వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ పైన ప‌వ‌న్ విమ‌ర్శ‌లు : ఓటు అమ్ముకున్నారు..భిక్షాట‌నే న‌యం..జ‌న‌సేనాని స‌వాల్..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఓటు అమ్ముకోవడం కంటే భిక్షాట‌నే న‌యం : ప‌వ‌న్ క‌ళ్యాణ్ || Oneindia Telugu

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన జ‌నసేన అధినేత ప‌వ‌న్ అప్పుడే విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. పార్టీ నేత‌ల‌తో స‌మీక్ష స‌మ‌యంలో ప‌వ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు. ఒక్కో ఓటు రెండు వేల‌కు కొనుగోలు చేసార‌ని...అంటే రోజు కు రూపాయి ఆదాయం అని వివ‌రిస్తూ..దీని కంటే గుడి ముందు భిక్షాట‌న చేసే ఎక్కువ డ‌బ్బు వ‌స్తుందంటూ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఇకపై త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు చూపిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

సీఎం జ‌గ‌న్‌పైన ప‌వ‌న్ ఇలా...

సీఎం జ‌గ‌న్‌పైన ప‌వ‌న్ ఇలా...

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోప‌ణ‌లు మొద‌లు పెట్టారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చేసిన ఆరోప‌ణ‌లనే ఇంకా కొన‌సాగిస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన వారికి ప్ర‌ధాని మోదీ అంటే భ‌యం అంటూ జ‌గ‌న్ పేరు ఎత్త‌కుండానే ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేసారు. తాను మాత్రం ప్ర‌ధాని ప‌ద‌విని గౌర‌విస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ ఓట‌మి గురించి స‌మీక్ష‌లు చేస్తున్న జ‌న‌సేన అధినేత‌...అందులో త‌న‌తో అభిప్రాయా లు పంచుకున్న వారి మీద ఫైర్ అయ్యారు. స‌మీక్ష‌కు హాజ‌ర‌యిన ఒక వాలంటీర్ మీద అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. నీవు వైసీపీకి ఓటు వేసి ఇప్పుడు స‌ల‌హాలు ఇస్తావా అని ప్ర‌శ్నించారు. త‌న‌ను ఓడించ‌టానికి భీవ‌రంలో ఒక మండ‌లంలోనే రెండు వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసారంటూ ప‌వ‌న్ పేర్కొన్నారు.

అలా చేయ‌టం ..భిక్షాట‌నే న‌యం

అలా చేయ‌టం ..భిక్షాట‌నే న‌యం

ఓటు అమ్ముకోవడం కంటే భిక్షాటన చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించా రు. తాను కొంత మందిని ఓటుకు ఎంతిచ్చారని అడిగితే... రూ.2 వేలు అని చెప్పారు. రూ.2 వేలను ఐదేళ్లకు విభజిస్తే రోజుకు రూపాయి వస్తుంది. గుడి దగ్గర భిక్షాటన చేసుకునే వారికి కూడా అంతకంటే ఎక్కువే వస్తాయి అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ మీడియా విభాగం విడుదల చేసిన పత్రికా ప్రకటనలోనే అధికారికంగా పేర్కొంది. గడిచిన ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయని తాను ఆశించలేదని జనసేన అధినేత వివ‌రించారు. ఓటమి ఎదురైనప్పుడే ఎవరు నిలబడతారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస వరకు జనసేన పార్టీని మోస్తానని, ఇక ముందు కూడా బలంగా నిలబడతానని, అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు.

జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..

జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..

పార్టీ నేత‌లు ఈ మ‌ధ్య కాలంలో ఒక్కొక్క‌రుగా పార్టీని వీడటం పైనా ప‌వ‌న్ స్పందించారు. పార్టీ నుండి అంతా వెళ్లిపోయి నా తాను ఒక్కడినే నిలబడతానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేమో చూస్తా నని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ తన ఆశయాలనే చూశారని, ఇకపై తన రాజకీయ ఎత్తుగడలు చూపిస్తానని చెప్పారు. అయితే, పార్టీ సీనియ‌ర్ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ పార్టీ స‌మావేశాల‌కు హాజ‌రు కాక‌పోవ‌టంతో..ఆయ‌న సైతం పార్టీని వీడుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే, మ‌నోహ‌ర్ తాను విదేశాల్లో ఉండ‌టం వ‌ల‌నే స‌మావేశాల‌కు హాజ‌రు కాలేద‌ని..తాను జ‌న‌సేన‌లోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేసారు.

English summary
Janasena Chief Pawan Kalyan target CM jagan indirectly in party reviews. Pawan says Jagan afraid of Prime Minister Modi . But, he respect only his position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X