కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టార్గెట్ 2019: కర్నూల్ జిల్లాలో త్వరలో జనసేనాని టూర్, పవన్ ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే కర్నూల్ జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా తనకు అనుకూలంగా ఈ పరిణామాలను మలుచుకొనేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత కర్నూల్ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు. దీంతో కర్నూల్ జిల్లాలో పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చేందుకుగాను పవన్ కళ్యాణ్ త్వరలోనే పర్యటించే అవకాశం ఉందని సమాచారం.

నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ప్రధానమంత్రి మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే యోచనతో ఉన్నారని సమాచారం. దీంతో ఎన్నికల నాటికి పార్టీని అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తోంది.

త్వరలోనే కర్నూల్ లో పవన్ టూర్

త్వరలోనే కర్నూల్ లో పవన్ టూర్

త్వరలోనే కర్నూల్ జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టూర్ చేసే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళే సమయంలో కర్నూల్ జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఈ మేరకు హమీ ఇచ్చారని సమాచారం. కర్నూల్ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కోసం పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో నెలకొన్న సమస్యలపై జనసేన పార్టీ శ్రేణులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏ అంశాలపై ప్రధానంగా కేంద్రీకరించాలి,. పవన్ కళ్యాణ్ ఏ విషయాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనే విషయాలపై జనసేన కార్యకర్తలు ప్లాన్ చేస్తున్నారు.ఈ విషయాలన్నింటిని పవన్ దృష్టికి తీసుకెళ్ళనున్నారు.క్షేత్రస్థాయి నుండి వచ్చే సమాచారం ఆధారంగా కర్నూల్ జిల్లా పర్యటనకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.

బాబు ఉండగా జెఎసి ఎందుకు, కేంద్రం మాటలను నమ్మేది లేదు: కేశినేని సంచలనం బాబు ఉండగా జెఎసి ఎందుకు, కేంద్రం మాటలను నమ్మేది లేదు: కేశినేని సంచలనం

కర్నూల్ జిల్లాలో సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలి

కర్నూల్ జిల్లాలో సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలి

కర్నూల్ జిల్లాలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. . ఇటీవలే కర్నూలులో ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహించారు. కార్యకర్తలకు శిక్షణను ఇచ్చారు. స్పీకర్లు.. కంటెంట్‌ ఫైటర్లు.. ఎనలిస్టులను ఎంపిక చేశారు. లోక్‌సభ స్థానం కోసం ఓ సమన్వయకర్తను నియమించాలని అనుకున్నారు. ఇందుకోసం 20 మందితో ఓ షార్ట్‌లిస్టును తయారు చేశారు. కానీ, సమన్వయకర్తల నియామకం మాత్రం పూర్తి కాలేదు.

శుభవార్త: ఎంపీల నిరసనలతో దిగొచ్చిన కేంద్రం, లోటు భర్తీకి సిద్దంశుభవార్త: ఎంపీల నిరసనలతో దిగొచ్చిన కేంద్రం, లోటు భర్తీకి సిద్దం

2014 ఎన్నికల సమయంలోనే పవన్ టూర్

2014 ఎన్నికల సమయంలోనే పవన్ టూర్


2014 ఎన్నికల సమయంలోనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కర్నూల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే అప్పటి నుండి కర్నూల్ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు. గత ఏడాది నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారని భావించారు.కానీ, ఆ ఎన్నికల్లో జనసేన ఏ పార్టీకి కూడ మద్దతును ప్రకటించలేదు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తటస్థంగా ఉంటామని ప్రకటించారు.

 ప్రజల సమస్యలే ఎజెండాగా పవన్ టూర్

ప్రజల సమస్యలే ఎజెండాగా పవన్ టూర్

ఆయా జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నిర్వహించిన యాత్రలను ఇదే రకంగా నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలేమిటీ, వాటి పరిష్కారం కోసం ఏం చేయాలి, ప్రభుత్వం నుండి ప్రజలు ఏం కోరుకొంటున్నారు, ప్రత్యామ్నాయమార్గాలున్నాయా అనే విషయాలపై పవన్ కళ్యాణ్ అధ్యయనం చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఈ అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.రెండు ప్రధాన పార్టీల కంటే తాము ఏ రకంగా ప్రత్యామ్నాయాన్ని చూపుతామో ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేయాలని భావిస్తున్నారు.

English summary
Janasena chief Pawan Kalyan will visit in Kurnool district soon, After 2014 elections pawan kalyan not come to Kurnool district till now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X