ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వచ్చిన వారంతా ఓట్లేయరని తెలుసు, 2019లో మార్పు తీసుకొస్తా: పవన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

వచ్చిన వారంతా ఓట్లేయరని తెలుసు, 2019లో మార్పు తీసుకొస్తా : పవన్ కళ్యాణ్

అమరావతి: సామన్యులకు జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘ పోరాటం చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో మార్పు తీసుకొస్తా.. అందుకే మధ్య తరగతివారికి ఉపయోగకరంగా మ్యానిఫెస్టో సిద్దం చేశానని పవన్ అన్నారు.

వారంతా నాకే ఓట్లు వేస్తారని అనుకోను

వారంతా నాకే ఓట్లు వేస్తారని అనుకోను

మంగళవారం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాట్లాడుతూ... ‘సామాన్య జనానికి సరైన న్యాయం జరక్కపోవడం, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని జనసేన పార్టీ పెట్టనన్నారు. రాజకీయాలంటే సుదీర్గమైన పోరాటమని తెలుసు. నాదగ్గరికి వచ్చిన వారంతా ఓట్లు వేస్తారని అనుకోను' అని అన్నారు.

కష్టపడే వాడే సుఖపడాలి..

కష్టపడే వాడే సుఖపడాలి..

కష్టపడే ప్రతిఒక్కరు సుఖసంతోషాలతో బతకాలని కోరుకునేవాడినని పవన్ అన్నారు. సమస్యలను మరింత జటిలం చేయడం కంటే సమస్య పరిష్కారానికి జనసేన కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నసమస్యలపై పోరాడాలంటే చాలా శక్తి అవసరం.. అందుకు మీలోనుంచే నాయకులు రావాలని కోరుకుంటున్నానని ప్రజలకు పిలుపునిచ్చారు.

మార్పు రావాలి..

మార్పు రావాలి..

సమాజంలో మార్పు రావాలని కోరుకునేవాడిని తాను అని పవన్ తెలిపారు. పార్టీని నడిపించడం కష్టమైన పనే.. వేలకోట్లతో నడపడం కంటే మేధాశక్తితో పార్టీని నడపాలని ప్రయత్నిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతుంటే అడిగేవాడు లేకపోయాడని అన్నారు.

ఆటో డ్రైవర్లకు అండగా..

ఆటో డ్రైవర్లకు అండగా..

కష్టపడి బతికే ఆటోడ్రైవర్లను పేరుపెట్టి పిలిచే పరిస్థితిలేదు. గర్భిణి స్త్రీలకు ఉచితం అనే స్లోగన్లు ఆటోల వెనుక చూసినపుడు వారికోసం ఏమైనా చేయాలనిపిస్తోందన్నారు. ఆటో డ్రైవర్ల పట్ల జనసేన ఎప్పుడు అండగా ఉంటుంది. ఆటో డ్రైవర్లపై డిజిల్ పెట్రోల్ ధరలు ప్రభావం పడకుండా సబ్సిడీలు అందించే విదంగా చర్యలు చేపడతామని పవన్ హామీ ఇచ్చారు. ఇపుడున్న ప్రభుత్వాలు దోపిడీలు చేస్తున్న నాయకులను పక్కనబెట్టి అధికారును బాధ్యుల్ని చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో మార్పు తీసుకొస్తామని చెప్పారు.

English summary
JanaSena Chief Pawan Kalyan meeting with Auto Drivers Association in Eluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X