వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీని దెబ్బ కొడతాను : ప్రధానికి అదే చెప్పాను - ఎలా గెలుస్తుందో చూస్తా : పవన్..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్..ప్రభుత్వ సలహాదారు సజ్జల లక్ష్యంగా జనసేనాని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను ప్రధానితో ఏం మాట్లాడిందో చెప్పుకొచ్చారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని వైసీపీ నేతలు చెబుతున్నారని..వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని పవన్ సవాల్ విసిరారు. తన మీద ప్రధానికి వైసీపీ నేతలు ఫిర్యాదులు చేసారని చెప్పుకొచ్చారు.

2024, 2029 ఎన్నికలు కీలకమని పవన్ వివరించారు. ఇప్పటం గ్రామంలో కూల్చివేతల వెనుక సజ్జల ఉన్నారని పవన్ ఆరోపించారు. 2024లో జనసేనకు మద్దతుగా నిలవండని కోరారు. జనసేన రౌడీ సేన కాదని..విప్లవ సేనగా చెప్పారు. అమరావతి రైతులు కూడా ఇప్పటం గ్రామస్థులు లాగా తెగించి పోరాటం చేస్తే..అమరావతి కదిలేది కాదని పవన్ వ్యాఖ్యానించారు.

Janasena Chief Pawan Kalyan sensational comments on YSRCP, Challenge for Sajjala

వైసీపీని దెబ్బ కొట్టాలంటే ప్రధానితో చెప్పను...

వచ్చే ఎన్నికల్లో తాను వ్యూహాత్మకంగా.. ఆచితూచి ముందుకు వెళ్తానని పవన్ స్పష్టం చేసారు. వైసీపీ హత్య రాజకీయాలను ప్రోత్సహించినా..బెదిరింపులకు దిగినా 2024 ఎన్నికల ఫలితాలు గుర్తు పెట్టుకోవాలని పవన్ హెచ్చరించారు. వైసీపీది రాజకీయ పార్టీనా..ఉగ్రవాద సంస్థా అంటూ పవన్ ఫైర్ అయ్యారు. తానంటే ఇష్టపడే వాళ్లు కూడా 2019 ఎన్నికల్లో ఓటు వేసారని పవన్ వ్యాఖ్యానించారు. తాను వైసీని దెబ్బ కొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయనని పేర్కొన్నారు.

ప్రధానితో ఎప్పుడు మాట్లాడినా దేశ భవిష్యత్.. సమగ్రత గురించే మాట్లాడానని వివరించారు. ఆంధ్రాలో పుట్టాను..ఆంధ్రాలోనే తేల్చుకుంటానని పవన్ వ్యాఖ్యానించారు. అధికారంలో లేని తన పైన వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.ప్రధానితో ఏం మాట్లాడారంటూ సజ్జల అడుగుతున్నారని..ఎందుకు అంత ఉత్సుకత అని ప్రశ్నించారు. సజ్జల తన దగ్గరకు వస్తే చెవిలో చెబుతానన్నారు. తన మీద పడి ఎందుకు వైసీపీ నేతలు ఏడుస్తారని పవన్ ప్రశ్నించారు. సత్తా అనేది అధికారంలో కానది..గుండెల్లో ఉండాలని పవన్ పేర్కొన్నారు.

Janasena Chief Pawan Kalyan sensational comments on YSRCP, Challenge for Sajjala

మీరు గెలుస్తూ ఉంటే..చూస్తూ కూర్చుంటామా

175 సీట్లు గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారని..మీరు గెలుస్తుంటే చూస్తూ కూర్చుంటామా అని పవన్ ప్రశ్నించారు. 2024 కీలక ఎన్నికలు పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీ వాళ్లు తప్పితే ఎవరూ రాజకీయాలు చేయకూడదా అంటూ నిలదీసారు. రాజకీయం మీకే సాధ్యమా.. మేము చేయలేమా అని పవన్ నిలదీసారు. వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొడతామని పవన్ హెచ్చరించారు. ఇప్పటం గ్రామాల్లో గడపలు కూల్చిన వైసీపీ నేతల గడపలు కూల్చి తీరుతామని పవన్ సవాల్ చేసారు. 2024 ఎన్నికల తరువాత వైసీపీ ఎమ్మెల్యేలంతా మాజీ లే నని..లీగల్ గానే వారి గడపలు కూల్చుతామని పవన్ స్పష్టం చేసారు.

అమరావతి రైతులు కూడా ఇప్పటం గ్రామస్థులు తరహాలో ధైర్యంగా పోరాటం చేసి ఉంటే అమరావతి ఇక్కడి నుంచి కదిలేది కాదని పవన్ వ్యాఖ్యానించారు. తనకు ముఖ్యమంత్రి పదవి కంటే ప్రజల గుండెల్లో స్థానం ముఖ్యమని వివరించారు. తాను కోడికత్తితో గీయించుకొని డ్రామాలు ఆడలేనని.. మహనీయుల స్పూర్తితో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. జనసేన రౌడీ సేన కాదని..విప్లవ సేన గా చెప్పుకొచ్చారు. దౌర్జన్యాలు చేసే వారికి తమది అలాగే కనిపిస్తుందని..సీఎం జగన్ తన పార్టీ పైన చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలకు మంచి..నిజాయితీ తో వ్యవహరిస్తే అర్దం కాదంటూ పవన్ ఫైర్ అయ్యారు.

సజ్జలపై మండిపడిన జనసేనాని..

జనసేన రౌడీ సేన కాదని..విప్లవ సేన గా చెప్పుకొచ్చారు. దౌర్జన్యాలు చేసే వారికి తమది అలాగే కనిపిస్తుందని..సీఎం జగన్ తన పార్టీ పైన చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలకు మంచి..నిజాయితీ తో వ్యవహరిస్తే అర్దం కాదంటూ పవన్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల పైన జనసేన అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సజ్జల డీ ఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆధిపత్య ధోరణితో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. వారే పెట్టి పుట్టారు.. మిగిలిన వారు బానిసలు అనే తరహాలో వ్యవహార తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మీ ఉడత ఊపులకు జనసేన భయపడదంటూ సజ్జలను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. మీరొక్కరేనా రాజకీయాలు చేసేది.. మా మంచితనం సహనం పరీక్షించవద్దని పవన్ స్పష్టం చేసారు. వివేకా చంపిన వారికి మద్దతు ఇచ్చారని... వారిని వెనుక వేసుకొని తిరుగుతున్నారంటూ విమర్శించారు. మీరు ఓట్లు వేసినా వేకపోయినా మీకు అండగా నిలబడతానంటూ ఇప్పటం ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు 39 కుటుంబాలకు పవన్ కల్యాణ్ లక్ష చొప్పున ఆర్దిక సాయం అందించారు.

English summary
Janasena chief Pawan Kalyan distributed cheques for Ippatam villages who lost house in road extension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X