత రాం మాధ‌వ్ సైతం హాజ‌ర‌య్యారు. అక్క‌డే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఏపీలో టీడీపీ రాజ‌కీయంగా కోలుకోలేని దెబ్బ తిన్న‌ద‌ని..ఆ పొలిటిక‌ల్ వ్యాక్యూమ్‌ను తాము భ‌ర్తీ చేయ‌గ‌ల‌మ‌ని బీజేపీ నేత‌లు ధీమాగా ఉన్నారు. అందుకు అనుగుణంగానే పావులు క‌దుపుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను త‌మ‌తో క‌లిసి రావాల‌ని రాం మాధ‌వ్ సైతం అభ్య‌ర్దించిన‌ట్లు స‌మాచారం. కానీ, ప‌వ‌న్ మాత్రం ఆ స‌మ‌యంలో ఎటువంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ఇదే విష‌యం పైన గ‌తంలోనే బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్‌షా సైతం జ‌న‌సేన‌ను బీజేపీలో విలీనం చేయాల‌ని కోరార‌నే విష‌యాన్ని స్వ‌యంగా ప‌వ‌న్ అనేక మార్లు వెల్ల‌డించారు. తాను పార్టీని విలీనం చేయ‌టానికి సిద్దంగా లేననే విష‌యాన్ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేసారు. ప్ర‌జారాజ్యంను ఏక‌ప‌క్షంగా కాంగ్రెస్‌లో విలీనం చేయ టం ద్వారా జ‌రిగిన డామేజ్ రాజ‌కీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. దీంతో..ప్ర‌జ‌లు ఆద‌రించిన బీజేపీతో పొత్తు పెట్టు కోవ‌టం ద్వారా ఏపీకి..రాజ‌కీయంగా జ‌న‌సేన‌కు మేలు జ‌రుగుతుంద‌ని పార్టీలోని ఇద్ద‌రు ముఖ్య నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

జ‌గన్‌ను ఎదుర్కోవాలంటే..సామాజికంగానూ..

జ‌గన్‌ను ఎదుర్కోవాలంటే..సామాజికంగానూ..

బీజేపీ నేత‌లు ఏపీలో బ‌ల‌ప‌డేందుకు ఇక్క‌డ ప్ర‌ధాన భూమిక పోషించే సామాజిక వ‌ర్గాల‌ను దృష్టిలో ఉంచుకొని అడు గులు వేస్తున్నారు. అందునా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌జాక‌ర్ష‌ణ‌ను ఎదుర్కోగ‌లిగిన నేత కోసం అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా ప్ర‌స్తుతం ఏపిలో అంత జ‌నాక‌ర్ష‌ణ ఉన్న నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే అనే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది . ఇక‌..జ‌న‌సేన సైతం రాజ‌కీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోంటోంది. దీంతో.. ఏపీ ప్ర‌యోజ‌నాల మీద స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో ముందుకెళ్తూ.. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే ఖ‌చ్చితంగా మేలు చేస్తుంద‌నే అభిప్రాయంతో ఉన్న‌ట్లుగా అర్ద మ‌వుతోంది. దీనిలో భాగంగానే స్వ‌యంగా పార్టీ విలీనానికి నేరుగా అమిత్ షాతోనే ప‌వ‌న్ స‌సేమిరా అని తేల్చి చెప్ప‌టం తో.. ఇప్పుడు బీజేపీ పొత్తు ప్ర‌తిపాద‌న తెర మీద‌కు తీసుకొచ్చింది. ఇప్ప‌టికే వైసీపీ సైతం బీజేపీతో ప‌రోక్షంగా మైత్రి కొనసాగిస్తూనే ఉంది. టీడీపీ నేత‌లు ఏకంగా బీజేపీలోనే విలీనం అయ్యారు. ఈ ప‌రిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను సాధించ వ‌చ్చ‌ని..అదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీలు ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేద‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా. దీంతో..రానున్న రోజుల్లో ఏపీలో భారీగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో మార్పు క‌నిపించే అవ‌కాశం ఉంది.

English summary
Janasena chief Pawan Kalyan indicated alliance with BJP in coming days. In meeting party Political affairs committee Pawan says National parties inviting if went with those parties Janase stick on party commitments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X