వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్: మాన్సాస్ ట్రస్ట్‌!, తిరుమల పింక్ డైమండ్?, హిందువుల సహనానికి అదే ప్రతీక

|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయనగరం మాన్సాస్ ట్రస్టులో సంప్రదాయానికి భిన్నంగా వెళ్లారని జనసేన పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పోరాట యాత్రలో వెళ్తున్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటే మాన్సాస్ ట్రస్ట్ భూములు అని చెబుతూ ఉండే వారు. అవి చాలా అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు.

మాన్సాస్ ట్రస్ట్ సంప్రదాయాలకు విరుద్ధంగా..

మాన్సాస్ ట్రస్ట్ సంప్రదాయాలకు విరుద్ధంగా..

‘మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి సంప్రదాయాలకు భిన్నంగా వెళ్ళి ట్రస్టీలను మార్చేసిన విధంగా వేరే మతాలకు సంబంధించిన విశ్వాసాలు, ట్రస్టుల్లో చేయగలరా? హిందూ మతం కాకుండా ఏమతమైనా చేసే ధైర్యం ఉంటుందా? చేస్తే అది ఎలాంటి ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. పోనీ కొత్త ట్రస్టీలు వచ్చారు అనుకుందాం? వాళ్లేదైనా చేశారా... గోమాతలకు కడుపు మాడ్చకుండా ఉంచగలిగారా? సింహాచలంలో స్వామివారి సేవకు ఉద్దేశించిన గోశాలలో గోవులు ఆకలితో మాడిపోతుంటే జనసేన నాయకులు, శ్రేణులు, బీజేపీ నాయకులు వెళ్తేగాని స్పందన రాలేదు. అసలు ముందు హిందూ ఆలయాలకు సంబంధించి, ఆలయ భూములకు సంబంధించి సమగ్రంగా విచారణ జరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేం అడిగేది ఏంటంటే అన్ని ఆలయాలకు సంబంధించి అసలు ఎంత భూమి ఉంది అనేదానిపై ఒక సమగ్ర రిపోర్టు ఇవ్వండి. ఎంత అన్యాక్రాంతం అయ్యింది. అన్యాక్రాంతం అయిన భూములపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎంతెంత ఆదాయాలు వస్తున్నాయి.

అన్యమత ప్రచారం వద్దన్నందుకే ఎల్వీని బదిలీ చేశారా?

అన్యమత ప్రచారం వద్దన్నందుకే ఎల్వీని బదిలీ చేశారా?

‘హిందూ ఆలయాల విషయంలో దేవాదాయ శాఖలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూడాలి. హిందూ ఆలయాల పరిధిలో, పుణ్య క్షేత్రాల్లో అన్య మత ప్రచారం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని దేవాదాయ శాఖ వెల్లడించాలి. గతంలో చీఫ్ సెక్రటరీ హోదాలో ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్యమత ప్రచారం హిందూ దేవాలయాల్లో ఉండకూడదు, అన్య మతస్తులు ఉండకూడదు అన్నారు. ఆ మాట అన్న కొద్ది రోజులకే సుబ్రమణ్యం బదిలీ చేశారు. ఇవన్నీ కాకతాళీయంగానే జరిగాయా..? ఆయన ఆ మాటన్నారు కాబట్టే జరిగిందా అనేది కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముందుగా దత్తాత్రేయుడి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన పిఠాపురంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ దుర్గాదేవి విగ్రహాలను, గణపతి స్వామి విగ్రహాలను, సాయిబాబ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆ రోజే గనుక సరైన నిందితుల్ని పట్టుకుని ఉంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు' అని జనసేనాని వ్యాఖ్యానించారు.

తిరుమల పింక్ డైమండ్ గురించి ఇప్పుడు మాట్లాడరేమి?

తిరుమల పింక్ డైమండ్ గురించి ఇప్పుడు మాట్లాడరేమి?

‘మన దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే ఒక్కో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కోలా మాట్లాడుతారు అందరూ.. ఉదాహరణకు టీటీడీ ఆలయానికి సంబంధించి పింక్ డైమండ్ కనబడడం లేదు. అన్నారు. ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్లీ వాటి ఊసెవరూ ఎత్తరు. వైసీపీ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏంటంటే.. అన్నీ మీరు రివర్స్ టెండరింగ్ పెట్టారు కదా.. గత ప్రభుత్వం చేసిన తప్పులని రివర్స్ టెండరింగ్ పెట్టారు కదా.. అలాగే టీటీడీలో ఏమేమి తప్పులు జరిగాయి. పింక్ డైమండ్ ఏలా పోయింది? అనేది తేల్చాలి. వజ్రం చాలా కఠినమైంది అంటారు. అలాంటి వజ్రం మీద నాణెం విసిరేస్తే పగిలిపోయింది అంటూ ఒక హాస్యాస్పదమైన వివరణ ఇచ్చేసి తప్పించుకుంటే ఎలా. భవిష్యత్తులో కూడా ఇలాంటివి పునరావృతం కారాదు. కచ్చితంగా జనసేనను రేపు ప్రజలు ఎన్నుకుని తీసుకువస్తే ఇలాంటి వాటన్నింటినీ చాలా తీవ్రంగా తీసుకుంటాం' పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

హిందువుల మనోభావాలు పట్టవా?

హిందువుల మనోభావాలు పట్టవా?

‘మీరు ప్రజల మనోభావాలకు గానీ, మతవిశ్వాసాలను ఎవరైనా తప్పుదోవ పట్టించి కించపర్చే చర్యలకు పాల్పడితే వారిపై చాలా బలమైన చర్యలు ఉండాలి. వైసీపీకి ఇప్పుడు దీన్ని సరిదిద్దుకునేందుకు బలమైన అవకాశం ఉంది. సరిదిద్ది ప్రజల మనోభావాలను మీరు కాపాలి. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అన్ని దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరగకుండా చూడాలి. ఈ రోజు దీన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే.. రేపు కొన్ని ఇతర ప్రార్దనా మందిరాల దగ్గర ఇలాంటివి చేస్తే వివాదం అవుతాయి. గొడవలు కూడా అవుతాయి. అందుకే ముందుగా అటువంటివి జరగకుండా ఆపాలంటే.. హిందూ క్షేత్రాల్లో అన్యమత ప్రచారాలు ఆపండి. అలాగే హిందూ మతవిశ్వాసాలు లేని వారిని అక్కడ నియమించి భక్తులను కించపర్చకండి అని పవన్ స్పష్టం చేశారు.

కొన్నిపార్టీలు, సంస్థలే ఎందుకు?

కొన్నిపార్టీలు, సంస్థలే ఎందుకు?

‘ముక్కోటి దేవతలు ఉన్న పవిత్ర దేశం మనది. చెట్టూ పుట్ట అన్నింటినీ గౌరవించి కొలిచే సంప్రదాయం ఉన్న నేల ఇది. మిగతా దేశాలకు వెళ్తే వారి విశ్వాసానికి ప్రథమ స్థానం ఇచ్చి మిగతా విశ్వాసాలకు ద్వితీయ స్థానం ఇస్తారు. కానీ భారత దేశం విషయానికి వస్తే మీరు ఎవరి సంస్కృతిని వారు గౌరవించుకోండి ఎవరి మత విశ్వాసాన్ని వారు గౌరవించుకోండంటారు. ఇది ప్రజల్లో ఉదాసీనత కాదు, భయం కాదు - ధర్మం పట్ల ఉన్న గౌరవం అది. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే చేతకానితనంగా, మనకెందుకులే అన్న ధోరణి కనిపిస్తుందిగానీ వాస్తవానికి ఎవరూ గాయపడకుండా ఉండాలన్న భావనే. ఉదాహరణకు మంగళవారం, శుక్రవారం దుర్గాదేవి పూజలు చేసే ఆడపడుచులు, తల్లులు ఉంటారు. వారి మనోభావాలకు ఇబ్బందులు కలగవా? పిఠాపురంలో దుర్గాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసేశారు? వారి మనోభావాలు దెబ్బతింటాయి . కానీ వారు ఎవరికీ చెప్పుకోలేరు. ఎంతో బాధ పడతారు. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు ఎవరూ అండగా రారు. నాలాంటి వారు మాట్లాడుతారు. కొన్ని హిందూ ధర్మ సంస్థలు, కొన్ని పార్టీలే మాట్లాడుతాయి. అలాంటిది ఒక గుడి మీద, దుర్గాదేవి విగ్రహాన్ని విధ్వంసం చేసినా, స్వామి వారి రథాన్ని ధ్వంసం చేసేసినా ఎవరూ బయటకురారేంటి? భయపడతారేంటి? మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి అంటే. హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఆడపడుచుల మనోభావాలు దెబ్బతినవా? సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతినవా? వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినవా?' అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

వారి ఓట్లు కావాలని కానీ..

వారి ఓట్లు కావాలని కానీ..

మనకి ఎవరైతే ఓట్లు అనుకుంటారో వారి మనోభావాలే ముఖ్యమా? మిగతా వారంతా మన దేశ ప్రజలు కారా? వాళ్లను ఒక రూ. 2000 ఇచ్చి కొనేసుకోవచ్చా? ఈ ఆలోచన ఇది మారాలి అంటే ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం రావాలి. ఇంట్లో దీపం వెలిగించే ప్రతి భక్తుడు తమ విశ్వాసాలను కాపాడుకోవాలి. మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని ప్రజలే చెప్పాలి. ఆడపడుచులు చెప్పాలి. మీరు పూజలు, వ్రతాలు చేస్తారు. మీరే ధైర్యంగా మాట్లాడాలి. మంగళ, శుక్రవారాల్లో హారతులు ఇస్తూ మన ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అడుగులు వేయాలి. ఆడపడుచులు ప్రత్యేకించి మంగళవారాలు, శుక్రవారాల్లో ఆడపడుచులంతా నిరసన తెలపాలి. మీరు బయటకు రాకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దుర్గామాతను పూజించే నేల ఇది. ఆడపడుచులే ధైర్యం ఇవ్వాలని సంపూర్ణంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు మీరు వచ్చి మీమీ స్థాయిల్లో మనస్ఫూర్తిగా మీ నిరసనల్ని బాహాటంగా తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఈ ఘటనల గురించి ఇస్లాం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు ఖండించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మౌనంగా ఉంటే రేపు ఇతర మతాల ప్రార్థన మందిరాలపైకి వస్తారు. అందుకే అందరూ కలిసి ఏ ప్రార్ధనా మందిరం మీద దాడి జరిగినా, ఏ దేవతా విగ్రహాలు ధ్వంసం చేసినా అన్ని మతాల పెద్దలు దీన్ని సమష్టిగా ఖండించకపోతే దుష్ఫలితాలు వస్తాయి.

‘రఘుపతి రాఘవ రాజారాం...'లో మార్పే హిందువుల సహనానికి ప్రతీక

‘రఘుపతి రాఘవ రాజారాం...'లో మార్పే హిందువుల సహనానికి ప్రతీక

నిజమైన లౌకిక వాదం ఏంటంటే- నేను హిందూ మతాన్ని పాటించేవాడిని, భారతీయతను సంపూర్ణంగా అర్ధం చేసుకున్నవాడిని . గౌరవించేవాడిని. నేను హిందువుని. కానీ ఇస్లాంని గౌరవిస్తాను. క్రిస్టియానిటీని గౌరవిస్తాను. భారత దేశంలోని ప్రతి మతాన్ని, ప్రపంచంలోని ప్రతి మతాన్ని, ప్రతి సంస్కృతిని గౌరవించే వ్యక్తిని. నేనే సభలకు వెళ్లినప్పుడు ఇస్లాం పాటించే నా అభిమానులు క్యాప్ బహూకరించినప్పుడు నేను హిందువుని అయినప్పటికీ క్యాప్ ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటాను అంటే మీ విశ్వాసం పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నాను అని చెప్పేందుకు. నా మత విశ్వాసాన్ని ఇంకొకరి మీద రుద్దను. ఇంకొకరి మతవిశ్వాసాన్ని నేను ఎందుకు తీసుకోగలను అంటే.. నేను పాటించిన భారతీయ ధర్మం అలాంటిది.. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం... ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని చిన్నప్పటి నుంచి పాడుకుంటూ ఉంటాం. రాముల వారిని కీర్తించే భజన తీసుకుంటే ఒరిజినల్ గా ఉన్నది ఏంటంటే ‘రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం... సుందర విగ్రహ మేఘ శ్యామ..' ఇలా ఉంటుంది. రెండో లైన్ తీసి ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని పెట్టారు. ఇలా చేస్తే వేరే ఏ సంస్క్రృతి అయినా ఒప్పుకుంటుందా? భారత దేశ సంస్క్రతి ఎందుకు ఒప్పుకుంటుంది అంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నువ్వు ఏ రూపంలో నన్ను ప్రార్ధించినా నేను నీకుచేరువవుతాను అని ఉంటుంది. గాంధీజీ గారు లాంటి పెద్దలు ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని ఎందుకు పెట్టారంటే ఆ సహనశక్తి చూపడానికి. బలవంతుడికే ఆ సహన శక్తి ఉంటుందిగానీ బలహీనుడికి ఉండదు. దేశం తాలూకు గొప్ప లక్షణం అది. మనం ఏమీ మాట్లాడకపోతే మనోభావాలు దెబ్బతినవని రాజకీయ పార్టీలు అనుకోవచ్చుగానీ అత్యధిక ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే విషయాన్ని గ్రహించాలి. దీన్ని ఖచ్చితంగా నిలువరించాల్సిన అవసరం ఉందని వారు అర్ధం చేసుకోవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.

English summary
Janasena Chief Pawan Kalyan Responds on Mansas trust and other Issues'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X