వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ నయా రాజకీయం: జగన్ ఒక వర్గానికే అనుకూలమంటూ : అసలు ఆట మొదలెట్టేసారు...!!

|
Google Oneindia TeluguNews

ఎన్నికల దాకా ఒక తీరు. ఆ తరహాలో రాజకీయాలు చేస్తే గుర్తింపు ఉండదని ఆలస్యంగా అయినా గుర్తించారు. అంతే..ఎన్నికల ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే కానీ..జనసేన అధినేతకు ఏపీ లో రాజకీయా ల అర్దమైనట్లు లేవు. దీంతో..ఇప్పుడు నయా రాజకీయాలకు తెర లేపారు. ఒక విధంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని జనసేనాని ఇరుకున పెట్టారు. అంతే కాదు..రాజకీయాలను మారుస్తా మని..తనకు కులం లేదని చెప్పి ఎన్నికల వరకు రాజకీయం చేసిన పవన్..ఇప్పుడు ట్రెండ్ మార్చారు.

జగన్ ఆ హామీని అమలు చేయలేడు..! విజయమ్మ సంచలన వ్యాఖ్యలు..!!జగన్ ఆ హామీని అమలు చేయలేడు..! విజయమ్మ సంచలన వ్యాఖ్యలు..!!

ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి గారూ అంటూ పరోక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేసారు. అదే సమయంలో బొత్సా..అనిల్ లను పావులుగా వాడుకుంటూ..తమ వర్గ నేతలను మాత్రం జగన్ సేఫ్ గా ఉంచుతున్నారంటూ కొత్త ఆలోచనలు రేకెత్తించారు. అదే సమయంలో బొత్సా ఇదే ప్రభుత్వంలో సీఎం అవ్వచ్చేమో అంటూ.. కలకలం రేపారు. గతం కంటే భిన్నంగా ప్రధాని మోదీ..అమిత్ షా సామర్ధ్యాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. వారి పేర్లు చెప్పి..ముఖ్యమంత్రి .. బొత్సానుభయ పెట్టే ప్రయత్నం చేసారు..ఇంతకీ పవన్ చేస్తున్న నయా రాజకీయం వెనుక అసలు కధ ఏంటి..

జగన్ ను అలా పిలవటం వెనుక..పవన వ్యూహం..

జగన్ ను అలా పిలవటం వెనుక..పవన వ్యూహం..

జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇప్పుడు చంద్రబాబు కంటే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా రాజకీయం మొదలు పెట్టారు. వంద రోజుల వరకు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించకూడదని అనుకున్నానని అయితే వారే అవకాశం ఇచ్చారని మొదలు పెట్టి...ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. ప్రధానంగా రాజధానిలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాదని..అందిరిదీ అంటూ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల మీద పవన్ వ్యూహాత్మ కంగా స్పందించారు. కులం పేరుతో రాజధానిని తరలించి..దొనకొండ లేదా పులివెందులకు తీసుకెళ్లాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అదే సమయంలో ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి గారు అంటూ వ్యాఖ్యానించటం ద్వారా జగన్ కు ఒక సామాజిక వర్గానికి చెందిన నేతగా ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నించారు. అధికారంలోకి రావటం వెనుక జగన్ గొప్ప తనం లేదని చెప్పేందుకు ప్రయత్నించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన ప్రచారం మేరకు ఈవీఎంల ఘనతో..లేక కాలం కలిసి వచ్చిందో కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ సామాజిక సమీకరణాలను పక్కగా అమలు చేయటం వలనే గెలించదనే ఫీడ్ బ్యాక్ పవన్ కు అందింది. దీంతో.. తన గురించి ఎన్నికల సమయంలో గోదావరి జిల్లాల్లో జరిగిన ప్రచారం ..తాను ఓడిపోవటానికి కారణాలు విశ్లేషంచిన తరువాత పవన్ కొత్త వ్యూహాలు తెర మీదకు తీసుకొచ్చారు.

రెడ్డి కానివారిని డామేజ్ చేస్తున్నారంటూ..

రెడ్డి కానివారిని డామేజ్ చేస్తున్నారంటూ..

పవన్ తన ప్రసంగంలో మరో విధంగానూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వంలో వివాదాస్పద వ్యాఖ్యలు జగన్ కు చెందిన వారు..లేదా ఆయనకు దగ్గరి వారు చేయకుండా బొత్సా లేదా అనిల్ కుమార్ తో చేయిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీని ద్వారా రెడ్డి వర్గం వారిని ముఖ్యమంత్రి కాపాడుతూ.. ఇతర వర్గం వారిని వివాదాల్లో ఇరికిస్తూ డామేజ్ చేస్తున్నారనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేసారు. ఇక, సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ సీనియర్ అని..ముఖ్యమంత్రి కావాల్సిన వారంటూ ఒక వైపు బొత్సా మీద ఆరోపణలు చేస్తూనే..మరో వైపు సానుభూతి చూపుతూ మరో వైపు జగన్ మీద వ్యతిరేక భావం కలిగించే ప్రయత్నం చేసారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పక్కనే ఉండే బుగ్గన లాంటి వారు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటారని..వారికి ఇటువంటి వివాదాల్లోకి తీసుకురారని చేసిన కామెంట్ల ద్వారా ప్రభుత్వంలోనే జగన్ పైన చర్చ జరిగేలా చేయటమే లక్ష్యంగా కనిపిస్తోంది. దీని పైన బొత్సా స్పందిస్తూ..తన వోక్స్ వ్యాగన్ కేసులో తాను సాక్షిగా మాత్రమే ఉన్నానని..మోదీ..అమిత్ షా అనుకుంటే ఏదైనా జరిగిపోతుందా అని ప్రశ్నించారు. కానీ, బొత్సా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చేసిన వ్యాఖ్యల మీద మాత్రం వైసీపీ నేతలు స్పందించటం లేదు.

ప్రధాని మోదీ..అమిత్ షా ను ఆకాశానికెత్తేస్తూ..

ప్రధాని మోదీ..అమిత్ షా ను ఆకాశానికెత్తేస్తూ..

పవన్ కళ్యాణ్ అమెరికాలో తానా పర్యటన తరువాత మార్పు కనిపిస్తోంది. అక్కడ బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత అనేక పార్టీ సమావేశాల్లో పవన్ తాను జనసేనను ఏ పార్టీలోని విలీనం చేయనని పలు మార్లు స్పష్టం చేసారు. అయితే బీజేపీతో పొత్తు ఉండదనే విషయం మాత్రం పవన్ ఎక్కడా స్పష్టం చేయటం లేదు. అదే సమయంలో మోదీ..అమిత్ షా కన్ను ఏపీ ప్రభుత్వం మీద ఉందని చెబుతూ..తనకు వారి మద్దతు ఉందనే పరోక్ష సంకేతాలు పవన్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత పవన్ కళ్యాణ్ ఎక్కడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించటం లేదు. గతంలో ఇదే అంశం పైన బీజేపీని విమర్శించిన పవన్..ఇప్పుడు మోదీ .. షా ద్వయాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. గతం కంటే భిన్నంగా పవన్ చేస్తున్న వ్యూహాత్మక వ్యాఖ్యలు.. బీజేపీ నేతలకు ప్రశంసలను పరిశీలిస్తే ఏపీలో త్వరలోనే భారీగా రాజకీయ సమీకరణాలు మారటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

English summary
Janasena chief Pawan Kalyan strategically moving his political steps to face Jagan. He praising PM modi and amith shah in every meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X