వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదరగొట్టారు!: డెహ్రాడూన్‌లో 'స్పెషల్'గా పవన్ కళ్యాణ్, జనసేనాని ఎదుట ఓ స్వామి కోరిక!

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఆయన గురువారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అక్కడి పవిత్ర పుణ్యక్షేత్రం హరిద్వార్ వెళ్లారు. హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమానికి చేరుకొని, అక్కడి ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహరాజ్‌ను కలుసుకున్నారు. ఉత్తరాఖండ్‌లో జనసేనాని అక్కడి పద్ధతిలో తలపాగాతో కనిపించారు. ఆయన వేషధారణ అభిమానులతో పాటు అందరినీ కట్టిపడేసే విధంగా ఉంది.

పవన్ కళ్యాణ్‌ను కార్నర్ చేస్తారా, చిరంజీవికి గుడ్ న్యూస్ చెబుతారా?పవన్ కళ్యాణ్‌ను కార్నర్ చేస్తారా, చిరంజీవికి గుడ్ న్యూస్ చెబుతారా?

గంగా ప్రక్షాళణ కోసం...

గంగా ప్రక్షాళణ కోసం...

పవన్ కళ్యాణ్ పర్యటించిన హరిద్వార్ మాత్రి సదన్ ఆశ్రమం.. గంగానది ప్రక్షాళన కోసం జరిగిన పోరాటానికి ఒక వేదికగా నిలిచింది. స్వామి నిగమానంద ఇదే ఆశ్రమంలో గంగా ప్రక్షాళన కోసం 115 రోజులు అన్నపానీయాలు మానివేసి నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. 33 ఏళ్ల వయసులోనే స్వామి నిగమానంద ప్రాణాలు విడిచారు. ప్రొఫెసర్ జి‌.డి.అగర్వాల్ సైతం గంగా ప్రక్షాళన కోసం పొరాడి ప్రాణాలు విడిచారు.

నివాళులర్పించిన పవన్ కళ్యాణ్

నివాళులర్పించిన పవన్ కళ్యాణ్


గంగానది ప్రక్షాళన కోసం ప్రాణత్యాగం చేసిన స్వామి నిగమానంద సమాధి ఈ ఆశ్రమంలో ఉంది. దీనిని జనసేనాని పవన్ కళ్యాణ్ సందర్శించి, నివాళులు అర్పించారు.

దక్షిణాది నుంచి మీరు మద్దతివ్వాలంటూ...

దక్షిణాది నుంచి మీరు మద్దతివ్వాలంటూ...

పవన్ కళ్యాణ్ మాత్రి సదన్ ఆశ్రమంలో స్వామి శివానంద మహారాజ్‌ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. పవిత్ర గంగా నది తీవ్రంగా కలుషితం అవుతోందని స్వామి శివానంద మహారాజ్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రక్షాళన కోసం చేస్తున్న పోరాటానికి దక్షిణాది నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. గంగానది ప్రక్షాళణ కోసం తాము చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని పవన్ కళ్యాణ్‌ను ఆయన అడిగారు.

గంగానదిని కలుషితం చేశామంటే...

గంగానదిని కలుషితం చేశామంటే...

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... పవిత్ర గంగా నదిని కలుషితం చేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గంగానదిని పవిత్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడ్డారు.

గంగా హారతిలో పవన్ కళ్యాణ్

గంగా హారతిలో పవన్ కళ్యాణ్

కాగా, స్వామి శివానంద మహారాజ్ పవిత్ర గంగానదికి హారతిని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత, వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ పాలుపంచుకున్నారు.

పవన్ కళ్యాణ్‌కు పాగా చుట్టిన స్వామి

పవన్ కళ్యాణ్‌కు పాగా చుట్టిన స్వామి

మాత్రి సదన్ ఆశ్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు స్వామి స్థానిక సంప్రదాయ తలపాగా చుట్టారు. పవన్ ఆశ్రమం అంతా కలియతిరిగి చూశారు. స్వామివారిని ఎన్నో వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వామివారి చెప్పిన ఎన్నో వివరాలు పవన్ కళ్యాణ్ ఆలకించి విన్నారు.

English summary
Janasena chief Pawan Kalyan visited Haridwar and Matri Sadan on Thursday (October 10). He met Matri Ashram's Swamy Shivananda Maharaj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X