• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పటిష్ట పునాదుల నిర్మాణం వైపు జనసేన..!సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా సేనిని అడుగులు..!!

|

అమరావతి/హైదరాబాద్ : మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఊహించని దెబ్బ తగిలింది. ఈ దెబ్బతో జనసేనాని తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన మాత్రం... రాజకీయాల నుంచి పారిపోవడం లేదని విస్పష్టంగా ప్రకటించారు. ఓటమితో కుంగిపోలేదు. వెంటనే తేరుకుని, 2024 ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ మొదలుపెట్టారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా, పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించే కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేశారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టపరిచేందుకు కార్యాచరణకు దిగారు.

 వచ్చే ఎన్నికల్లోపు పార్టీ పటిష్టం..! పార్టీ కి ఫుల్ టైం కేటాయిస్తున్న కాటమరాయుడు..!!

వచ్చే ఎన్నికల్లోపు పార్టీ పటిష్టం..! పార్టీ కి ఫుల్ టైం కేటాయిస్తున్న కాటమరాయుడు..!!

పార్టీలో కీలక నిర్ణయాలను తీసుకునే కమిటీగా పేరున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)ని పునర్నిర్మంచనున్నారు. ఇందులో మేధావులు, రాజకీయంగా అనుభవమున్న వారు ఉంటారు. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని కమిటీలు కూడా వేయనున్నారు. వీటిలో... లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ, రాజధాని అమరావతి ప్రాంతంలో పార్టీని క్రియాశీలకంగా చేసేందుకు కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మానిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పర్యవేక్షక కమిటీ.. ఇలా వివిధ రకాలైన కమిటీలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా కమిటీలను వేయనున్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా పవన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ కమిటీలను పవన్ ఏర్పాటు చేస్తున్నారని అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి.

  టీడీపీ కి టాటా చెప్పి...జనసేనకు జై కొట్టిన వంగవీటి
   పార్టీని నడపలేనని అనేది సన్నాసులే..! తన కమిట్‌మెంట్‌ తనకుందన్న గబ్బర్ సింగ్..!!

  పార్టీని నడపలేనని అనేది సన్నాసులే..! తన కమిట్‌మెంట్‌ తనకుందన్న గబ్బర్ సింగ్..!!

  తాను పార్టీని నడపలేనని ఒక్క రోజులో ఎలా నిర్ణయిస్తారని జనసే న అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. మొక్క ఒ క్క రోజులో ఎదగదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మందైతే విలవిల్లాడిపోతారని.. తాము ధైర్యంగా కూ ర్చొని, బలంగా మాట్లాడి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్చిస్తున్నామని తెలిపారు. ఇంతకంటే చిత్తశుద్ధి ఎక్కడుంటందని ప్రశ్నించారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నా కమిట్‌మెం ట్‌ నాకుంది. ప్రజలకు అండగా ఉంటాం. జనసేనను క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసేందుకు ఇదే అనువైన స మయం. బలమైన వ్యక్తులు, వ్యక్తిత్వం ఉన్న నాయకు లు మా పార్టీలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితా లు వచ్చి నెల రోజులే అయింది. కేడర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నికల తర్వాత పార్టీ కోసం బలంగా నిలబడిన నాయకులతో కమిటీలను ఏర్పాటు చేస్తు న్నాం. రెండు రోజుల నుంచి దీనిపై చర్చిస్తున్నాం' అని తెలిపారు. రాజకీయ వ్యవహారాల కమిటీ, సమన్వయ కమిటీ, స్థానిక ఎన్నికల కమిటీ సహా తొలుతగా ఏడు కమిటీలకు ఆయన చైర్మన్లను ప్రకటించారు. మొత్తం గా 18 నుంచి 20 కమిటీల ఏర్పాటు చేస్తామన్నారు.

  కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం..! తర్వాత ప్రశ్రించి తీరుతామన్న జనసేనాని..!!

  కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం..! తర్వాత ప్రశ్రించి తీరుతామన్న జనసేనాని..!!

  నేను ఆశయాలను నమ్ముకున్నాను. గతంలో టీడీపీకి సపో ర్టు చేశాను. అందుకే ఆ పార్టీని ప్రశ్నించడానికి, వారి పై పోరాటం చేయడానికి బలమైన నైతిక హక్కు లభించింది. టీడీపీ తప్పులను ఎత్తి చూపడానికి చాలా సమయం తీసుకున్నాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎ లా పని చేస్తుంది, ఎలాంటి పాలన సాగిస్తుంది, పాలసీలు ఎలా ఉంటాయన్న వాటిని దృష్టిలో పెట్టుకుని ఏడాది వేచి చూస్తాం. ఏపీ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఏ పద్ధతిన ఈ నిర్ణయం తీసుకున్నారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అని కోరారు. తాను విజయవాడ వస్తున్న సమయంలో ప్రజలు వారి గ్రామాల్లో సమస్యలను తన దృష్టికి తెస్తున్నారని జనసేనాని చెప్పారు.

   ఏడు కమిటీల చైర్మన్లు వీరే..! ఇక సంస్థాగత బలోపేతమే తరువాయి..!!

  ఏడు కమిటీల చైర్మన్లు వీరే..! ఇక సంస్థాగత బలోపేతమే తరువాయి..!!

  ఒంటరిగానే జనసేన.. రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయాన్ని అందరూ మ రచిపోయిన సమయంలో, హోదాకు తాము అనుకూలంగా ఉంటామని మాయావతి ప్రకటించారని పవన్‌ గుర్తుచేశారు. అందుకే తాము బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. టీడీపీ పదిసార్లు మాటలు మార్చిందని గుర్తుచేశారు. హోదాకు జనసేన ఇంకా కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల తర్వాత వామపక్షాలతో భేటీ జరగలేదని, తామైతే ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయించామన్నారు. జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అక్రమ నిర్మాణాలన్నిటినీ కూల్చాలని పవన్‌ స్పష్టం చేశారు. ఒక్కదానికే అమలు చేసి, మిగిలిన వాటిని వదిలేస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందన్నారు. జనసేనలో చేరే వారిని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థానిక ఎన్నికల కమిటీ చైర్మన్‌గా తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్‌రావును నియమించారు. మైనారిటీల కమిటీ చైర్మన్‌గా అర్హం ఖాన్‌, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా అప్పికట్ల భరత్‌ భూషణ్‌, మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్‌గా రేఖాగౌడ్‌, రాష్ట్ర నిర్వహణ కమిటీ చైర్మన్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిటీ చైర్మన్‌గా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా చింతల పార్థసారథి నియమితులయ్యారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Pawan Kalyan has initiated efforts to strengthen the party institutionally. As part of this, they have completed the formation of committees that are crucial to the party structure. Pawan Kalyan is set to take action to strengthen the party from village level to the election of 2024.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more