• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నిక‌ల్లో ఓడుతాన‌ని ముందే తెలుసు..జ‌గ‌న్ ల‌క్ష్యంగా: తానా వేదికగా పవన్ సంచలనం

|
  సియం జగన్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ || Pawan Kalyan Sensational Comments On Jagan

  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఏపీలో ఈ స్థాయిలో ప‌వ‌న్ స్పందించ‌లేదు. అదే విష‌యాన్ని ఆయ‌న కూడా స్ప‌ష్టం చేసారు. అమెరికాలో జ‌రుగుతున్న తానా స‌భ‌ల్లో పాల్గొన్న ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో ఓటమి గురించి స్పందించారు. ఎన్నిక‌ల్లో ఓడుతాన‌నే విష‌యం త‌న‌కు ముందుగానే తెలుస‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

  అదే స‌మ‌యంలో జైళ్లో ఉండి వ‌చ్చిన వారే ఎటువంటి బెదురు లేకుండా జ‌నంతో ఉన్న‌ప్పుడు తాను ఓడితే జ‌నంతో ఉండ‌టానికి బెరుకు ఎందుకు ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ పేరు ఎత్త‌కుండానే ప‌రోక్షంగా అనేక వ్యాఖ్య‌లు చేసారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌న‌ను మ‌రింత బ‌లోపేతం చేసింద‌ని చెప్పుకొచ్చారు.

  ఓట‌మి గురించి ముందే తెలుసు..

  ఓట‌మి గురించి ముందే తెలుసు..

  అమెరికాలో జ‌ర‌గుతున్న ఉత్త‌రాధ్ర తెలుగు మ‌హాస‌భ‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పాల్గొన్నారు. ఆ స‌భ‌లో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తానా స‌భ‌ల‌కు వ‌చ్చే ముందు కొంద‌రు వెళ్ల‌మ‌ని..మ‌రి కొంద‌రు వ‌ద్దంటూ తన మీద ఒత్తిడి తెచ్చార ని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉంటూ కులాల వారీగా..మ‌తాల వారీగా విడిపోవ‌టం స‌రి కాద‌నే ఉద్దేశంతో..తాను గ‌తం లో ఇచ్చిన మాట కోసం తానా స‌భ‌ల‌కు వ‌చ్చాన‌ని వివ‌రించారు. తాను ప్ర‌జ‌ల‌ను క‌ల‌ప‌టానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను కానీ, ప్ర‌జ‌ల‌కు విడ‌గొట్ట‌టానికి రాజ‌కీయాలు చేయ‌న‌ని స్ప‌ష్టం చేసారు. ఖుషీ సినిమా త‌రువాత తాను స‌మాజానికి ఏం చేయాల‌న్నా అది సినిమాల ద్వారా కాద‌ని.. అందుకే పార్టీ ఏర్పాటు చేసాన‌ని వెల్ల‌డించారు. అయితే డ‌బ్బుతో ఎన్నిక లు గెల‌వాల‌నే ఉద్దేశం త‌న‌కు లేద‌ని చెప్పారు. చివ‌ర‌కు తాను ఓడినా ఆలోచించ‌లేద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఓటమి గురించి త‌న‌కు ముందుగానే తెలుసు అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు.

  జ‌గ‌న్ పైనా ప‌ర‌క్షంగా వ్యాఖ్య‌లు..

  జ‌గ‌న్ పైనా ప‌ర‌క్షంగా వ్యాఖ్య‌లు..

  రాజ‌కీయాల్లోకి రావ‌టం ద్వారా తాను ఇబ్బందులు ప‌డ‌తాన‌ని తెలిసే పార్టీ స్థాపించాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ఎన్నిక ల్లో ఫ‌లితాల త‌రువాత ఓట‌మి త‌న‌ను కుంగ‌దీయ‌లేదని వివ‌రించారు. కేవ‌లం 15 నిమిషాల్లో తాను ఓట‌మి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. చివ‌ర‌కు తాను ఓడిపోయినా త‌న‌కు బాధ క‌ల‌గ‌లేద‌న్నారు. నేను ఓడితే అభాసుపాల‌వుతానా..న‌వ్వుతారా అని ఆలోచించాను. అయితే, అదే స‌మ‌యంలో న‌న్ను ఎవ‌రూ జైళ్లో పెట్ట‌లేద‌ని.. స్కాంలు చేసి రాజ‌కీయాల్లోకి రాలేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దీనికి కొన‌సాగింపుగా.. ప్ర‌తీ ఓట‌మి త‌న‌ను మ‌రింత బ‌ల‌వంతుడిని చేసింద‌ని వివ‌రించారు. జైలు శిక్ష అనుభ‌వించ‌న వారే అధికారాలు అనుభ‌విస్తున్న‌ప్పుడు..ఎన్నిక‌ల్లో విలువ‌ల‌కు క‌ట్టు బ‌డిన తాను ఓడినంత మాత్రాన ఎందుకు బాధ ప‌డాల‌నేది త‌న ఆలోచ‌న అని చెప్పుకొచ్చారు. సినిమాలో డైలాగులు చెప్ప‌టం..ఛాలెంజ్‌లు చేసిన‌ట్లుగా రాజ‌కీయాల్లో చేయ‌లేమ‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో నా కులం..నా మతం తాను రాజ‌కీయాలు చేయ‌న‌ని స్ప‌ష్టం చేసారు.

  అప‌జయంతో వెనుక‌డుగు వేయ‌ను..

  అప‌జయంతో వెనుక‌డుగు వేయ‌ను..

  తాను వివేకానంద పుస్త‌కాలు చ‌దువుతాన‌ని..నిల్స‌న్ మండేలా స్పూర్తితో తాను ఎంత ఒత్తిడి ఉన్నా ఎలా త‌ట్టుకోవాలో నేర్చుకున్నాన‌ని ప‌వ‌న్ వివ‌రించారు. ప‌రాజ‌యం త‌న జీవితంలో త‌న‌కు ఎన్నో విజ‌యాల‌ను అందించింద‌ని చెప్పు కొచ్చారు. నిజ‌మైన విజ‌యం కోసం ఎంత కాల‌మైనా ఎదురు చూస్తాన‌ని స్ప‌ష్టం చేసారు. ప్ర‌తీ ఓట‌మి త‌న‌ను విజ‌యాని కి ద‌గ్గ‌ర చేసింద‌న్నారు. ఎన్నిక‌ల్లో తాను ఓడిపోతాన‌నే విష‌యం ముందే తెలిసినా..ఫ‌లితాల త‌రువాత కూడా తాను ఏపీలో చెప్ప‌లేక పోయాన‌ని..అక్క‌డ చెప్ప‌లేన‌ని వివ‌రించారు. అందుకే తానా స‌భ‌ల్లో ఈ విష‌యాలు చెబుతున్నాన‌ని ప‌వ‌న్ కుంబ బ‌ద్ద‌లు కొట్టారు. తానా స‌భ‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీలోనే కాదు ప్ర‌వాసాంధ్రుల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

  English summary
  Janasena Chief pawan Kalyan sensational comments in TANA celebrations in Washington. pawan said that he predicted his defeat before elections. Pawan indirectly commented on Jagan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X